Take a fresh look at your lifestyle.

లక్షలాది మందికి స్ఫూర్తిదాయకం… ఉప్పు సత్యాగ్రహం

‘‘‌తొమ్మిది దశాబ్ధాల క్రితం జాతిపిత మహాత్మా గాంధీ దండిలో ఉప్పు చట్టాలను ఉల్లంఘించి, వేలాది మందితో నిరసన తెలిపి, లక్షలాది మందిని చైతన్య పరిచిన సంఘట న. ఉప్పు పన్నును ధిక్కరిస్తూ మహాత్మా గాంధీ,1930 మార్చి 12 నుండి 1930 ఏప్రిల్‌ 6 ‌వరకు, 384 కిలోమీటర్ల దూరం, వేలమంది సత్యాగ్రహులతో కలిసి పాదయాత్ర చేసి గుజరాత్‌ ‌లోని దండి వద్ద ఉప్పు తయారు చేసి స్ఫూర్తిని  కల్పించిన మరిచి పోలేని నేపథ్యం.’’

తొమ్మిది దశాబ్ధాల క్రితం జాతిపిత మహాత్మా గాంధీ దండిలో ఉప్పు చట్టాలను ఉల్లంఘించి, వేలాది మందితో నిరసన తెలిపి, లక్షలాది మందిని చైతన్య పరిచిన సంఘట న. ఉప్పు పన్నును ధిక్కరిస్తూ మహాత్మా గాంధీ,1930 మార్చి 12 నుండి 1930 ఏప్రిల్‌ 6 ‌వరకు, 384 కిలోమీటర్ల దూరం, వేలమంది సత్యాగ్రహులతో కలిసి పాదయాత్ర చేసి గుజరాత్‌ ‌లోని దండి వద్ద ఉప్పు తయారు చేసి స్ఫూర్తిని  కల్పించిన మరిచి పోలేని నేపథ్యం. ఉప్పు సత్యాగ్రహ ప్రచారం గాంధీ ప్రవచించిన సత్యాగ్రహ సూత్రాలపై ఆధార పడింది.1930 ప్రారంభంలో, బ్రిటిషు పాలన నుండి భారత సార్వ భౌమత్వాన్ని, స్వయం పాలననూ సాధించు కోవటానికి భారత జాతీ య కాంగ్రెస్‌, ‌తన ప్రధాన వ్యూహం గా సత్యాగ్రహాన్ని ఎంచుకుంది. ప్రచారాన్ని నిర్వహించడానికి గాంధీని నియమించింది. 1882 బ్రిటిషు ఉప్పు చట్టాన్ని గాంధీ తమ సత్యాగ్రహ మొదటి లక్ష్యంగా ఎంచుకున్నారు.గాంధీ, తన ప్రార్థన సమావేశాల లోనూ పత్రికలతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ, ప్రకటనలు ఇస్తూ ప్రపంచ వ్యాప్తంగా మీడియాను ఈ మార్చ్ ‌కోసం సిద్ధం చేశాడు. మార్చ్‌కు ముందు రోజు సాయంత్ర పు ప్రార్థనలో గాంధీ చెప్పేది వినడా నికి వేలాది మంది భారతీయులు సబర్మతికి చేరుకున్నారు. అమెరి కన్‌ ‌పత్రిక, ది నేషన్‌ ఇలా రాసింది: ‘‘గాంధీ ఇచ్చే పోరాట ప్రకటన వినడానికి 60,000 మంది ప్రజలు నది ఒడ్డున గుమిగూడారు. ఈ పోరాటపు పిలుపు బహుశా ఇప్పటి వరకు ఇచ్చిన పిలుపులన్నిటి లోకీ విలక్షణమైనది’’.

