Take a fresh look at your lifestyle.

గాంధీలో పరిమితికి మించి రోగుల రాక..

  • ప్రజలు స్వీయరక్షణ చర్యలు పాటిస్తూ ఇళ్లకే పరిమితం కావాలి
  • గాంధీ హాస్పిటల్‌ ‌సూపరింటెండెంట్‌ ‌రాజారావు

కొరోనా వైరస్‌ ‌విజృంభణ నేపథ్యంలో సాధ్యమైనంత వరకు ఎవరికి వారు స్వీయరక్షణతో ఇండ్లలోనే ఉండటం సురక్షితమని గాంధీ హాస్పిటల్‌ ‌సూపరింటెండెంట్‌ ‌రాజారావు స్పష్టం చేశారు. అత్యవసరమైతే తప్ప హాస్పిటళ్లకు వెళ్లకూడదని సూచించారు. వైరస్‌ ‌వ్యాప్తిని ఆపడం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. హాస్పిటళ్లలోనూ వైరస్‌ అం‌టుకునే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ‌విధించే పరిస్థితులు లేవని, ఎవరికి వారే సెల్ఫ్ ‌లాక్‌డౌన్‌ ‌విధించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గాంధీలో శుక్రవారం ఒక్కరోజే 150 మంది కోవిడ్‌ ‌రోగులను చేర్చుకున్నామని తెలిపారు. ప్రస్తుతం గాంధీలో ఐసీయూ సామర్థ్యం 350 పడకలే అని చెప్పారు. తాజాగా వొచ్చిన పాజిటివ్‌ ‌కేసులన్నీ ఐసీయూ అవసర మైనవే అని స్పష్టం చేశారు. రాత్రంతా శ్రమించి ఐసీయూ పడకలు సర్దుబాటు చేశామన్నారు. వైరస్‌ ‌బాధితుల రాక ఇదే విధంగా కొనసాగితే పరిస్థితులు కష్టతరమవుతాయన్నారు. మొత్తం 1450 ఆక్సిజన్‌ ‌పడకలు ఉన్నాయని చెప్పారు. ఆక్సిజన్‌ ‌పడకలు ఉన్నా ఐసీయూ పడకల అవసరం ఉందన్నారు. గతంలో పోలిస్తే ఇన్ఫెక్షన్‌ ‌రేటు చాలా ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు. ఆరోగ్య సిబ్బందిలోనూ గతం కంటే ఇన్ఫెక్షన్‌ అధికంగా ఉందని రాజారావు పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు హాస్పిటల్‌కి వొచ్చే పరిస్థితి రాకుండా చూసుకోవాలన్నారు. పరిస్థితి మించితే ఎవరు కూడా ఏవి• చేయలేరని ఆయన వెల్లడించారు.

Leave a Reply