Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో టీకాల కొరత లేదు

  • ఆక్సిజన్‌ ‌సరఫరా బాధ్యత కేంద్రానిది
  • కొరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు
  • ఎంత ఖర్చయినా ప్రజలను కాపాడుకుంటాం
  • మంత్రి ఈటల రాజేందర్‌

కొరోనా నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని, ఎన్ని వందల కోట్ల రూపాయాలైనా ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజలను కాపాడుకుంటామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌స్పష్టం చేశారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ ‌చిత్తశుద్ధితో ఉన్నారని తేల్చిచెప్పారు. హుజురాబాద్‌ ‌మండలంలో కన్నుల పండువగా జరిగిన శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో మంత్రి ఈటల రాజేందర్‌ ‌పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సీతారాముల కల్యాణోత్సవం వేడుకలు నిరాడంబరంగా కొనసాగాయని, వొచ్చే కల్యాణోత్సవం అయినా కోట్లాది మంది సమక్షంలో జరగాలని ప్రార్థించానని, వైరస్‌ అం‌తం కావాలని కోరుకున్నానని, పాడి పంటలతో ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని, కొరోనా కష్ట కాలంలో ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ మహమ్మారిని పారద్రోలాలని, ప్రభుత్వానికి తోడుగా నిలవాలని అన్నారు. సెకండ్‌ ‌వేవ్‌లో గత వారం పదిరోజులుగా కేసులు అధికమవుతున్నాయని, పాజిటివ్‌ ‌కేసులు పెరగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని, ఆక్సిజన్‌, ‌బెడ్ల కొరత లేకుండా ప్రజానీకాన్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కొరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థించినట్లు మంత్రి ఈటల పేర్కొన్నారు. అంతకుముందు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ జరుగుతుందన్నారు. రాష్ట్రంలో కోవిడ్‌ ‌టీకా కొరత లేదన్నారు. ఆక్సిజన్‌ ‌కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. రెమిడిసివర్‌ ఇం‌జెక్షన్స్ ‌ప్రభుత్వ హాస్పిటళ్లలో అందుబాటులో ఉన్నాయన్నారు. డాక్టర్లు ఆక్సీజన్‌ని వృథా చేయకుండా పొదుపుగా వాడాలన్నారు. ఆక్సిజన్‌ ‌సరఫరాపై సీఎం కేసీఆర్‌, ‌మంత్రి కేటీఆర్‌, ‌తాను దృష్టి సారించామని ఈటల తెలిపారు.

Leave a Reply