భారతదేశంలో బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా జరిపిన శాసనోల్లం ఘనలో భాగంగా, మహాత్మా గాంధీ నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రె సు జరిపిన అహింసాయుత సత్యా గ్రహమే ఉప్పు సత్యాగ్రహం. దీన్ని దండి సత్యాగ్రహం అనీ, దండి యాత్ర అనీ, దండి మార్చ్ అనీ కూడా పిలుస్తారు. ఉప్పు పన్నును ధిక్కరిస్తూ గాంధీ,1930 మార్చి 12 నుండి 1930 ఏప్రిల్‌ 6 ‌వరకు, 384 కిలోమీటర్ల దూరం, వేలమంది సత్యాగ్రహులతో కలిసి పాదయాత్ర చేసి గుజరాత్‌ ‌తీరం లోని దండి వద్ద ఉప్పు తయారు చేసాడు. శాస నోల్లంఘన ఉద్యమంలో ఎక్కువ మంది పాల్గొనేలా స్ఫూర్తినిచ్చే బలమైన ప్రారంభ ఘటనగా దండి యాత్ర ఉపయోగ పడింది. మహాత్మా గాంధీ తన 79 మంది సత్యాగ్రహ వాలంటీర్లతో సబర్మతి ఆశ్రమంలో ఈ యాత్రను ప్రారంభించాడు.
దండి సత్యాగ్రహం లో మహాత్ముని తో కలిపి 80మంది పాల్గొన్నారు.
1.మోహన్‌దాస్‌ ‌కరంచంద్‌ ‌గాంధీ, గుజరాత్‌,
2.‌ప్యారేలాల్‌ ‌నయ్యర్‌, ‌పంజాబ్‌,
3.‌ఛగన్‌లాల్‌ ‌నాథ్థు భాయ్‌ ‌జోషి, గుజరాత్‌,
4.‌పండిత నారాయణ్‌ ‌మోరేశ్వర్‌ ‌ఖరే మహా రాష్ట్ర,
5. గంపత్‌ ‌రావ్‌ ‌గోడ్సే, మహారాష్ట్ర,
6.ప్రథ్వీరాజ్‌ ‌లక్ష్మీదాస్‌ అషర్‌ ‌గుజరాత్‌,
7.‌మహవీర్‌ ‌గిరి
8. బాల్‌ ‌దత్తాత్రేయ కాలేల్కర్‌ ‌మహా రాష్ట్ర,
9.జయంతి నాథూభాయ్‌ ‌పరెఖ్‌ ‌గుజరాత్‌,
10.‌రసిక్‌ ‌దేశాయ్‌ ‌గుజరాత్‌,
11. ‌విఠల్‌ ‌లీలాధర్‌ ‌థక్కర్‌, ‌గుజరాత్‌,
12. ‌హరఖ్జీ రాంజీభాయ్‌, ‌గుజరాత్‌,
13 ‌తన్సుఖ్‌ ‌ప్రన్షంకర్‌ ‌భట్గు గుజరాత్‌,
14. ‌కాంతీలాల్‌ ‌హరి లాల్‌ ‌గంధి, గుజరాత్‌,
15. ‌ఛోటూ భాయ్‌ ‌ఖుషల్భాయ్‌ ‌పటేల్‌, ‌గుజరాత్‌,
16. ‌వాల్జీభాయ్‌ ‌గోవింద్‌జీ దేశాయ్‌ ‌గుజరాత్‌,17. ‌పన్నాలాల్‌ ‌బలభాయ్‌ ‌ఝవేరి గుజరాత్‌,
18 అబ్బాస్‌ ‌వర్తేజీ గుజరాత్‌,
19. ‌పుంజాభాయ్‌ ‌షా కూడా, గుజరాత్‌,
20. ‌మాధవ్‌జీ భాయ్‌ ‌థక్కర్‌, ‌గుజరాత్‌,
21. ‌నరంజీ భాయ్‌ ‌గుజరాత్‌,
