Take a fresh look at your lifestyle.

స్టార్టప్‌లపై కొరోనా ప్రభావం

కోవిడ్‌-19 ‌ప్రభావం వల్ల తొలిదశ పెట్టుబడుల పరిమితులను 30 నుంచి 37 శాతానికి తగ్గవచ్చు. తొలిదశ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు వచ్చే త్రైమాసికాల్లో పెట్టుబడుల పరిమితులను తగ్గించవచ్చు. వారు ప్రస్తుతం ఉన్న పోర్టుఫోలియో కంపెనీల కోసం నిధులను అట్టిపెట్టవచ్చు. ఫిబ్రవరిలో బెంగళూరు కేంద్రంగా పని చేసే ఫిన్‌ ‌టెక్‌ ‌వ్యవస్థాపకుడు ఓవర్‌ ‌సబ్‌ ‌స్రైబ్‌ ‌సీరీస్‌లో పెట్టుబడులు పెట్టి మధ్యలో ఉన్నారు. ఐదు మిలియన్‌ ‌డాలర్లకు భారత నిధులను తీసుకుని వెళ్ళేందుకు నిర్దేశించిన ఫండ్‌లలో వీటిని పెట్టుబడులుగా పెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకున్నాం..అయితే, ఉన్న పళంగా ఒక ఫోన్‌ ‌కాల్‌ ‌వచ్చింది. కోవిడ్‌ -19 ‌బయటపడిందన్నది ఆ ఫోన్‌ ‌కాల్‌ ‌సారాంశం. మా స్టార్టప్‌లపై కోవిడ్‌ ‌ప్రభావం గురించి సమాచారం వచ్చిందని ఆ సంస్థ వ్యవస్థాపకుడు చెప్పారు. మేమే కాదు, మాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. దాంతో కొద్ది రోజుల తర్వాత మేం బయటకు వచ్చేశాం. ఈ సంస్థలు ఒప్పందాలనూ, ఒడంబడికలను చాలా గౌరవిస్తాయి. కోవిడ్‌ ‌వల్ల తొలిదశ ఒప్పందాలు మొదటి త్రైమాసికంలో 37 శాతం అంటే 228కి పడిపోయాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే పెట్టుబడులు బాగా పడిపోయాయి. నిధుల సేకరణ విధుల్లో ఉన్న ఒక న్యాయవాది అమెరికా, యూరప్‌లలో 11 ఒప్పందాలు వడ్డీలను దక్కించుకున్నాయని చెప్పారు. ఆసియాకి చెందిన సంస్థలు మూసేశారని చెప్పారు. ఓరిస్‌ ‌వెంచర్స్ ‌మేనేజింగ్‌ ‌పార్టనర్‌ అనూప్‌ ‌జైన్‌ ‌వచ్చే 90 రోజులు ఈ ఒప్పందాలకు చాలా కీలకమైనవని అన్నారు.

అదే సమయంలో కొద్ది మంది మాత్రమే స్టార్టింగ్‌ అప్‌లు ప్రారంభించారు. కొరోనా ప్రభావంతో ఈ ఒప్పందాలు 30 నుంచి 40 శాతం ఫడిపోవచ్చు అని ఆయన అన్నారు. అగ్రస్థానంలో ఉన్న మరో సంస్థ అధికారి కూడా ఇదే మాదిరి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మార్చిలో ఒప్పందాల సంఖ్య 30 శాతం తగ్గిందని వినోద్‌ ‌మురళి అన్నారు. ఆయన అల్టేరియా కేపిటల్‌ అడ్వయిజర్స్‌కు మేనేజింగ్‌ ‌పార్టనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన నేతృత్వంలోని సంస్థ బైక్‌ ‌షేరింగ్‌ ఆప్‌, ‌వాగో లాజిస్టిక్‌ ‌ప్లాట్‌ఫారం లోడ్‌షేర్‌, ‌రియల్‌ ఎస్టేట్‌ ‌ప్లాట్‌ ‌ఫారం స్టాంజా లివింగ్‌ ‌వంటివి నిర్వహిస్తున్నది. వెంచర్‌ ‌కెటలిస్టు కో ఫౌండర్‌ అం‌జు గోలెచా మాట్లాడుతూ డీల్స్ 20 ‌నుంచి 30 శాతం తగ్గవచ్చని అన్నారు. తాజా ఆర్థిక పరిస్థితులను బట్టి హైనెట్‌ ‌వర్త్ ‌కుటుంబ భాగస్వాములు తమ పోర్టుఫోలి యోలను పునర్విర్వచిం చుకుంటు న్నారు. మొత్తం మీద కొరోనా ప్రభావం స్టార్టప్‌లపైనా, వెంచర్‌ ‌కాపిటల్‌ ‌సంస్థలపైనా పడిందని హెచ్‌ఎస్‌ఏ అడ్వొకేట్‌ అసోసియేట్‌ ‌పార్ట్‌నర్‌ ‌వత్సల్‌ ‌గౌర్‌ ‌తెలిపారు.
– ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్

Leave a Reply