Take a fresh look at your lifestyle.

మజ్లిస్‌ ‌వ్యతిరేక ప్రాంతాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం

  • బస్తీ దవాఖానాలను పట్టించుకోవడం లేదు
  • నాంపల్లి నియోజక వర్గంలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి పాద యాత్ర

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 21 : ‌నగరంలో మజ్లీస్‌ ‌పార్టీకి వ్యతిరేకంగా ఉన్న బస్తీలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి ఆరోపించారు. కొండాపూర్‌, ‌మాదాపూర్‌, ‌హైటెక్‌ ‌సిటీని మాత్రమే అభివృద్ధి చేస్తుందన్నారు. బస్తీలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధిలైట్లకు నిధులు కేటాయించని పరిస్థితి నెలకొందన్నారు. అందుకే  హైదరాబాద్‌లో బస్తీలు అధ్వానంగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలు ఉండే బస్తీలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. జీహెచ్‌ఎం‌సీ అధికారులు..కాంట్రాక్టర్లకు నిధులు చెల్లించకపోవడంతో ధర్నాలు చేస్తున్నారని చెప్పారు.

బస్తీలకు నిధులు కేటాయించి పేదలకు న్యాయం చేయాలని కోరుతున్నామని కిషన్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ ‌నాంపల్లి నియోజకవర్గంలోని ఆసిఫ్‌ ‌నగర్‌, ‌మల్లేపల్లి డివిజన్లలో  కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ ‌రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. ఆఫీస్‌ ‌నగర్‌ ‌డివిజన్‌ ‌పరిధిలోని దాయిబాగ్‌ ‌లో వెంకటేశ్వర స్వామి టెంపుల్‌ ‌వద్ద జీహెచ్‌ఎం‌సీ, వాటర్‌ ‌వర్కస్, ‌రెవెన్యూ, పోలీస్‌ అధికారులతో సవి•క్ష సమావేశం నిర్వహించారు.

డివిజన్‌లో నెలకొన్న సమస్యలపై అధికారులను కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి అడిగి తెలుసుకున్నారు. డివిజన్‌లో స్ట్రీ ‌లైట్లు, గుంతలకు సంబంధించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. నాంపల్లి నియోజకవర్గంలోని పలు డివిజన్లలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి.. స్థానికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా కాలనీల్లో నెలకొన్న సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని హావి• ఇచ్చారు.

Leave a Reply