Take a fresh look at your lifestyle.

ఉద్యమంలా ప్రచారం…హరీష్‌ ‌చుట్టే రాజకీయాలు

హుజూరాబాద్‌లో గెల్లును గెలిపించడమే లక్ష్యంగా టిఆర్‌ఎస్‌ ‌శ్రేణులు ఉద్యమంలా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించడంతో పాటు తాజాగా.. ప్రతి వంద మంది వోటర్లకు ఒక ఇంఛార్జి నియామకంతో పోలింగ్‌ ‌శాతాన్ని పెంచేలా కృషి చేస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు ఇప్పుడు రాజకీయాల్లో ముఖ్యంగా హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏ పల్లెకు వెళ్లినా, ఏ గల్లీకి వెళ్లినా, వాడకు వెళ్లినా, ఏ ఊరుకు వెళ్లినా వినిపిస్తున్న ఒకే ఒక పేరు మంత్రి హరీష్‌రావు పేరు. అక్కడ హరీష్‌రావు అంటే తెలియని వారు, ఆ పేరు వినని వారు ఎవరూ ఉండరు. ఓపికకు, చిరునవ్వుకు, కష్టపడి పని చేయడానికి కేరాఫ్‌. ‌టిఆర్‌ఎస్‌ ‌చీఫ్‌, ‌ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు నమ్మినబంటు. కేసీఆర్‌ ఆజ్ఞ వేస్తే…మంత్రి హరీష్‌రావు ఆచరిస్తారన్న ప్రచారం ఉంది. ఈ ప్రచారంకు తగ్గట్టుగానే హుజూరాబాద్‌లో మంత్రి హరీష్‌రావు  ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన ఎంట్రీతో హుజూరాబాద్‌ ‌రాజకీయ ముఖ చిత్రమంతా ఒక్కసారిగా మారిపోయింది.

హరీష్‌రావు ఎంట్రీకి ముందుగా ఈటల రాజేందర్‌కు పూర్తి అనుకూల పరిస్థితులు. ఇప్పుడు మాత్రం పరిస్థితులు పూర్తిగా మారాయి. మంత్రి హరీష్‌రావు ఎంట్రీ అవుతూనే తనదైనశైలిలో ప్రచారాన్ని మొదలుపెట్టారు. పోలింగ్‌కు గడువు దగ్గరపడతున్న కొద్దీ మాటల తూటాలతో ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. దీంతో బిజెపి, కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలు మంత్రి హరీష్‌రావు లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారు. ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరూ హరీష్‌ ‌రావు గురించి మాట్లాడుకుంటున్నారు. చర్చించుకుంటున్నారు. ఒకమాటలో చెప్పాలంటే  హుజూరాబాద్‌ ‌రాజకీయాలన్నీ హరీష్‌రావు కేంద్రంగానే నడుస్తున్నాయి. ఏది ఏమైనా సిద్ధిపేట ఫార్మూలాను హుజూరాబాద్‌ ‌బై ఎలక్షన్‌లో అమలు చేస్తుండటంతో గెల్లు గెలుపు తథ్యమనీ అక్కడ 100వోట్లకు ఇంఛార్జిగా పని చేస్తున్న ఓ నాయకుడు ధీమాను వ్యక్తం చేశాడు.

Leave a Reply