Take a fresh look at your lifestyle.

రేడియో మాధ్యమ ప్రాధాన్యత అంతా ఇంతా కాదు…

నేడు ప్రపంచ రేడియో దినోత్సవం
ప్రపంచ రేడియో దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న నిర్వహించ బడుతుంది. రేడియో మాధ్యమ ప్రాధాన్యతను తెలియజేయడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు.1946, ఫిబ్రవరి 13న ఐక్యరాజ్యసమితి రేడియో ప్రారంభించబడిరది కాబట్టి, ఆ సందర్భంగా ప్రతిఏటా ఫిబ్రవరి 13న ఈ దినోత్సవం జరుపుకునేలా జనరల్‌ కాన్ఫరెన్స్‌ 36వ సెషన్‌లో ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ప్రకటించాలని బోర్డు యునెస్కోకు సిఫారసు చేసింది. ప్రపంచ రేడియో దినోత్సవాన్ని 2011 నవంబరులో యునెస్కోలోని అన్ని సభ్య దేశాలు ఏకగ్రీవంగా ప్రకటించాయి. రేడియో అనేది విద్య స్థాయి, సామాజిక, ఆర్థిక స్థితి, లింగం వయస్సుతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా మందికి చేరే మాస్‌ మీడియా. కాంతి వేగ పౌనఃపున్యాలతో విద్యుత్‌ అయస్కాంత తరంగాలను మాడ్యులేషన్‌ చేయటం ద్వారా తీగల ఆధారము లేకుండా గాలిలో శబ్ద సంకేతాలను ప్రసారం చేయు ప్రక్రియను దూర శ్రవణ ప్రక్రియ అంటారు. ఇలాంటి ప్రసారాలను వినటానికి ఉపయోగించే సాధనాన్ని రేడియో అంటారు. సమాచారాల చేర వేత కోసం గతంలో చాలామంది చేసినప్రయోగాలన్నీ మార్కోనీ పరిశోధనలకు దోహద పడ్డాయి. బోలోనా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ రీగ్‌ అధ్వర్యంలో ఇరవయ్యేళ్ళ యువకుడు మార్కోనీ కొన్ని నెలల పాటు కృషి చేశాడు. తల్లిదండ్రులతో బాటు నివసిస్తున్న తన ఇంటి పై అంతస్తు లోనే అతని ప్రయోగశాల ఉండేది. ఒకరోజు అర్థరాత్రి సమయంలో తల్లిని నిద్రలేపి ఓ తమాషా చూపిస్తానని పైకి తీసుకెళ్ళాడు. ఒకచోట మోర్స్‌ కీ 12 అడుగుల దూరంలో ఎలక్ట్రిక్‌ బెల్‌ ని అమర్చాడు. కీని నొక్కినప్పుడల్లా గంట మోగడం ప్రారంభించింది. మధ్యలో తీగలు లేకపోయినా గంట మోగటం ఆశ్చర్య పరిచింది. వైర్‌ లెస్‌ విధానం ద్వారా తొలి సంకేతాన్ని ప్రసారం చేసిన ఈ ప్రయోగం గొప్ప చారిత్రాత్మక సంఘటన అని చాలాకాలం తరువాత మార్కోనీ తల్లి గ్రహించ గలిగింది. మార్కొనీ క్రమంగా సంకేతాలు వెళ్ళగలిగే దూరాన్ని పెంచుతూ పోయాడు. ఓ చిన్న గుట్ట ఆవలిపైపు దాకా సంకేతాలు వెళ్ళగలిగాయి. సంకేతం ఆవలి వైపున చేరగానే దాన్ని గుర్తించానని తెలియ జేయడానికి గాను ఆయన తమ్ముడు గుట్టపై నిలబడి నాట్యం చేసేవాడు.

క్రమంగా సంకేతాలను ఎక్కువ దూరం ప్రసరించేలా చేయడంలో మార్కోనీ కృతకృత్యు డయ్యాడు. 1898 వేసవిలో సముద్ర మద్యంలో జరిగిన పడవ పందేల గురించి ఎప్పటికప్పుడు వార్తలు పంపడానికి డబ్లిన్‌ వార్తా పత్రిక మార్కోనీని నియమించింది. ఆయన సముద్ర తీరంలో గ్రాహకాన్ని అమర్చి, వైర్‌ లెస్‌ ప్రసారిణిని ఓ పడవలో ఉంచుకొని బయలు దేరాడు. వార్తలను వైర్‌ లెస్‌ ద్వారా సముద్ర తీరానికి పంపితే, అక్కడి నుంచి వార్తా పత్రిక కార్యాలయానికి టెలిఫోన్‌ ద్వారా చేర వేశారు. వైర్‌ లెస్‌ ద్వారా పంపబడిన మొట్టమొదటి పత్రికా వార్త ఇదే.

వేల్స్‌ రాకుమారుడు ఒకసారి విహార నౌకలో వెడుతూ వైట్‌ దీవుల కావల జబ్బు పడ్డాడు. కుమారుని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటి కప్పుడు తెలుసు కోవాలని విక్టోరియా రాణి సంకల్పించింది. వెంటనే మార్కోనీని అభ్యర్థించగా అతడు వైర్‌ లెస్‌ పరికరాలను నెలకొల్పి, 16 రోజుల పాటు నిర్విరామంగా వార్తలను చేరవేసే ఏర్పాటు చేశాడు. మొత్తం 150 టెలిగ్రాంలు అటూ, యిటూ ప్రసారం చేయబడ్డాయి. 1909 లో రెండు పడవలు సముద్ర మద్యంలో ఢీ కొన్నాయి. వైర్‌ లెస్‌ ద్వారా తీరానికి సమాచారం వెంటనే అందించక పోయి ఉంటే 1700 మంది ప్రయాణీకులు మునిగిపోయే వారు. 1912 ఏప్రిల్‌ లో టైటానిక్‌ అనే ఓడ సముద్ర మద్యంలో ఓ మంచు కొండను ఢీకొంది. ఓడ మునిగి పోతుండగా అక్కడి ఆపరేటర్‌ వైర్‌ లెస్‌ ద్వారా %ూూూ% సంకేతాలను అనేక సార్లు పంపించాడు. ఫలితంగా 700 మందిని రక్షించటానికి వీలైంది. 1907 లో బ్రిటిష్‌ నావికాదళానికి చెందిన ఓడలు ప్రపంచ పర్యటన చేస్తున్న సందర్భంగా జాతీయ గీతం వాద్యాలాపనను ఒక ఓడ నుండి మరో ఓడకి ప్రసారం చేసుకో గలిగారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో సముద్ర తీరం నుంచి 30 మైళ్ల దూరంలో ఉండే యుద్ధనౌకకు వైర్‌ లెస్‌ ద్వారా మార్కోనీ సందేశం పంపించ గలిగాడు.

అమెరికా అధ్యక్షుడిగా హార్డింగ్‌ ఎన్నికయ్యాడన్న వార్తను తొలి ప్రసారంలో ప్రకటించటంతో 1920 నవంబరు 2 వ తేదీన కార్యక్రమాలు ప్రారంభ మైనాయి. 1922 మే నెలలో 100 వాట్ల సామర్థ్యం గల రేడియో ప్రసార కేంద్రాన్ని లండనులో స్థాపించారు.1922 నవంబరులో బ్రిటనులో ప్రసార హక్కులు గల ఏకైక సంస్థ బి.బి. సి. నవంబరు 14 నుంచి లండను కేంద్రం రోజువారీ ప్రసారాలు ప్రారంభించింది. అమెరికా బెల్‌ టెలిఫోన్‌ ప్రయోగ శాలల్లో పనిచేసే పరిశోధక బృందం తొలి ట్రాన్సిష్టర్‌ 1948 లో తయారు చేసింది. బాంబే ప్రెసిడెన్సీ రేడియో క్లబ్‌, ఇతర రేడియో క్లబ్‌ల కార్యక్రమాలతో బ్రిటిష్‌ రాజ్‌ సమయంలో జూన్‌ 1923 లో భారత దేశంలో ప్రసారం ప్రారంభమైంది. 1927 జూలై 23 న జరిగిన ఒక ఒప్పందం ప్రకారం, ప్రైవేట్‌ ఇండియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఐబిసి) రెండు రేడియో స్టేషన్లను నిర్వహించడానికి అధికారం ఇచ్చింది: 1927 జూలై 23 న ప్రారంభమైన బొంబాయి స్టేషన్‌, కలకత్తా స్టేషన్‌ 1927 ఆగస్టు 26 న ప్రారంభమైంది. 1930 మార్చి 1 న కంపెనీ పరిసమాప్తిలోకి వెళ్లింది. ప్రభుత్వం ప్రసార సదుపాయాలను స్వాధీనం చేసుకుంది, 1930 ఏప్రిల్‌ 1 న రెండు సంవత్సరాల పాటు ప్రయోగాత్మక ప్రాతిపదికన ఇండియన్‌ స్టేట్‌ బ్రాడ్కాస్టింగ్‌ సర్వీస్‌ ను ప్రారంభించింది.

1936 జూన్‌ 8 న ఆల్‌ ఇండియా రేడియోగా మారింది. ఆకాశవాణి ప్రపంచములోని అతిపెద్ద రేడియో ప్రసార వ్యవస్థలలో ఒకటి. దీని ప్రధాన కార్యాలయము కొత్త ఢల్లీి లోని పార్లమెంటు వీధిలో భారత పార్లమెంటు ప్రక్కనే ఉన్న ఆకాశవాణి భవన్‌ లో ఉంది. ఆలిండియా రేడియో ప్రభుత్వ ఆధికారిక రేడియో ప్రసార సంస్థ. ఇది భారత ప్రభుత్వ సమాచార, ప్రసార యంత్రాంగ ఆధ్వర్యములో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రసార భారతి యొక్క విభాగము. దూరదర్శన్‌ కూడా ప్రసార భారతిలో భాగమే. దేశాభివృద్ధిలో ప్రభుత్వాధీంలో ఉన్న రేడియో, అన్ని రంగాలలోను సమాచారాన్ని ఇస్తూ దేశ సమగ్రతకూ, అభివృద్ధికి ఎంతగానో ఉపయోగ పడుతోంది.  ఆల్‌ ఇండియా రేడియో సేవలు దేశ వ్యాప్తంగా 420 స్టేషన్లను కలిగి,   దేశ విస్తీర్ణంలో దాదాపు 92%, మొత్తం జనాభాలో 99.19%కి చేరు కుంటున్నది. 23 భాషలలో, 179 మాండలికాలలో ప్రసారాలు జరుగు తున్నాయి.
– రామ కిష్టయ్య సంగనభట్ల…
9440595494   

Leave a Reply