Take a fresh look at your lifestyle.

మరి కొన్ని సడలింపులు ఇచ్చిన కేంద్రం

  • రవాణా వాహనాలపై ఆంక్షలు ఎత్తివేత
  • రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్ర హోం శాఖ

లాక్‌డౌన్‌ ‌కారణంగా దేశంలో విధించిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఒక్కటొక్కటే సడలిస్తూ వస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లో లాక్‌డౌన్‌లో భారీగా మార్పులు రానున్న నేపథ్యంలో తాజాగా దేశ వ్యాప్తంగా రవాణా వాహనాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర •ంశాఖ కార్యదర్శి అజయ్‌ ‌కుమార్‌ ‌భల్లా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు గురువారం సాయంత్రం లేఖ రాశారు.

దేశంలో అన్ని రకాల వస్తువులతో కూడిన ట్రక్కుల రాకపోకలకు కేంద్ర •ంశాఖ అనుమతిని ఇస్తూ ఈ మేరకు గురువారం
ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రూపంలో పంపించారు. దేశవ్యాప్తంగా ఉన్న అంతర్రాష్ట్ర సరిహద్దులలో వాహనాలను అడ్డుకోవద్దని అజయ్‌ ‌కుమార్‌ ‌భల్లా తన లేఖలో ప్రధానంగా పేర్కొన్నారు. ప్రత్యేక అనుమతులు, ప్రత్యేక పాసుల పేరుతో వాహనాల రాకపోకలను అడ్డుకోవద్దని, జాప్యానికి కేంద్ర •ంశాఖ రాష్ట్రాలను కోరింది. అనుమతుల పేరిట సరిహద్దులలో గంటల తరబడి వాహనాలను ఆదేశాలు జారీ చేసింది. వస్తువులు, సేవల సరఫరా సహజ స్థాయికి తీసుకు రావడానికి, నిర్విరామంగా నిర్వహించ డానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు •ంశాఖ కార్యదర్శి తన లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy