Take a fresh look at your lifestyle.

చెరువులో పడి ముగ్గురు మృతి

పొలంలో కూరగాయలు సాగురు క్రిమిసంహారక మందు పిచికారి చేసేందుకు వెళ్ళి పిచికారి చేసిన అనంతరం పొలం పక్కనే ఉన్న చెరువులో కాళ్ళు కడుక్కునేందుకు ముగ్గురు యువకులు వెళ్ళి వారిలో ఒక యువకుడు ముందుగా చెరువులో దిగాడు. పొలం పక్కనే చెరువు లోతు తక్కువగా ఉంటుందనే ఆలోచన దిశగా అతను మునిగిపోయాడు. ఇంతలో మిగిలిన ఇద్దరు యువకులు కేకలు వేస్తూనే అందులో మరో యువకుడు అతనిని కాపాడేందుకు వెళ్ళి అతను మునిగిపోయాడు. దీనితో పక్కనే తాత, తండ్రి చెరువులోకి దిగారు తండ్రి మునిగిపోయాడు. తాతను గ్రామస్తులు కాపాడారు. మిగిలిన ముగ్గురు మృత్యు ఒడిలోకి జారుకున్నారు. దీనితో రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మేనమామ ఇంటికి చుట్టపు చూపుగా వచ్చిన మామ బావలతో కలిసి తిరిగి రాని లోకానికి వెళ్ళడంతో రెండు కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. ఈ హృదయ విదారన సంఘటన బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనపై ప్రత్యక్ష సాక్షులు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మీపురం గ్రామానికి చెంది నల్లమోతు అప్పారావు ఐటిసిలో క్యాజువల్‌గా పనిచేస్తూ తన తండ్రితో పాటు తనకున్న 6 ఎకరాలు పొలంలో వ్యవసాయం ,చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తనకు ఇద్దరు చెల్లెలు వారిలో ఏన్కూరు మండలం లో జన్నారంకు చెందిన చెల్లి తన ఇద్దరు కుమారులతో కలిసి నాలుగురోజుల క్రితం తన ఇంటికి వచ్చింది.

కాగా తన తన మేనళ్ళులు వినయ్‌, ‌ధనుంజయ్‌ ‌సాయి , తన కుమారుడు తేజు తన తండ్రి క్రిష్ణయ్యతో కలిసి మంగళవారం నాడు తన పొలంలో క్రిమి సంహారక మందు పిచికారి చేసేందుకు వెళ్ళారు. ఈ క్రమంలో నే కాళ్ళు కడుక్కునేందుకు ముగ్గురు యువకులు వినయ్‌, ‌ధనుంజయ్‌ ‌సాయి, తేజులు, రేపాక చెరువు వద్దకు వెళ్ళారు. ముందుగా వినయ్‌(19) ‌చెరువులోకి దిగాడు ప్రమాదవశాత్తు కాలు జారి మునిగిపోయాడు. మిగిలిన ఇద్దరు యువకులు కేకలు వేస్తూ వారిలో నల్లమోతు తేజు(20) తన బావమరిదిని కాపాడేందుకు చెరువలోకి దిగాడు అతను మునిగిపోయాడు. వారిని కాపాడేందుకు నల్లమోతు అప్పారావు తన క్రిష్ణయ్యలు చెరువులోకి దిగగా వారిలో అప్పారావు (45) మునిగిపోయాడు. ఇంతలో చుట్టుపక్కల పొలంలో పనిచేసేవారు వచ్చి క్రిష్ణయ్యను కాపాడారు. ముగ్గురు మృత్యువాత పడ్డారు. దీనితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చుట్టపు చూపుగా వచ్చి మామ,బావమరిదిలతో కలిసి కానరాని లోకాలకు వెళ్ళిన ఆ యువకుడి తల్లి రోధనలు మిన్నంటాయి. రెండు కుటుంబాల్లో చెరువు విషాదాన్ని మిగిల్చింది. లక్ష్మీపురం, జన్నారం గ్రామాలు శోక సంద్రంలో మునిగాయి.అప్పారావు కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్‌ ‌రేగా కాంతారావు : చెరువులో ప్రమాదవ శాత్తు మునిగి మరణించిన అప్పారావు కుటుంబ సభ్యులకు పినపాక శాసన సభ్యులు , విప్‌ ‌రేగా కాంతారావు మృతదేహాలకు నివాళులర్పించి తన సానుభూతిని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి కామిరెడ్డి శ్రీలత, కామిరెడ్డి రామకొండారెడ్డి, టిఆర్‌ఎస్‌ ‌గ్రామ కమిటి అధ్యక్షులు పోతిరెడ్డి గోవింద రెడ్డి , తాళ్ళూరి శ్రీహరిబాబు, పాలెం దివాకర్‌ ‌రెడ్డి, చింతా వెంకటరామిరెడ్డి, రాజా తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!