22 ‌మగన్‌ ‌భాయ్‌ ‌వోర, గుజరాత్‌,
23. ‌దుంగార్సీ భాయ్‌ ‌గుజరాత్‌,
24 .‌సోమాలాల్‌ ‌ప్రాగ్జీ భాయ్‌ ‌పటేల్‌, ‌గుజరాత్‌,
25 ‌హస్ముఖ్‌రాం జకాబార్‌, ‌గుజరాత్‌,
26. ‌దౌడ్‌భాయ్‌, ‌గుజరాత్‌,
27 ‌రాంజీభాయ్‌ ‌వంకర్‌, ‌గుజరాత్‌,
28. ‌దినకర్‌రాయ్‌ ‌పాండ్య, గుజరాత్‌,
29 ‌ద్వారకానాథ్‌, ‌మహారాష్ట్ర,
30. గజానన్‌ ‌ఖరే, మహారాష్ట్ర,
31. జెథాలాల్‌ ‌రూపా రెల్‌కచ్‌, ‌గుజరాత్‌,
32. ‌గోవింద్‌ ‌హర్కరే మహారాష్ట్ర,
33. పాండు రంగ్‌ ‌మహారాష్ట్ర,
34. వినాయక్‌ ‌రావ్‌ ఆప్తే, మహారాష్ట్ర,
35. రాంతీర్థ్ ‌రాయ్‌ ‌యునైటెడ్‌ ‌ప్రావిన్సెస్‌,
36 ‌భాను శంకర్‌ ‌దవే, గుజరాత్‌,
37. ‌మున్షిలాల్‌, 38. ‌రాఘవన్‌, ‌కేరళ,
39. రవ్జీభాయ్‌ ‌నాథలాల్‌ ‌పటేల్‌ ‌గుజరాత్‌,
40 ‌షివభాయ్‌ ‌గొఖల్భాయ్‌ ‌పటేల్‌ ‌గుజరాత్‌,
41. ‌శంకర్భాయ్‌ ‌భీకాభాయ్‌ ‌పటేల్‌, ‌గుజరాత్‌,
42. ‌జష్భాయ్‌ ఇష్వర్భా య్‌ ‌పటేల్‌, ‌గుజరాత్‌,
43. ‌సుమం గళ్‌ ‌ప్రకాశ్‌,
44 ‌థేవర్‌ ‌తుండియిల్‌ ‌టైఇటస్‌, ‌కేరళ,
45. కృష్ణ నాయర్‌, ‌కేరళ,
46 తపన్‌ ‌నైర్‌ ‌కేరళ,
47. హరి దాస్‌ ‌వర్జీవందాస్‌ ‌గాంధీ, గుజరాత్‌,
48. ‌చిమన్లాల్‌ ‌నర్సిలాల్‌ ‌షహ్‌ ‌గుజరాత్‌,
49. ‌షంకరన్‌, ‌కేరళ, 50. సుబ్రహ్మణ్యం, ఆంధ్రప్రదేశ్‌,
51. ‌రామనిక్లాల్‌ ‌మగన్లాల్‌ ‌మొది , గుజరాత్‌,
52. ‌మదన్‌ ‌మోహన్‌ ‌చతుర్వేది, రాజస్థాన్‌,
53. ‌హరిలాల్‌ ‌మహింతుర, మహారాష్ట్ర,
54. మోతీ బస్‌ ‌దాస్‌ ఒడిశా,
55. హరిదాస్‌ ‌మజుందార్‌, ‌గుజరాత్‌,
56 ఆనంద్‌ ‌హింగోరిని, సింధ్‌,
57. ‌మహదేవ్‌ ‌మార్తాంద్‌, ‌కర్ణాటక,
58. జయంతిప్రసాద్‌ ‌యునైటెడ్‌ ‌ప్రావిన్సెస్‌,
59. ‌హరిప్రసాద్‌, ‌యునై టెడ్‌ ‌ప్రావిన్సెస్‌,
60. అనుగ్రహ్‌ ‌నారాయణ్‌ ‌సిన్హా బీహార్‌,
61. ‌కేశవ్‌ ‌చిత్రే, మహారాష్ట్ర,
62 అంబలాల్‌ ‌శంకర్భాయ్‌ ‌పటేల్‌, ‌గుజరాత్‌,
63. ‌విష్ణు పంత్‌, ‌మహారాష్ట్ర,
64. ప్రేంరాజ్‌, ‌పంజాబ్‌, 65. ‌దుర్గేష్‌ ‌చంద్ర దాస్‌, ‌బెంగాల్‌,
66. ‌మాధవ్‌లాల్షా, గుజరాత్‌, 67 ‌జ్యోతిరాం
68. సూరజ్‌ ‌భాన్‌, ‌పంజాబ్‌, 69. ‌భైరవ్‌ ‌దత్త్,
70 ‌లాల్జీ పర్మర్‌, ‌గుజరాత్‌, 71. ‌రత్నజీ బొరీ, గుజరాత్‌,
72 ‌విష్ణు శర్మ, మహారాష్ట్ర,73. చింతామణి శాస్త్రి, మహారాష్ట్ర,
74 నారాయణ్‌ ‌దత్త్, ‌రాజస్థాన్‌,
75 ‌మనిలాల్‌ ‌మోహందాస్‌ ‌గాంధీ, గుజరాత్‌,
76 ‌సురెంద్ర, 77.హరి కృష్ణ మొృని, మహారాష్ట్ర,
78 పురతన్‌ ‌బుచ్‌, ‌గుజరాత్‌,
79 ‌ఖరగ్‌ ‌బహదుర్‌ ‌సింఘ్‌ ‌గిరి, నేపాల్‌ ‌సంస్థానం,
80 శ్రీ జగత్‌ ‌నారాయణ్‌, ఉత్తర ప్రదేశ్‌.

‌ప్రసిద్ధ దండి యాత్రలో పాల్గొన్న ఈ సత్యాగ్రహులను గౌరవిస్తూ ఐఐటి బొంబాయి ఆవరణలో ఒక స్మారక చిహ్నాన్ని రూపొందించారు.
1930 ఏప్రిల్‌ 6 ‌న, ఉదయం 6:30 గంటలకు గాంధీ దండిలో ఉప్పు చట్టాలను ఉల్లంఘించినప్పుడు, ఇది కోట్లాది భారతీయులు బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున శాసనోల్లంఘన ఉద్యమం లో పాల్గొనడానికి స్ఫూర్తి నిచ్చింది.ఏప్రిల్‌ 6 ఉదయం, ప్రార్థన తరువా త, గాంధీ ఉప్పు బురదను పైకి లేపి, ‘‘దీనితో, నేను బ్రిటిషు సామ్రా జ్యపు పునాదులను కదిలిస్తు న్నాను’’ అని ప్రకటించాడు. తరు వాత ఆయన దానిని సముద్రపు నీటిలో ఉడకబెట్టి, బ్రిటిషు చట్టాన్ని ధిక్కరిస్తూ ఉప్పును తయారు చేశాడు. తన వేలాది మంది అనుచరులను కూడా అదేవిధంగా సముద్ర తీరం వెంబడి ‘‘ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ’’ ఉప్పును తయారు చేయమని చెప్పాడు. గ్రామస్థులను కూడా ఉప్పును తయారు చేయమని చెప్పమని కూడా వారిని కోరాడు. ఇలా 79మందితో మహాత్ముడు ఈ కార్యక్రమం ప్రాంభించగా, సాధా రణంగా గాంధీ కార్యక్రమాలలో జనసమూహాన్ని తగ్గించి రాసే అధికారిక  వార్తాపత్రిక ది స్టేట్స్‌మన్‌, ‌సబర్మతి – అహ్మదాబాద్‌ ‌రహదారిపై 1,00,000 మంది ప్రజలు ఉన్నారని పేర్కొనడం గమనార్హం.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Leave a Reply