Take a fresh look at your lifestyle.

చైర్‌ ‌పర్సన్‌తో పాటు.. ఎమ్మెల్యే రోహిత్‌ ‌రెడ్డి దొంగ వోటు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాండూర్‌ ‌మున్సిపల్‌ ‌చైర్‌ ‌పర్సన్‌తో పాటు తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ ‌రోహిత్‌ ‌రెడ్డి సైతం దొంగ వోటు వేశారని ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా  బరిలో నిలిచిన మాజీ మంత్రి చిన్నారెడ్డి, డిసిసి అధ్యక్షుడు రామ్మోహన్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం దొంగ వోటు వ్యవహారంపై మునిసిపల్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌తాటికొండ స్వప్న, చిన్నారెడ్డి, డిసిసి అధ్యక్షుడు రామ్మోహన్‌ ‌రెడ్డి తాండూర్‌ ‌నియోజకవర్గ ఇంచార్జ్ ‌రమేష్‌ ‌మహారాజ్‌, ‌ఫిర్యాదుదారులు జిల్లా అదనపు కలెక్టర్‌ ‌మోతిలాల్‌కు వివరణ ఇచ్చారు.

అనంతరం రామ్మోహన్‌ ‌రెడ్డి,  చిన్నారెడ్డిలు మాట్లాడుతూ పైలట్‌ ‌రోహిత్‌ ‌రెడ్డి ఇంటర్మీడియట్‌ ‌తర్వాత అమెరికాలో పైలెట్‌ ‌లైసెన్స్ ‌తీసుకున్నారని, కానీ భారతదేశానికి వొచ్చిన తర్వాత అలాంటి లైసెన్స్‌ను ఇక్కడ కూడా తీసుకోవాల్సి ఉన్నా తీసుకోకుండా నేరుగా వోటు హక్కును వినియోగించుకున్నారని పేర్కొన్నారు. ఇది కూడా ఖచ్చితంగా దొంగ వోట్లు కిందికే వొస్తుందని, వెంటనే ఆయనను శాసనసభ సభ్యుడిగా బర్తరఫ్‌ ‌చేసి తాండూరులో మళ్లీ ఎలక్షన్‌ ‌నిర్వహించాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. ఈ విషయమై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

మునిసిపల్‌ ‌చైర్మన్‌ ‌తాటికొండ స్వప్న తన వోటు లేకున్నా తన మరిది బార్య తోటి కోడలు వోటును వేసి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని, వారిపై వెంటన్నే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ కార్యక్రమంలో ఇంకా రత్నారెడ్డి, శ్రీనివాస్‌ ‌రెడ్డి, శ్రీనివాస్‌ ‌ముద్దిరాజ్‌, ‌జొన్నల రవిశంకర్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply