Take a fresh look at your lifestyle.

బంధం కొమ్ము రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 13: అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని బంధంకొమ్ము కమాన్ నుండి అమీన్ పూర్ గాంధీ విగ్రహం వరకు నిర్మించనున్న 150 ఫీట్స్ రోడ్ నిర్మాణ పనులను బుధవారం పరిశీలించిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల  పాండు రంగారెడ్డి  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుమారు 7 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 150 ఫీట్ల రోడ్డు వాహనదారులకు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బిజిలి రాజు, ఏఈ ప్రవీణ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు చౌటకూరి మైపాల్ రెడ్డి, చౌటకూరి రామిరెడ్డి, అరుణ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply