Take a fresh look at your lifestyle.

స్వరాష్ట్రంలో… ఆచార్య జయశంకర్‌ ఆలోచనలకు ఆచరణకు పొంతన ఏది.?

“ఆచార్య జయశంకర్‌ ‌తన జీవితమంతా ప్రగతి శీల ఉద్యమాలకు ఆదర్శంగా, ఆదర్శవంతమైన మానవ సమాజం కోసమే అంకితం చేశారు.అదే తోవలో తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవ స్వయం పాలనకై దశాబ్దాలుగా జరిపిన పోరాటాలను,అనుభవాలను పరిగణలోకి తీసుకొని తెలంగాణ సాధనోధ్యమంలో ‘‘భావజాల వ్యాప్తిని’’ కార్యాచరణ గావించడంలో సఫలీకృతులయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాన్ని అభివృద్ధి, ఆత్మ గౌరవ పోరాటంగా చాటి చెప్పారు. తొలి దశ పోరాటం నుంచి యుద్ద భూమి లో ఎందరో బిడ్డల్ని కోల్పోయి.. ‘‘తెలంగాణ తల్లి’’ రోదిస్తున్న సమయంలో ఈ రోదనల వెనుక,ఈ ఆక్రంధనల వెనుక ‘‘రాజకీయ అధికారాన్ని’’ అడ్డం పెట్టుకుని యథేచ్ఛగా సీమాంధ్రులు సాగిస్తున్న దోపిడి వుంధని ,దీని వెనుక అరవై ఏండ్ల అణిచివేత వుంధని, అణగారిన వర్గాల వ్యతలు ఉన్నవని అర్థం చేసుకొని నిలదీసీ నిగ్గు తేల్చెంధుకు తెలంగాణ ప్రజలలో రాజకీయ చైతన్యాన్ని రగిలించినవారు జయశంకర్‌ ‌సార్‌.”

జీవితాన్ని మొత్తంగా ప్రజాశ్రేయస్సు కోసమే వెచ్చించి, హక్కుల ఉద్యమాలతో మమేకమై తెలంగాణ ఆత్మగౌరవ పోరాటాన్ని ప్రపంచ పతాక స్థాయికి తీసుకెళ్ళడంలో సిద్ధాంత భూమిక పోషించిన విద్యాధికుడు ఆచార్య జయశంకర్‌.‌తన జీవితమంతా ప్రగతి శీల ఉద్యమాలకు ఆదర్శంగా, ఆదర్శవంతమైన మానవ సమాజం కోసమే అంకితం చేశారు.అదే తోవలో తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవ స్వయం పాలనకై దశాబ్దాలుగా జరిపిన పోరాటాలను, అనుభ వాలను పరిగణలోకి తీసుకొని తెలంగాణ సాధనో ధ్యమంలో ‘‘భావజాల వ్యాప్తిని’’ కార్యాచరణ గావించడంలో సఫ లీకృ తులయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాన్ని అభివృద్ధి, ఆత్మ గౌరవ పోరాటంగా చాటి చెప్పారు. తొలి దశ పోరాటం నుంచి యుద్ద భూమి లో ఎందరో బిడ్డల్ని కోల్పోయి.. ‘‘తెలంగాణ తల్లి’’ రోదిస్తున్న సమయంలో ఈ రోదనల వెనుక,ఈ ఆక్రంధనల వెనుక ‘‘రాజకీయ అధికారాన్ని’’ అడ్డం పెట్టుకుని యథేచ్ఛగా సీమాంధ్రులు సాగిస్తున్న దోపిడి వుంధని ,దీని వెనుక అరవై ఏండ్ల అణిచివేత వుంధని, అణగారిన వర్గాల వ్యతలు ఉన్నవని అర్థం చేసుకొని నిలదీసీ నిగ్గు తేల్చెంధుకు తెలంగాణ ప్రజలలో రాజకీయ చైతన్యాన్ని రగిలించినవారు జయశంకర్‌ ‌సార్‌.‌తెలంగాణ వాదం పట్ల,తెలంగాణ కు జరుగుతున్న అవమానాలు, అన్యాయాలపట్ల సామాన్య ప్రజానికాన్నికి సైతం అర్థమయ్యే రీతిలో లోతైన అవగాహన కల్పించారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రాజకీయ పార్టీల పాట్లు, ఎన్నికలు, ఓట్లు, సీట్లు లాబీయింగ్‌ అనే ప్రక్రియ విఫల ప్రయోగం మిగిలి పోతున్న ప్రతి సందర్భంలో తెలంగాణ వాదాన్ని సజీవంగా ఉంచడంలో, ప్రజలను చైతన్యవంతులు గా ఉంచడం లో జయశంకర్‌ ‌గారి పాత్ర వెలకట్టలేనిది.

