Take a fresh look at your lifestyle.

అగ్రవర్ణాలు పన్నిన కుట్రలో పావుగా మారిన మోడీ

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20 : అగ్రవర్ణాలు పన్నిన కుట్రలో ప్రధాని మోడీ పావుగా మారారని బీసీ రాజ్యాధికార సమితి జాతీయ అధ్యక్షులు దాసు సురేశ్ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 11 వర్ధంతి సందర్భంగా జలదృశ్యం వద్దగల బాపూజీ విగ్రహం వద్దకు చేరుకొని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ నివాళులర్పించారు. అనంతరం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశములో బీసీ దళిత న్యాయవాద నాయకుల సమక్షంలో తదనంతరం దాసు సురేశ్ మాట్లాడుతూ 21వ తేదీ సెప్టెంబర్ గురువారం ఉదయం 9 గంటల నుండి జలదృశ్యం వేదికగా కొండా లక్ష్మణ్ బాపూజీకి ప్రముఖుల సమక్షంలో ఘననివాళులు అర్పించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం దాసు సురేశ్ మాట్లాడుతూ పార్లమెంటులో మహిళా బిల్లు బీసీలపై అగ్రవర్ణాలు పన్నిన కుట్ర అని పేర్కొన్నారు. మహిళా బిల్లుతో మోడీ బీసీల ద్రోహిలా చరిత్రలో మిగిలి పోనున్నాడన్నారు. ఎస్సీ, ఎస్టీలతో బాటు బీసీ లకు రాజకీయ రేజర్వేషన్లు లేకుండా మహిళా రేజర్వేషన్లను మోదీ ఎలా అమలు పరుస్తారన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించకుండా కాకుండా మహిళా రిజర్వేషన్లు ప్రవేశపెడితే బీసీలకు తీవ్ర అన్యాయం జరగనుందని దాసు సురేశ్ తెలిపారు. బీసీ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టే వరకు బిజెపి పార్టీని, మోడీని అన్ని చోట్లా అడ్డుకుంటామన్నారు. ప్రధాన పార్టీలు బీసీ బిల్లుకు మద్దతు తెలుపకపోతే ఆయా పార్టీలను బీసీ ద్రోహులుగా ప్రకటిస్తామన్నారు. జాతీయ రహదారులపై బైఠాయించి దేశాన్ని  ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నాగుల శ్రీనివాస్ యాదవ్, ఎస్.నాగేందర్, అశోక్, బండారి పద్మావతి, పైరసాని దుర్గేష్, రాధాకృష్ణ, కొత్తపల్లి బాయమ్మ, భండారి వైధ్యనాథ్, గీసబోయిన ఆకాశ్ పాల్గొన్నారు.

Leave a Reply