Take a fresh look at your lifestyle.

తెలంగాణ, ఛత్తీస్‌ఘఢ్‌ ‌సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌

  • ‌కమాండర్‌, ఒక మహిళ
  • సహా ముగ్గురు మావోయిస్టులు మృతి..

ప్రజాతంత్ర ప్రతినిధి, భద్రాచలం, జనవరి 18 : ఛత్తీస్‌ఘఢ్‌, ‌తెలంగాణ సరిహద్దులో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక దళ కమాండర్‌తో పాటు ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా మృతుల్లో ఒక మహిళ ఉన్నట్లుగా గుర్తించారు. తెలంగాణ సరిహద్దులో ఉన్న ఉసూరు అడవిలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏరియా కమిటీ కమాండర్‌ ‌సహా ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఒక ఎస్‌ఎల్‌ఆర్‌, ఒక రైఫిల్‌, ఒక సింగిల్‌ ‌బోరర్‌ ‌తుపాకీ, పది రాకెట్‌ ‌లాంచెర్‌లు మరియు ఒక కిట్‌ ‌బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ములుగు ఎస్పీ సునీల్‌ ‌శర్మ తెలిపారు. ఎస్పీ తెలిపపిన వివరాల ప్రకారం తెలంగాణ ములుగుకు చెందిన తెలంగాణ గ్రేహౌండ్‌ ‌బృందం మావోయిస్టుల కోసం ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లోకి వెళ్లింది. మరోవైపు సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఛత్తీస్‌ఘఢ్‌లోని బీజాపూర్‌ ‌జిల్లా ఉసూర్‌ ‌బ్లాక్‌ అటవీప్రాంతంలో మావోయిస్టులు మకాం వేసినట్లు సమాచారం. ఏటూరు నాగారం మహదేవపూర్‌ ఏరియా కమిటీ కమాండర్‌ ‌మరియు ఆయన బృందం అక్కడ ఉన్నారని అన్నారు.

సుధాకర్‌ ‌బృందం కర్రిగుట్ట సమీపంలోని పర్వతంపై విడిది చేశారు. గ్రేహౌండ్‌ ‌సైనికులు కొండను చుట్టుముట్టడంతో, నక్సలైట్లు కాల్పులు ప్రారంభించారు. ప్రతీకారం తీర్చుకున్న తర్వాత మావోయిస్టులు పారిపోయారు. ఘటనా స్థలం నుంచి రెండు ఆయుధాలు, కమాండర్‌ ‌సహా ఇద్దరు నక్సలైట్ల మృతదేహాలు లభ్యమయ్యాయని తెలిపారు. సంఘటనా స్థలానికి బీజాపూర్‌ ‌వైపు నుంచి బలగాలను కూడా పంపించారు. పోలీస్‌ ‌బలగాలు మావోయిస్టుల కోసం అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారని అన్నారు. సుక్మాలోని మార్జూమ్‌ ‌ప్రాంతంలో కూడా పెద్ద ఎన్‌కౌంటర్‌ ‌జరిగిందని ఇక్కడ ఎస్పీ సుక్మా సునీల్‌ ‌శర్మ చెప్పారు. ఈ ఆపరేషన్‌లో దంతెవాడ, బస్తర్‌, ‌సుక్మాకు చెందిన డీఆర్‌జీఎఫ్‌ ‌సిబ్బంది పాల్గొన్నారు. ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందారని ఎస్పీ సునిల్‌ ‌శర్మ తెలిపారు.

Leave a Reply