ఉద్యమం లో సకల జనులను భాగస్వామ్యం చేయుట కొరకు ప్రొ:జయశంకర్‌ ‌సార్‌ ‌తెలంగాణ భావజాల వ్యాప్తి -ప్రజా ఆందోళనలు -రాజకీయ ప్రక్రియ అనే రూపాల ద్వారా తెలంగాణ గమ్యాన్ని చేరటానికి శ్రీకారం చుట్టారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం న్యాయమైన డిమాండ్‌ అనే సిద్దాంతాన్ని ఆంధ్రా మేధావులను సైతం అంగీకరించేవిధంగా వివరించారు. తెలంగాణ పోరాట ప్రతీకల ని ముందుకు తీసుకువచ్చి చారిత్రక, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ అణిచివేత వంటి చర్యలని నిర్ద్వదంగా ఖండించారు. రాజకీయ సమీకరణాల విశ్లేషణలో సలహాలు ఇస్తూనే ఇటు మేధావుల్లో, కవులు, రచయితల్లో, ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి సడలకుండా కృషి చేశారు. ఉద్యమం చల్లబడుతున్నప్పుడల్లా అటు రాజకీయ నాయకులను, ఇటు ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య పరుస్తూ ఉద్యమాన్ని బతికించారు.స్వార్థ రాజకీయ నేతల ని నగ్నంగా నడిబజారులో నిలబెట్టడంలో సఫలీకృతులయ్యారు. రాజకీయ పార్టీల, నాయకుల పునాదులు కదిలించి,ప్రజలకు పార్టీలపై గల భ్రమలను తొలగించేందుకు దోహదపడ్డారు.తెలంగాణ లో పోరు బిడ్డలను కోల్పోయిన వీరమాతల గర్భశోకానికి ముగింపు పలకాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ వాదిపైన ఉందని యావత్‌ ‌తెలంగాణ జాతి ని ఒక్క తాటిపై నిలిపి వారి సాహాసోపేతమైన పోరాట పటిమను ఈ ప్రపంచానికి చాటి చెప్పారు. అదే క్రమంలో బావ వ్యాప్తి ద్వారా తెలంగాణ యువతను అగ్గిరవ్వలుగా మార్చిండు.

ఎక్కడికి అక్కడ విడిపోయి, సంస్కృతిని, పండుగలను మరిచి, బతుకుతున్న వాళ్ళను ఒక దగ్గర చేర్చి జన సంద్రం ఓలే కలిపిన వాడు జయశంకరుడు.‘పాయలు పాయలైన కాలువలని,మైదానాల వరకు బాటసారి ఐ ఉద్యమాన్ని ఎవరు మధ్యలో వదిలినా తను మాత్రం ఓడిపోక ముందుకు సాగినాడు. ఎవరు ‘జై తెలంగాణ’ అన్నా మేనల్లుడులా వాండ్లను ఎత్తి దించినాడు. పోరాటంలో భాగస్వాములైన వారిని అమితంగా ప్రేమించినవాడు జయశంకరుడు.తెలంగాణ సాధన కోసం ఆలోచనా పోరాటం సాగిస్తూనే ఈ తండ్లాటను ఊర్లకు ఊర్లకు పాకించడం తప్ప, ఇంకొక మార్గంలేదన్నారు. తెలంగాణనే మన చందమామ అని సబ్బండవర్గాలు మమేకమై ఆ చందమామను అందుకోవడానికి ముఖ్య భూమిక పోషించాలని సూచించారు. ఎట్టకేలకు అవమానాలనుండి, ఆధిపత్యం నుండి భయటపడి అమరుల త్యాగాల పునాదుల మీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్దించింది.ఐతే ఈ విషయం ఆరుదశాబ్ధాలు రాజ్యమేలిన కోస్తా, రాయలసీమ కాంట్రాక్టర్లకు,సంపన్నులకు, పారిశ్రామిక, వ్యాపారవేత్త లకు తెలంగాణ రాష్ట్ర సాధన మింగుడు పడని విషయం.ఇది సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా దోపిడి వ్యవస్థకు వుండే నైజం.

