Take a fresh look at your lifestyle.

కుంగ్ ఫూ అసిస్టెంట్ గ్రాండ్ మాస్టర్ గా హీరాలాల్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16 : ఆరోగ్య భారతాన్ని నిర్మించాలనే ఏకైక లక్ష్యంగా దేశంలో వేలాది మంది వైద్యరంగ నిపుణులను, శాస్త్రవేత్తలను దేశ విదేశాలలో తన శిష్య బృందాన్ని విస్తరించామని నిష్కిన్, మాంక్స్, కుంఫు యూనివర్స్ సంస్థ ఫౌండర్ డా.గల్లా ప్రకాష్ రావ్ పేర్కొన్నారు. హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిష్కిన్, మాంక్స్, కుంఫు యూనివర్స్ సంస్థకు అసిస్టెంట్ గ్రాండ్ మాస్టర్ పదవిని తన ప్రధాన శిష్యుడు హీరలాల్ భానోత్ కి అప్పగించారు. అనంతరం గల్లా ప్రకాష్ మాట్లాడుతూ హిరాలాల్ దేశ వ్యాప్తంగా లక్షలాది మంది అనారోగ్య సమస్యలను పరిష్కరిస్తున్నారని పేర్కొన్నారు. హీరాలాల్ భానోత్ మాట్లాడుతూ తన గురువుతో పాటు వారి తనయుడు డైరెక్టర్ రూపస్ గల్లా సంరక్షణలో ఆరోగ్య భారత్ నిర్మాణం కోసం పని చేస్తానన్నారు. ప్రపంచ పర్యావరణ సంస్థ జాతీయ అధ్యక్షులు డా.సిహెచ్ భద్ర, ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్, జనరల్ సెక్రటరీ ఎ.రాజేష్ గౌడ్, ఉపాధ్యక్షులు ప్రశాంత్, అసిస్టెంట్ గ్రాండ్ మాస్టర్ డి.శ్రీనివాస్ రావు, డైరెక్టర్ రూపస్ పాల్, మాస్టర్ గుడిపల్లి రవి కుమార్, విసికె రాష్ట్ర అధ్యక్షులు డా.జిలుకర శ్రీనివాస్, రిచ్ మాన్స్ గోల్డ్ లోన్ కంపెనీ సిఎండి జార్జ్ జాన్ వాలెత్, ఉపాధ్యక్షులు రామకృష్ణ, ప్రశాంత్, సోషల్ వర్కర్ మునీషా హీరాలాల్, రబ్యా బాను పాల్గొన్నారు.

Leave a Reply