Take a fresh look at your lifestyle.

అమరులకు కాంగ్రెస్‌ ‌నేతల నివాళి

హైదరాబాద్ గన్‌పార్క్ ‌తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద కాంగ్రెస్‌ ‌మాజీ ఎంపీలు నివాళులర్పించారు. 15వ లోక్‌సభ మాజీ ఎంపీలు మధు యాష్కీ, పొన్నం ప్రభాకర్‌, ‌సిరిసిల్ల రాజయ్య, బలరాం నాయక్‌, అం‌జన్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌, ‌సురేష్‌ ‌షట్కర్‌…అమరవీరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీలు మీడియాతో మాట్లాడారు. సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని మధుయాష్కి అన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఎం‌పీలుగా తాము పోరాటం చేశామని… త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ‌తెలంగాణ రాబందుల సమితిగా మారిందని వ్యాఖ్యానించారు.

ఏడు ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితిని బొందపెట్టాలని మధుయాష్కి వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ…సామజిక తెలంగాణ సాధనలో మరోసారి తాము ముందు వరసలో ఉంటామన్నారు. మరోసారి తెలంగాణ ప్రజలు సామజిక తెలంగాణ కోసం ఉద్యమానికి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. వివేక్‌ ‌వెంకటస్వామి సారథ్యంలో కాంగ్రెస్‌ ఎం‌పీలు పనిచేసినట్లు తెలిపారు. తెలంగాణ తెచ్చేది.. ఇచ్చేది కాంగ్రెస్‌ అని చెప్పి.. తెలంగాణ సాధించుకున్నామని గుర్తుచేశారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ‌మాట్లాడుతూ…15వ లోక్‌సభ ఎంపీలు చాలా కీలకంగా పనిచేశారన్నారు. తెలంగాణ ప్రజలు గుండె వి•ద చెయ్‌ ‌వేసుకొని ఆలోచించాలని తెలిపారు.

Leave a Reply