తెలంగాణ సంపదను అమ్మడం జయశంకర్‌ ఆలోచనలకు విరుద్ధం..
రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ లో దశాబ్దాల పాటు సీమాంధ్ర పాలకులు సృష్టించిన విధ్వంసానికి,వారు కొనసాగించిన పాలన సంస్కృతికి భిన్నంగా తెలంగాణ లో విధాన నిర్ణయాలు జరగాల్సి ఉందని జయశంకర్‌ ‌సార్‌ ‌సూచించారు.సమైక్య రాష్ట్రంలో పాలనా విధానాలు కాంట్రాక్టర్ల,కార్పోరేట్‌ ‌శక్తుల కేంద్రంగా రూపకల్పన చేశారని, ఆ విధంగా కాకుండా తెలంగాణ రాష్ట్రం లో పాలనలో ను,పైసలోను పౌరులను భాగస్వామ్యం చేసే విధంగా విధానాల రూపకల్పన జరగాలని అదే ప్రజాస్వామ్య స్పూర్తి కి నిదర్శనమన్నారు జయశంకర్‌.‌తెలంగాణ లో ‘‘సంపద’’ ను సృష్టించాలని జయశంకర్‌ ఆకాంక్షించారు. నేటి ముఖ్య మంత్రి గారు కూడ వచ్చిన కొత్తలో మనం అభివృద్ధి చెందా లంటే సంపదను సృష్టిం చాలని.. అందుకు కావాల్సిన వనరుల ను ప్రభుత్వం సమ కూరుస్తుంద•ని చిలుక పలుకలు పలికారు.కాని అందుకు విరుద్దంగా తెలంగాణ సం• •దను బహిరంగ మార్కెట్‌ ‌లో వేళం వేస్తూ ఆరుమూరుకు కాంట్రాక్టర్లకు /కార్పోరేట్‌ ‌శక్తులకు అంటగడుతూ తెలంగాణ ను ఆగంభట్టిస్తూ.. సీమాంధ్ర పాలకులు కొనసా గించిన దోపిడి కంటే పదింతలు రెట్టింపు దోపిడి చేస్తూ.. సమైక్య పాలకుల విధానాలను ఏడేండ్ల కాలం గా కొనసాగిస్తున్నది వాస్తవం కాదా..! జయశంకర్‌ ‌సార్‌ ‌మాటల్లో తెలంగాణ అభివృద్ధి చెందాలి,అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి అనడం అంటే, మన నిధులు మనకు దక్కడం అంటే మూడు లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాలా తీయించడమా..!

నది జలాల విష యంలో ముఖ్యమంత్రి మౌనం దేనికి సంకేతం.?
నీళ్ల విషయాన్ని కి వస్తే క్రిష్ణా,గోదావరి జలాలో మనకు రావాల్సిన న్యాయబద్దమైన వాటాను అన్యాయం గా ఆంధ్రా ఆదిపత్య వర్గాలు ఎత్తుకు పోతున్నారని,మన దగ్గర ప్రాజెక్టులను కట్టకుండా,మన పంటలను ఎండబెడుతున్నారని లెక్కలతో సహా శాస్త్రీయమైన నివేదికలను సమాజం ముంధు ఉంచిన ఆచార్య జయశంకర్‌ ‌గారు పాలకులకు గుర్తున్నారా.! వారు చెప్పిన లెక్కలు గుర్తున్నాయా.! క్రిష్ణా నది 68%.తెలంగాణ తలాపున పారుతున్నా.. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడ 34% జలాలు కూడ మనకు దక్కడం లేదంటే ప్రాబ్లమ్‌ ‌పాలకులదా..! ప్రజలదా..! గోదావరి నది తెలంగాణ లో 79% పరివాహక ప్రాంతంలో ప్రవహిస్తున్నా 32% నది జలాలు కూడ దక్కడం లేదంటే నది జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎంత మేరకు ఇటు పక్క రాష్ట్రం తో,అటు కేంద్రం తో కొట్లాడుతుందో తెలంగాణ ప్రజానికాన్నికి అర్థమవుతుంది.మన నీళ్లు మనకు దక్కాలంటే రాష్ట్ర ఏర్పాటు ఒకటే మార్గమన్న జయశంకర్‌ ఆలోచనలను మన పాలకులు స్వరాష్ట్రంలో ఆచరణలో పెట్టిందెక్కడ.? దొంగే దొంగ దొంగ అన్నట్లుగా పోతిరెడ్డిపాడు కు మరో పొక్క పెట్టి న ఆంధ్రా ప్రభుత్వం కు సంబంధించిన ప్రజాప్రతినిధులు నది జలాల విషయంలో పార్లమెంటు లో గగ్గోలు పెడుతున్నా..తెలంగాణ పార్లమెంట్‌ ‌సభ్యులు మౌనంగా ఉండటంలో అంతర్యమేమిటి.? నది జలాలో తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన వాటా కోసం తెరాస ఎంధుకు కార్యచరణ రుపొందించడం లేదు.?

జయశంకర్‌ ఆశించిన ఉపాధి ఏది.?
నియామకాల విషయంలో తెలంగాణ యువత నష్ఠపోతుందని,అన్ని ప్రధాన విభాగాలలో ఆంధ్రావారే తిష్ఠ వేసినారని ఇది క్షమించరాని నేరమని అనాడే జయశంకర్‌ ‌గారు అన్నారు. ఆనాడు ఉధ్యమం పై ఉక్కుపాదం మోపిన పోలీసు అధికారులే.. రాష్ట్రం వచ్చి ఏడేండ్లైనా వాల్లే కొనసాగుతూ ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కుతున్నారంటే స్వయం పాలనలో ఆత్మగౌరవానికి విలువెక్కడ.?పోలీసు డిపార్ట్మెంట్‌ ‌నుండి మొదలుకొని అనేక డిపార్ట్మెంట్‌ ‌లలో సీమాంధ్ర ఉధ్యోగులే ఇంకా కొనసాగుతున్నారంటే ఆంధ్రా పాలకుల పై కొట్లాడి రాష్ట్రం సాదించిన యువత బతుకుకు భరోసా ఎక్కడ.? స్వరాష్ట్రంలో ఏడేండ్ల కాలంలో 1 లక్ష 32 వేయిల ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రభుత్వ పెద్దలు చెపుతున్నారు.ఇవొక మోసపూరితమైన లెక్కలు అనేవి యువత తేల్చి చెప్పింది.రాష్ట్ర అవతరణ నాటికి ఉన్న ఖాళీలనే పాలకులు నేటి కి పునరావృతం చేస్తున్నారు తప్ప..రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఎంత మంది ఉద్యోగ విరమణ పొందారు..? ఏ సెక్టార్‌ ‌లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.? కొత్తగా ఏర్పడిన 23 జిల్లా లోను,రెవెన్యూ డివిజన్‌ ‌కార్యాలయాలలోను,మండలాలోను ఎంతమంది ఉధ్యోగులు అవసరమో అనే లెక్కలు మాత్రం చెప్పరు,భర్తీ చేయరు.కాని రాజకీయ రంగంలో ఎమ్‌.ఎల్‌.‌సి స్థానాలకు ఖాళీ ఏర్పడినా,ఏమ్యేల స్థానానికి ఖాళీ ఏర్పడినా ఆగమేఘాల మీద,అనుకున్న సమయం కంటే ముంధే రాజకీయ నిరుద్యోగులతో భర్తీ చేస్తరు.అంటే రాజకీయ పదవుల పట్ల వున్న శ్రద్ద రాష్ట్రం కోసం కొట్లాడిన యువత పట్ల లేదనేది స్పష్టం గా కనబడుతుంది. 2018 ఎన్నికల్లో నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పి ఓటు బాంకు కోసం యువతను వాడుకున్నది తప్ప ఇచ్చిన దాఖలాలు లేవు.సుమారు 25 లక్షలకు పైగా యువత తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌వద్ద ఎన్‌ ‌రోల్మెంట్‌ ‌చేసుకున్నప్పటికి,లక్షల్లో ఉధ్యోగాలు ఖాళీగా వున్నా ఆ లెక్కలు మాత్రం ప్రభుత్వం చెప్పదు,భర్తీ దిశగా అడుగులు వేయదు. సర్కార్‌ ‌నిరంతరం నఖిలి లెక్కలు చెప్పి యువతను మోసం చేయాలని చూస్తుందేగాని వారి ఆకాంక్ష లను ఏ విధంగా నేరవేర్చాలనే చిత్తశుద్ధి లేదు.ఇలా జరుగుతదని జయశంకర్‌ ‌సార్‌ ‌కళలో కూడ ఊహించి ఉండకపోవొచ్చు.

ప్రజాస్వామికికరణ అంటే నోట్ల కట్టలతో ఓట్లు కొనడమా.!
జయశంకర్‌ ‌మాటల్లో తెలంగాణ ప్రజాస్వామికరించబడడం అంటే నోట్ల కట్టలతో ఓట్లు కొనడమా..! చైతన్యవంతమైన ప్రజలను తాయిలాల పేరు తో లొంగదీసుకోవడమా.! ఎన్నికల పథకాల ను తీసుకొచ్చి పోటిచేసే రాజకీయ ఆలోచనలకు బడుగులను దూరం చేసి ఓటు వేసే యంత్రాలు గా పరిగణించడమా..! ఎన్నికలప్పుడు సంచలన ప్రకటనలు చేయడం సంక్షేమమా.! ప్రజాస్వామ్యాన్ని కి ఆయువు పట్టైన ప్రశ్నించే గొంతుకలను బందించడమా.! ఇదేనా జయశంకర్‌ ‌సార్‌ ఆకాంక్షించిన తెలంగాణ..?

జయశంకర్‌ ‌ను స్మరించుకోవడం అంటే ప్రతి పైస ప్రజలకు దక్కేటట్లు కాపాలా ఉండడం..
తెలంగాణ ప్రజలు ‘తెలంగాణ జాతిపితగా’ పిలుచుకునే జయశంకర్‌ ‌సార్‌ ఆశలు, ఆశయాలు, స్వరాష్ట్రంలో అణగారిపోయిన బతుకులలో వెలుగులు నింపడం ద్వారా చిగురిస్తాయని,అజ్ఞానంలో అంధకారంలో మగ్గిపోతున్న మట్టిమనుషుల బతుకులకు భరోసా దొరకడం ద్వారా వారి ఆశయం ఫలిస్తుందని తెలంగాణ సమాజం కళలుగన్నది.కాని ఆ వైపు గా కనీసం అడుగులు కూడ పడడం లేదనేది యదార్థం.ఇప్పుడు తెలంగాణ లో అధికారం అనే అసహనం పాలనచేస్తుందని తెలంగాణ ప్రజలకు ఉన్న పోరాట వారసత్వాన్ని నిలబెట్టుకుంటూనే తెలంగాణ లో సహానం అనే పునాదులు మీద ప్రజాస్వామ్య వ్యవస్థ ను నిర్మించాలని తెలంగాణ విద్యావంతుల వేదిక బలంగా విశ్వసిస్తుంది. జయశంకర్‌ ‌సార్‌ అభిప్రాయం లో బౌగోళిక తెలంగాణ తోనే తమ కర్తవ్యం ముగిసిపోరాదని ఏర్పడబోయే నూతన రాష్ట్రంలోని ‘‘సంపద’’ ప్రతి పౌరునికి అందేవిధంగా తెలంగాణ పౌర సమాజం తెలంగాణ పునర్నిర్మాణం లో (వాచ్‌ ‌డాగ్‌) ‌కాపలా కుక్క లా పనిచేయాలని సూచించారు.ఆ వైపు గా ప్రజా క్షేత్రం లో పని చేసిన జయశంకర్‌ ‌సార్‌ ‌జయంతి ని జరుపుకోవడం అంటే తెలంగాణ సంపద దుర్వినియోగం కాకుండా ప్రజలకు దక్కేవిధంగా కోట్లాడం,జయశంకర్‌ ఆశయాలను ముంధుకు తీసుకుపోవడం అంటే కృష్ణా గోదావరి జలాలో జరుగుతున్న దోపిడి కి అడ్డుకట్టవేసి మన దర్మబద్దమైన వాటాను మనం సాదించుకోవడం,జయశంకర్‌ ‌మార్గంలో పయనింఛడం అంటే ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేస్తూ ఉధ్యోగాల కల్పన కోసం నిరుధ్యోగుల పక్షాన పోరాడడం,జయశంకర్‌ ఆలోచనలను కొనసాగించడం అంటే ఉల్లంఘించబడుతున్న పౌర హక్కులను కాపాడుకోవడం,అంతిమంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిలబడడం ఆ వైపు గా తెలంగాణ విద్యావంతుల వేదిక తన శక్తి మేరకు కర్తవ్యాన్ని కొనసాగిస్తుంది.

– తెలంగాణ విద్యావంతుల వేదిక పక్షాన..
పందుల సైదులు
9441661192

Leave a Reply