Take a fresh look at your lifestyle.

దయచేసి ఆలోచించండి..

ఎన్నడూ లేని విధంగా మంగళవారం నుండి శుక్రవారం వరకు నాలుగు రోజుల్లో రోజువారీ కేసుల సంఖ్యలో 27శాతం, మరణాల సంఖ్యలో 30 శాతం పెరుగుదల నమోదయింది. ఈ విధంగా కేసులు పెరుగుతూ పోతే పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారే అవకాశమున్నది..చేయిదాటి పోయే ఆస్కారమున్నది. వైరస్‌ ‌పెరుగుదల ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా ప్రభుత్వాలు కానీ, ప్రజలు కానీ కనీసంగా పట్టించుకోక పోవడం శోచనీయం. కోవిడ్‌ ‌నిబంధనలను పాలకులు, ప్రజలు పాటించడం లేదు. వైరస్‌ ‌సామాజిక వ్యాప్తికి మూల కారణం..ప్రజలు గుంపులు గుంపులుగా గుమికూడడం. అది తెలిసీ ఇప్పటికీ ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తూనే ఉన్నారు.మద్యం దుకాణాలు, టిఫిన్‌ ‌సెంటర్ల వద్ద ప్రజలు కనీస దూరం పాటించకుండా ఒకరిమీద ఒకరు పడుతున్న దృశ్యాలు అనేకం కనిపిస్తూనే ఉన్నాయి. ఒకవైపు సంబంధిత ప్రభుత్వ అధికారులు నిబంధనలు కచ్చితంగా పాటించాలని, అత్యవసరమయితేనే బయటకు రావాలని హెచ్చరిస్తూ మరోవైపు బాధ్యతగల పాలకులే వాటిని పాటించకుండా అతిక్రమిస్తున్న దృశ్యాలు మీడియాలో ప్రత్యక్షంగా కనిపించడం సామాన్యులకు ఏం సంకేతమిస్తున్నది. వైద్యపరంగా అత్యవసర పరిస్థితి విధించాల్సిన ఇటువంటి తరుణంలో ఇంత ఉదాసీనత ఎంతటి విపత్కర పరిస్థితులకు దారితీస్తుందన్నది ఊహకందని విషయం. అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం. ఇప్పటికే హాస్పిటళ్లలో చికిత్స అందకపోవడం, బెడ్లు దొరకక పోవడం, స్మశాన వాటికల వద్ద కనీస గౌరవంతో అంత్యక్రియలు నిర్వహించలేని హృదయ విధారక దృశ్యాలు మనసులను కలచివేస్తున్నాయి. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించండి…తమవంతు కర్తవ్యంగా బాధ్యతగా వ్యవహరించండి.
– ప్రజాతంత్ర

Leave a Reply