Take a fresh look at your lifestyle.

పెండింగ్ బిల్లుల సాధనకై మోకాళ్ళ పై  నిరసన సమ్మె లతోనే సమస్యల పరిష్కారం

ఘట్కేసర్ ప్రజాతంత్ర అక్టోబర్ 04:  సమ్మెలు ఉద్యమాలు కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపుతాయని సీఐటీయూ మండల కార్యదర్శి ఎన్ సబిత పిలుపునిచ్చారు పెంచిన వేతనాలు పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల  చేయాలనికోరుతూ, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు బుధవారం ఘట్ కేసర్  మండల కేంద్రంలో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు  గత 8రోజులుగా  సమ్మె చేస్తున్న ప్రభుత్వ ఏమాత్రం స్పందించక పోవడం విచారకరం అని సీఐటీయూ మండల కార్యదర్శి ఎన్ సబిత అన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ,  తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం  మధ్యాహ్న భోజన కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె లో  నీతి న్యాయం ధర్మం ఉందన్నారు. జీవో నెంబర్ 8 ప్రకారం వేతనాలు  ఏరియర్స్ తో చెల్లించాలన్నారు.  అనేక అప్పులు, చేసి విద్యార్థులకు వంట సరుకులు  తీసుకొచ్చి ప్రభుత్వం గత కొన్ని నెలలుగా  వేతనాలు  పెండింగ్ ఉంచడం శోచనీయమన్నారు.  దీంతో అప్పులపాలై కుటుంబాలు నానా ఇబ్బందులు పడుతున్నాయన్నారు తక్షణమే పెండింగ్ వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు అక్షయపాత్ర వంటి స్వచ్ఛంద సంస్థలకు మధ్యాహ్న భోజనాన్ని అప్పగించి, గత కొన్ని సంవత్సరాలుగా మధ్యాహ్నం భోజనం వండుతున్న కార్మికులకు  అన్యాయం చేయడానికి ప్రభుత్వం పూనుకుంటుందన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు గుడ్లకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్నారు. ప్రభుత్వమే గుర్తింపు కార్డులు ఇచ్చి పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యంతో పాటు  ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని సబిత డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులపై రాజకీయ వేధింపులు పెరుగుతున్నాయని, వీటిని అరికట్టాలన్నారు. సమ్మెకు అన్ని రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం యూనియన్ మండల అధ్యక్షురాలు బి పుష్ప కార్యదర్శి ఆర్ శ్రీనివాస్  ఉపాధ్యక్షురాలు ఏ ప్రేమలత, బి సంతోష, డి ధనలక్ష్మి ఆర్ జ్యోతి  ఎండి జాకేరా ఎం కవిత ఎం వరలక్ష్మి డి అన్నపూర్ణ ఎస్ శోభారాణి  ఎం పద్మ  అఫ్జల్ బి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply