Take a fresh look at your lifestyle.

దేశంలో తాజాగా 2,38,018 కొరోనా కేసులు నమోదు.. 310 మంది మృతి

  • రోజువారీ కేసుల్లో స్వల్పంగా తగ్గుదల
  • ఆందోళనకర స్థాయిలోనే కేసులు

న్యూ దిల్లీ, జనవరి 18 : దేశంలో రోజువారీ కేసుల్లో స్వల్ప తగ్గుదల కనిపించినా ఆందోళనకర స్థాయిలో భారీగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజూవారీ కేసుల సంఖ్య రెండు లక్షల మార్క్ ‌దాటి రోజురోజుకూ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,38,018 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా సోమవారం 310 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారంతో పోల్చుకుంటే.. కేసులు, మరణాలు కాస్త తగ్గాయి. 20,071 కేసులు తగ్గాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్ ‌బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా.. దేశంలో పాజిటివిటి రేటు రోజురోజుకూ గణనీయంగా పెరుగుతుంది. ప్రస్తుతం 19.65 శాతం నుంచి 14.43 శాతానికి చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ప్రస్తుతం దేశంలో 17,36,628 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా కొరోనా నుంచి 1,57,421 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,54,947,882కి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 94 శాతంగా ఉంది. దేశంలో కొరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ‌సైతం అలజడి సృష్టిస్తుంది. రోజురోజుకూ ఒమిక్రాన్‌ ‌కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇప్పటివరకు దేశంలో 8,891 ఒమిక్రాన్‌ ‌కేసులు నమోదయ్యాయి. ఆదివారంతో పోల్చుకుంటే..ఒమిక్రాన్‌ ‌కేసుల సంఖ్య 8.31 శాతం పెరిగింది. దేశంలో వ్యాక్సినేషన్‌ ‌పక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు దేశంలో 158.04 కోట్ల టీకా డోసులను వేసినట్లు కేంద్రం తెలిపింది. తాజాగా 24 గంటల్లో 80 లక్షల డోసులు వేసినట్లు కేంద్రం తెలిపింది.

Leave a Reply