Take a fresh look at your lifestyle.

రామానుజాచార్యుల బోధనలు ప్రపంచ మానవాళికి అనుసరణీయం

  • ఆయన జీవితం జ్ఞానం, ఆదర్శానికి ప్రతీక
  • గురువుల బోధనల వల్లనే ప్రతీ వ్యక్తిలో జ్ఞాన జ్యోతి వెలుగుతుంది
  • రామానుజుల విగ్రహం జ్ఞాన, ధ్యానానికి ప్రతీకగా నిలుస్తుంది
  • 216 అడుగుల సమతా మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
  • ప్రధాని మోదీ శ్రీరామునిలా రాజధర్మాన్ని ఆచరిస్తున్నారు : చిన జీయర్‌ ‌స్వామి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర.ఫిబ్రవరి 05 : రామానుజా చార్యుల బోధనలు ప్రపంచ మానవాళికి అనుసరణీయమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.గురువుల బోధనల వల్లే ప్రతీ మనిషిలో జ్ఞాన జ్యోతి వెలుగుతుందనీ, రామానుజుల విగ్రహం జ్ఞాన, ధ్యానానికి ప్రతీకగా అభివర్ణించారు. శంషాబాద్‌లోని ముచ్చింతల చిన జీయర్‌ ‌స్వామి ఆశ్రమంలో నిర్మించిన 216 అడుగుల రామానుజా చార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1000 ఏళ్ల క్రితమే కుల, మత రహిత సమాజ నిర్మాణం కోసం పరితపించిన రామానుజులు భావి తరాలకు ప్రేరణగా నిలిచారని కొనియాడారు. మనిషి జీవితంలో గురువు అత్యంత కీలకమనీ, భారత దేశ ప్రజలు గురువును దైవంతో సమానంగా కొలుస్తారనీ, ఇది మన దేశ గొప్పతనమనీ, ఇలాంటి సంప్రదాయం ప్రపంచంలోని మరే దేశంలోనూ లేదని చెప్పారు. రామానుజా చార్యుల బోధనలు ప్రపంచమంతా విస్తరించాయనీ, మనిషికి జాతి కన్నా గుణమే గొప్పదని ప్రవచించిన గొప్ప తాత్విక వేత్త రామానుజా చార్యులని కొనియాడారు. సమతా మూర్తి విగ్రహావిష్కరణలో పాల్గొనడం పట్ల తనకెంతో సంతోషం కలుగుతున్నదనీ, ఇది ప్రతీ భారతీయుడు గర్వించదగ్గ క్షణమని అభిప్రాయపడ్డారు.

11వ శతాబ్డంలోనే రామానుజాచార్యులు మావన కల్యాణం కోసం ఆకాంక్షించారనీ, వసంత పంచమి సందర్భంగా చిన జీయర్‌ ‌స్వామి తనతో చేయించిన విశ్వక్షేన యజ్ఞంతో తన జీవితం ధన్యమైందనీ, సరస్వతి దేవి, రామానుజా చార్యుల దీవెనలు ఒకే రోజు తనకు లభించినట్లు భావిస్తున్నానని చెప్పారు. దేశ సంస్క•తిని రామానుజా చార్యుల విగ్రహం మరింత బలోపేతం చేస్తుందని ఆకాంక్షించారు. దేశంలోని ఎంతో మంది మహోన్నతులలో రామానుజుల వారు ఒకరనీ,  సమాజంలో సమానత్వాన్ని ప్రబోదించిన రామానుజుని సూక్తి సారం చాటి చెప్పే ఆయన భారీ విగ్రహం ఐకమత్యానికి చిహ్నంగా నిలుస్తుందని పేర్కొన్నారు. చిన్న జీయర్‌ ‌స్వామి మాట్లాడుతూ ప్రధాని మోదీ పాలనలో దేశంలోని హిందువులంతా గౌరవంతో తలెత్తుకుని జీవిస్తున్నారని చెప్పారు. శ్రీరాముడే పాలకుడు కావాలని ధరిత్రి కోరుకుందనీ, అలాంటి గుణాలు కలిగిన వ్యక్తి రామానుజుల వారని పేర్కొన్నారు.ప్రధాని మోదీ రాముడి రాజధర్మాన్ని అనుసరిస్తున్నారనీ, రామానుజుల విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించడం గొప్ప విషయంగా అభివర్ణించారు.

Leave a Reply