Take a fresh look at your lifestyle.

ఖమ్మంలో ఘనంగా నర్సుల దినోత్సవం

ఖమ్మం సిటి, మే 12 (ప్రజాతంత్ర విలేకరి) : అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్బంగా ఖమ్మంలో ఎంబిసిజిల్లా కమిటి ఆధ్వర్యంలో మంగళవారం నర్సులను గౌరవించారు. ఈ సందర్బంగా నర్సు సూర్యపోగు మేరీని ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆ సంఘ జిల్లా అధ్యక్షులు షేక్‌ ‌షకీనా మాట్లాడుతూ కరోనా సమయంలో తమ ప్రాణాలకు తెగించి కుటుంబసభ్యులను ఇంటివద్దనే వదిలేసి రోగుల సేవే పరమావధిగా సేవలందిస్తున్న నర్సులకు ఏమిచ్చినా వారి ణంతీర్చుకోలేనిదన్నారు. ఖమ్మంలో మేరీ సేవలు అందరిచేత ప్రశంసలు పొందాయన్నారు. తెలంగాణ సిఎం కేసిఆర్‌ ‌మేరీ చేసిన సేవలను గుర్తించి ఆమెను తన పెద్దకూతురిగా పేర్కోన్నారని గుర్తుచేసారు.

నర్సుల దినోత్సవం సందర్బంగా మేరీకి తెలంగాణకు హరితహారమైన పవిత్రమైన మొక్కన, పవిత్రమైన ఖురాన్‌ను అందించి సన్మానించినట్లు చెప్పారు. కరోనా పేషంట్లకు వైద్యం చేస్తూ తమ ప్రాణాలను కోల్పోయిన ఎందరో వైద్యులకు, నర్సులకు నివాళిగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేను సైతం మిషన్‌రాష్ట్ర కమిటి సభ్యులు ఖిజర్‌, ‌తెరాస నాయకులు అబ్దుల్‌రహిమాన్‌, ‌దూదేకుల సంఘ రాష్ట్ర అద్యక్షులు షేక్‌ ‌సిధ్దాసాహెబ్‌, ‌బిసి నాయకులు రచ్చా రామారావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply