Take a fresh look at your lifestyle.

రాములమ్మ అసంతృప్తి?

  • ‘ప్రభుత్వం వైపు కన్నా…ప్రజల వైపు ఉండటమే నా ధోరణి’
  • సోషల్‌ ‌మీడియాలో ఆసక్తికరమైన ట్వీట్‌…‌హాట్‌ ‌హాట్‌ ‌టాపిక్‌

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 23: ‌మెదక్‌ ‌మాజీ ఎంపి, ప్రముఖ సినీ నటి, రాష్ట్ర కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకురాలు ఎం.విజయశాంతి అలియాస్‌ ‌రాము లమ్మ అసంతృప్తితో ఉన్నారా? రాష్ట్ర కాంగ్రెస్‌ ‌నాయ కత్వం తీరుపై గుర్రుగా ఉందా? అంటే, ఆమె తాజాగా…సోషల్‌ ‌మీడియా వేదికగా చేసిన ఓ ట్వీట్‌ ఔననే చెబుతోంది. సోషల్‌ ‌మీడియాలో ఆమె  చేసిన పోస్టు ఇలా సాగింది…                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                        కొంతమంది విమర్శించినా.. ఎందుకో అదే విధానం నన్ను అట్లము ందుకు నడిపిస్తూనే వొస్తుందన్నారు. ప్రతి పక్షంలో ఉన్నంత పోరాట స్ఫూర్తి, స్వేచ్ఛ అధికారపక్షంలో సాధ్యపడకపోవడం కూడా ఒక వాస్తవమేమో తెలియదు నాకు, ఈ  26ఏళ్ల  రాజకీయ గమనంలో అని పేర్కొన్నారు.

అయితే,నేను గెలిపించడానికి పనిచేసిన నేటి  తెలంగాణ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవేర్చే సాఫల్యత తెలంగాణల సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూనని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రివర్గం ప్రజలకై ఆ  దిశగా ఇప్పటికీ  పనిచేస్తున్నరు కాబట్టి…… అమలు ప్రారంభమైన హామీలు దశలవారీగా పూర్తిస్థాయికి చేర్చబడి,  ప్రభుత్వ కార్యాచరణ విజయం దిశగా సాగాలని నా అభిప్రాయం తెలియజేస్తూ… లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించగలదని విశ్వసిస్తున్నట్లు ఆ పోస్టులో విజయశాంతి పేర్కొన్నారు. అయితే,  ఆమె అసంతృప్తితో ఉందని చెప్పడానికి ఈ పోస్టే చక్కటి ఉదాహరణ. ఈ పోస్టు ఇప్పుడు రాజకీయాలలో హాట్‌ ‌టాపిక్‌గా మారింది.

రాములమ్మ అసంతృప్తి?
పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కాంగ్రెస్‌ ‌క్యాంపెయినర్‌ ‌విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ తాజాగా.. సోషల్‌ ‌మీడియాలో చేసిన పోస్టు ఆసక్తి కరంగా మారింది.  కాంగ్రెస్‌ ‌పార్టీలో చర్చనీ యాం శమైంది. తనపట్ల రాష్ట్ర పార్టీ నాయకత్వం  వ్యవహ రిస్తున్న తీరు నచ్చకపోవ డంతోనే విజయశాంతి ఈ తరహా ట్వీట్‌ను చేసినట్లు అత్యంతమైన విశ్వసనీ యవర్గాలు మంగళవా రమిక్కడ ‘ప్రజాతంత్ర’కు తెలిపాయి.కాంగ్రెస్‌ ‌పార్టీలోచాలా సీనియర్‌ ‌నాయకు రాలైన విజయశాంతి కాంగ్రెస్‌ ‌ప్రచార కమిటీలోనూ కీలక పోస్టులో ఉన్నారు. గత ఏడాది నవంబర్‌లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్‌ ‌క్యాంపె యినర్‌గా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల తరపున విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు. ఆమె ప్రచారం నిర్వహించిన అనేక అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిచారు. మెదక్‌లోనూ పార్టీ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌రావు తరపున ప్రచారం చేశారు.

రోహిత్‌రావు ఎమ్మెల్యేగా గెలిచిన విషయం విధితమే.కానీ, ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆమె సేవలను పార్టీ నాయకత్వం ఎందుకో ఏమో కానీ ఉపయోగించుకోవడం లేదని తెలుస్తుంది. దీంతో ఆమె కూడా కొంత సైలెంట్‌గా ఉండటమే కాకుండా, తుక్కుగూడలో నిర్వహించిన రాహుల్‌ ‌సభకు దూరంగా ఉండి పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లుగా ఉంటున్నట్లువిశ్వసనీయ సమా చారం. పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి కేవలం మరికొన్ని రోజుల గడువు మాత్రమే ఉంది. అయితే, కాంగ్రెస్‌ ‌ప్రచార కమిటీలో కీలక పోస్టులో ఉన్న ఆమె గత కొన్ని రోజులుగా ఎక్కడ కూడా కనిపంచడం లేదు. అంతెందుకు,ఆమె ఎంపిగా ప్రాతినిధ్యం వహించిన మెదక్‌లో కాంగ్రెస్‌ ఎం‌పి అభ్యర్థిగా నీలం మధు ముదిరాజ్‌ ‌నామినేషన్‌ ‌కార్యక్రమానికి, సిఎం రేవంత్‌రెడ్డి కార్నర్‌ ‌మీటింగ్‌లోనూ ఆమె పాల్గొన లేదు. మధు నామినేషన్‌  ‌కార్యక్రమంలో కనిపించక పోవ డంతో ఆమె అభిమానులు ఒకింత అసంతృప్తికి గురౌతున్నట్లు తెలుస్తుంది. నామినేషన్‌ ‌కార్యక్రమనికి ఆమెకు ఆహ్వానం  లేకపోవడంతోనే దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మెదక్‌ ‌పార్లమెంటుతో విజయ శాంతికి విడదీయరాని బంధం ఉంది. ఎంపిగానే కాకుండా, పార్టీ నాయకురాలిగా, ఉద్యమకారిణిగా ఈ ప్రాంత ప్రజలతో ఆమెకు దశబ్దాలుగా సత్సంబంధాలు ఉన్నాయి.

పార్టీలకతీతంగా ఆమెకు  అనేక మందితో పరిచయాలు ఉన్నాయి.మెదక్‌ ‌పార్లమెంటులోని ఆయా అసెంబ్లీ నియోజక వర్గాలలో విజయశాంతికి పర్సనల్‌గా వేలాది మంది అభిమానులు ఉన్నారు. ఆమెకు పర్సనల్‌ ‌వోటు బ్యాంకు కూడా ఉంది.  మెదక్‌ ‌పార్లమెంటు పరిధిలో విజయశాంతితో ప్రచారాన్ని చేయించడం  వల్ల కాంగ్రెస్‌ ‌పార్టీ ఎంపి అభ్యర్థి మధు గెలుపునకు ఉపయోగపడే అవకాశం ఉన్నప్పటికీ..ఆ దిశగా రాష్ట్ర, జిల్లా నాయకత్వం చొరవ చూపకపోవడానికి కారణం రాష్ట్ర కాంగ్రెస్‌లోని ఒకరిద్దరు నేతల ‘ఈగో’ అని  తెలుస్తుంది.  సినీ నటిగా, ఉద్యమనాయకురాలిగా కమిట్‌మెంట్‌ ఉన్న లీడర్‌గా, ఛరీష్మా ఉన్న విజయశాంతితో ప్రచారం చేయిచండం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా  పార్టీకి లాభం ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.   అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా బిజెపిని వీడి కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా విజయశాంతికి ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటికీ కూడా ఇప్పటి వరకు రాష్ట్ర కాంగ్రెస్‌ అధిష్టానం నెరవేర్చకపోవడం… గాంధీభవన్‌లో జరిగిన పార్టీ స్టార్‌ ‌క్యాంపెయినర్స్  ‌మీటింగ్‌కు సమాచారం ఇవ్వకపోవడం, పార్టీలో తనకు దక్కాల్సిన ప్రాధాన్యత, గౌరవం దక్కకపోవడం  పట్ల విజయశాంతి ఒకింత అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. దీంతోనే ఆమె తాజాగా…. ‘ప్రభుత్వం వైపు కన్నా.. ప్రజల వైపు ఉండటం ఎందుకో నాకు ఒక ధోరణి, ఎప్పుడూ నా తిరుగుబాటు స్వభావపు సినిమా పాత్రల ప్రేరణ కావచ్చు’ అంటూ ప్రభుత్వాన్ని ఒకింత ఇరకాటంలో పడేసేలా  సోషల్‌ ‌మీడియాలో పోస్టు చేసినట్లు తెలుస్తుంది. ఇప్పుడు రాములమ్మ సోషల్‌ ‌మీడియాలో చేసిన ట్వీట్‌ ‌మాత్రం చర్చనీయాంశంగా మారింది. చూడాలి మరి!

Leave a Reply