Take a fresh look at your lifestyle.

హరీష్ రావు ట్వీట్ కు స్పందించిన కౌన్సిలర్ వేణు…విధుల్లో ఉన్న పోలీసులకు పౌష్టికాహారం అందజేత

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ట్విట్టర్లో చేసిన పోస్టుకు సూడా డైరెక్టర్, కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి స్పందించారు. వివరాల్లోకి వెళ్తే.. “సరిహద్దుల్లో సైనికులు మనకోసం ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారో చూడనివాళ్లు ఈ దృశ్యాలు చూస్తే చాలు. విధి నిర్వహణలో మన తెలంగాణ పోలీసులు యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి త్యాగాలకు మనం ఇవ్వగలిగిన గౌరవం, ఇంటిపట్టునే ఉండి లాక్ డౌన్ ను విజయవంతం చేయడం.

- Advertisement -

వారికి నా శాల్యూట్!” అంటూ..ట్విట్టర్ లో హరీష్ రావు చేసిన ట్వీట్ ను చూసిన వేణు తన వంతుగా స్వంత ఖర్చులతో శుక్రవారం సిద్దిపేట పట్టణ పరిధిలో కరోనా వ్యాది దృష్ట్యా నిర్విరామంగా విదులు నిర్వహిస్తున్న పోలీసు మిత్రులందరికి పౌష్టికాహారం (కోడిగుడ్డు బిర్యానీ) చేయించి బిర్యాని తో పాటు లీటర్ వాటర్ బాటల్ 1 టౌన్, 2 టౌన్ సీఐ లు సైదులు , పరశురాం కు అందజేశారు. ఈకార్యక్రమం లో కన్నయ్య, రాజశేఖర్ రెడ్డి, బాను లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply