Take a fresh look at your lifestyle.

‌ప్రభుత్వ వైఖరికి నిరసనగా దీక్ష చేశా: విహెచ్‌

  • ఒక రోజు దీక్ష విరమించిన విహెచ్‌
  •  ‌సంఘీభావం తెలిపిన పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ధాన్యాన్ని రోడ్లపై పెట్టుకుని నిరసన వ్యక్తం చేసినా, వలస కూలీలకు క్యాంపులు పెట్టి ఆదుకోవాలని విన్నవించినా పట్టనట్లు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తీరుకు నిరసనగా మాజీ ఎంపీ విహెచ్‌ అం‌బరుపేటలోని తన నివాసంలో గురువారం ఒక్కరోజు నిరాహారదీక్ష చేశారు.టీఆరెస్‌ ‌సర్కార్‌ ‌ప్రతిపక్షాల సలహాలను పట్టించుకోవడం లేదని ,ఒంటెద్దు పోకడలు పోతుందని విహెచ్‌ ‌విమర్శించారు.రైతుల వద్ద ధాన్యం కొనుగోలు విషయంలోనూ వివక్ష చూపిస్తుందన్నారు .విహెచ్‌ ‌చేపట్టిన దీక్ష కు టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం ,పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ,మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ ,ఇం‌టిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ ‌సంఘీ భావం తెలిపారు.

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌చేతుల మీద వీహెచ్‌ ‌దీక్ష విరమింపచేశారు.ఈ సందర్భంగా ఉత్తమ్‌ ‌మాట్లాడుతూ …కరోనా నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలం అయిందని ,కోవిడ్‌ ‌టెస్ట్ ‌చేయడం లో పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు.రైతు సమస్యల పై హనుమంతరావు దీక్ష చేయడం అభినందనీయమన్నారు .అయాన డిమాండ్‌ ‌ల పట్ల పార్టీ లో చర్చించి ఆందోళన కార్య్రమాలు చేస్తామని, అన్ని జిల్లాల కార్యాలయాలలో కూడా ఒక రోజు దీక్ష చేస్తామమని తెలిపారు ..

Leave a Reply