Take a fresh look at your lifestyle.

బిజెపి మునిగిపోయే నావ

  • అందులో చేరిన వారు మునిగి పోవడం ఖాయం
  • బిజెపిని విమర్శించిన ఈటల అందులోనే చేరడం దారుణం
  • కెసిఆర్‌ను విమర్శించే నైతిక హక్కు ఈటలకు లేదు
  • మిడియా సమావేశంలో మంత్రి జగదీశ్వర్‌ ‌రెడ్డి

బిజెపి మునిగిపోయే నావలాంటిదని, దానిలో చేరేవారంత మునగడం ఖాయమని మంత్రి జగదీష్‌ ‌రెడ్డి అన్నారు. బిజెపి తెలంగాణకు చేసిందేమిటో చెప్పాలన్నారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించి, బిజెపిని విమర్శించిన ఈటెల ఇప్పుడు ఏ విధంగా సమాధానం చెబుతారని అన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ‌సోమవారం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి జగదీష్‌ ‌రెడ్డి వి•డియాతో మాట్లాడుతూ ..ఈటల ఎక్కింది మునిగిపోయే నావా అంటూ ఎద్దేవా చేశారు. ఈటల బీజేపీలో చేరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈటల చెప్పిన మాటలకు, చేసే పనులకు పొంతన లేదు.. ఆయన బీజేపీలో చేరి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేశారని జగదీష్‌ ‌రెడ్డి మండి పడ్డారు. కేంద్రం తీరుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. హుజూరాబాద్‌ ‌ప్రజలకు ఈటల ద్రోహం చేస్తున్నారని కూడా మంత్రి జగదీష్‌ ‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.

భూఆక్రమణల ఆరోపణలు నేపథ్యంలో ఈటల రాజేందర్‌.. ‌కొద్ది రోజుల కిందటే టీఆర్‌ఎస్‌కు గుడ్‌ ‌బై చెప్పారు. భూకబ్జా ఆరోపణల కారణంగా ఈటలను ఇటీవల టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ ‌చేసింది. అనంతరం పార్టీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన ఈటల సోమవారం బీజేపీలో చేరారు. దీంతో హుజూరాబాద్‌ ‌నియోజకవర్గం ఉప ఎన్నిక అనివార్యం అయింది. బీజేపీలో చేరిన ఈటలకు కేసీఆర్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. ప్రత్యేక ఎజెండాతోనే ఈటల రాజేందర్‌ ‌బీజేపీలో చేరారని అన్నారు. బీజేపీతో పాటు రాజేందర్‌ ‌కూడా మునిగిపోవడం ఖాయం. రాజకీయాల్లో విబేధాలు రావడం సహజమన్నారు. ఈటల మునిగిపోయే పడవ ఎక్కుతున్నారు. నియోజకవర్గ ప్రజలను ఈటల మోసం చేశాడు. బీసీలకు బీజేపీ చేసిందేమిటని ఈటల పలుసార్లు ప్రశ్నించారు.

టీఆర్‌ఎస్‌ ‌కంటే బీజేపీలో ఏం మంచి చూసి చేరాడో ఈటలకే తెలియాలి. ఈటల చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేదు. ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకు ఈటల టీఆర్‌ఎస్‌లో ఉండాల్సింది. టీఆర్‌ఎస్‌ను ఎవరైనా వీడిపోతే వారికే నష్టం. గుంపును వదిలి అడవిలోకి పోతే.. మృగాల పాలవుతారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దూసుకునిపోతోంది. ఏ రాష్ట్రం కూడా తెలంగాణతో పోటీ పడే పరిస్థితి లేదు అని మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. 24 గంటల విద్యుత్‌ ‌మొదలు, రైతు సంక్షేమ పథకాల వరకు అనేక కార్యక్రమాలు జరుగుతున్న తీరు తెలంగాణ అభివృద్దికి నిదర్శనమని అన్నారు.

Leave a Reply