Take a fresh look at your lifestyle.

లఖింపూర్‌ ‌ఖేరీ కేసులో న్యాయం కోరుతూ..

  • దేశ వ్యాప్తంగా రైతు సంఘాల రైల్‌ ‌రోకో
  • పలు ప్రాంతాల్లో రైళ్ల రాకపోకటలకు అంతరాయం
  • పలు చోట్ల పట్టాలపై రైతుల బైఠాయింపు.. ఆగిన 130 రైళ్లు
  • కేంద్ర మంత్రిని బర్తరఫ్‌ ‌చేసి, అరెస్టు చేసేవరకు నిరసనలు కొసాగిస్తామన్న రైతు సంఘాలు

లఖింపూర్‌ ‌ఖేరీ కేసుకు సంబంధించి కేంద్ర మంత్రి అజయ్‌ ‌మిశ్రాను తొలగించాలని, అరెస్టు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ సోమవారం రైతు సంఘాలు దేశవ్యాప్తంగా పిలుపునిచ్చిన ‘రైల్‌ ‌రోకో’ మిశ్రమ స్పందన కనిపించింది. నార్త్ ‌వెస్ట్రన్‌ ‌రైల్వేలో, రాజస్థాన్‌ ‌మరియు హర్యానాలలో రైల్‌ ‌రోకో ప్రభావం అధికంగా ఉంది. ఈ సందర్భంగా ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న రైతు సంఘాల సంయుక్త సంఘం కిసాన్‌ ‌మోర్చా, లఖింపూర్‌ ‌ఖేరీ కేసులో న్యాయం జరిగే వరకు నిరసనలను కొనసాగిస్తామని, ఇంకా తీవ్రతరం చేస్తామని తెలిపారు. లఖింపూర్‌ ‌ఖేరీ కేసుకు సంబంధించి కేంద్ర మంత్రి అజయ్‌ ‌మిశ్రాను వెంటనే తొలగించాలని, అరెస్టు చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్‌ ‌చేశారు. అక్టోబర్‌ 3‌న ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్‌ ‌ఖేరీలో జరిగిన హింసలో మరణించిన ఎనిమిది మందిలో నలుగురు రైతులు, బీజేపీ కార్యకర్తలను ఉన్నారు. చనిపోయిన వారిలో ఇద్దరు బిజెపి కార్యకర్తలు మరియు వారి డ్రైవర్‌ ఉన్నారు. ఆశిష్‌ ‌మిశ్రా ఒక వాహనంలో ఉన్నట్లు రైతులు పేర్కొన్నారు, ఆ ఆరోపణను ఆయన మరియు అజయ్‌ ‌మిశ్రా ఖండించారు, ఆ సమయంలో అతను ఈవెంట్‌లో ఉన్నాడని నిరూపించడానికి సాక్ష్యాలను సమర్పించవచ్చని చెప్పారు. అయితే ఈ కేసులో ఆశిష్‌ ‌మిశ్రాను అక్టోబర్‌ 9‌న అరెస్టు చేశారు. పంజాబ్‌లోని లూథియానా, అమృత్‌సర్‌, ‌జలంధర్‌, ‌మోగా, పాటియాలా మరియు ఫిరోజ్‌పూర్‌ ‌మరియు హర్యానాకు చెందిన చారీ దాద్రి, సోనిపట్‌, ‌కురుక్షేత్ర, జింద్‌, ‌కర్నాల్‌ ‌మరియు హిసార్‌తో సహా అనేక చోట్ల రైల్‌ ‌రోకో నిరసనలు జరిగాయి. బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళలతో సహా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు అజయ్‌ ‌మిశ్రాను అరెస్టు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్‌ ‌చేశారు. అయితే ‘రైల్‌ ‌రోకో’ నిరసన నేపథ్యంలో రైల్వే స్టేషన్ల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

ఫిరోజ్‌పూర్‌ ‌నగరంలోని ఫిరోజ్‌పూర్‌-‌ఫజిల్కా సెక్షన్‌ ‌మరియు మొగాలోని అజిత్వాల్‌ ‌వద్ద ఫిరోజ్‌పూర్‌-‌లూధియానా సెక్షన్‌తో సహా అనేక విభాగాలలో రైతులు రైలు పట్టాలపై కూర్చున్నారని అధికారులు తెలిపారు. నిరసన కారణంగా నార్త్ ‌వెస్ట్రన్‌ ‌రైల్వేలో, రాజస్థాన్‌ ‌మరియు హర్యానాలలో కొన్ని విభాగాలలో రెండు రైళ్లు రద్దు చేయబడగా, 13 పాక్షికంగా రద్దు కాగా, ఒకటి దారి మళ్లించబడింది. లఖింపూర్‌ ‌హింసాకాండపై సోమవారం ఉమ్మడి కిసాన్‌ ‌మోర్చా(ఎస్‌కెఎం) ఆరు గంటల ‘రైల్‌ ‌రోకో’ నిరసన ఉత్తర రైల్వే జోన్‌లో 130 ప్రాంతాలను ప్రభావితం చేయగా, 50 రైళ్లకు ఆటంకం కలిగించిందని రైల్వేస్‌ ‌చీఫ్‌ ‌పబ్లిక్‌ ‌రిలేషన్‌ ఆఫీసర్‌ ‌తెలిపారు. ఉత్తర రైల్వే జోన్‌లో ప్రభావితమైన రైళ్లలో చండీగఢ్‌-‌ఫిరోజ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉన్నాయి. న్యూఢిల్లీ-అమృత్‌సర్‌ ‌శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను శంబు స్టేషన్‌ ‌సమీపంలో నిలిపివేయడంతో ఆందోళనకారులు సహనేవాల్‌ ‌మరియు రాజ్‌పురా సమీపంలో రైల్వే ట్రాక్‌లను అడ్డుకున్నారు. రైల్‌ ‌రోకో కారణంగా రాజస్థాన్‌లో, బికనీర్‌ ‌డివిజన్‌లోని హనుమాన్‌గఢ్‌, ‌శ్రీగంగానగర్‌లో రైళ్ల రాకపోకలకు అవతరాయం ఏర్పడింది. ఎన్‌డబ్ల్యుఆర్‌ ‌ప్రతినిధి మాట్లాడుతూ భివానీ-రేవారీ, సిర్సా-రేవారీ, లోహారు-హిసార్‌, ‌సూరత్‌గఢ్‌-‌బటిండా, సిర్సా-బటిండా, హనుమాన్‌గఢ్‌-‌బతిండా, రోహ్‌తక్‌-‌భివానీ, రేవారి-సాదుల్‌పూర్‌, ‌హిసార్‌-‌బతిండా, హనుమాన్‌గర్‌-‌గంగల్‌-‌సాదుపూర్‌, ‌కొన్ని రైలు మార్గాలు ఆందోళన కారణంగా ప్రభావితమయ్యాయని తెలిపారు. కేంద్రం యొక్క మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్‌ ‌మోర్చా ఒక ప్రకటనలో లఖింపూర్‌ ‌ఖేరీ కేసులో న్యాయం జరిగే వరకు తమ నిరసనలు కొనసాగుతాయని పేర్కొంది. అంతకు ముందు రైలు రోకోను శాంతియుతంగా చేపట్టాలని, ఎలాంటి రైల్వే ఆస్తికి ఎలాంటి విధ్వంసం మరియు నష్టం జరగకుండా ఉండాలని వారు కోరారు.

సామాన్యుడిని వేధించడం కంటే రాజకీయ నాయకుల నివాసాలను ముట్టడించాలి: రైతులకు సామాన్య ప్రయాణీకుల విజ్ఞప్తి
సామాన్యుడిని వేధించడం కంటే రాజకీయ నాయకుల నివాసాలను ముట్టడించాలని స్టేషన్‌కు చేరుకున్న తర్వాత నిరసన గురించి తెలుసుకున్న పంజాబ్‌లో అత్యంత రద్దీగా ఉండే లూథియానా రైల్వే స్టేషన్‌లో జోధ్‌పూర్‌ ‌వెళ్తున్న వ్యక్తి రైతు నాయకులకు విజ్ఞప్తి చేశారు. రైతులు ప్రజల గురించి ఆలోచించాలని లూథియానా స్టేషన్‌లో తన కుటుంబంతో కలిసి రైలు కోసం ఎదురుచూస్తున్న మరొక వ్యక్తి తమ బంధువు ఒకరు మరణించడంతో వారు ఉత్తరప్రదేశ్‌లోని గోండా కోసం పరుగెత్తాల్సి వొచ్చిందని చెప్పారు. నిరసనల సమూహం మోగాలో బలవంతంగా ఆపే రైలు ముందు ‘జై జవాన్‌ ‌జై కిసాన్‌’ అని రాసి ఉన్న బ్యానర్‌ను ఉంచారు. లఖింపూర్‌ ‌హింసాకాండలో మరణించిన నలుగురు రైతుల ఫోటోలను కూడా వారు పట్టుకున్నారు.

Leave a Reply