తను ఉగ్రవాది కాదు
మతోన్మాది కానే కాదు
సంఘవిద్రోహి అసలే కాదు
అయినా రాజ్యం కుతంత్రానికి
మరో క్రీస్తులా సిలువ మోస్తుంది
ధ్వంస రచన చేయలేదు
విధ్వేషాలు రెచ్చగొట్టలేదు
వికృతాలకు తెగబడలేదు
అయినా పాలకుల దాస్టికానికి
చీకటి జైల్లో బందీగా మిగిలింది
సామాజిక ఉద్యమకారిణి
తీస్తా సీతల్వాడ్ నిక్కచ్చిగా
బడుగు ,బలహీనుల పక్షాన
గళం వినిపించడం నేరమైంది
గుజరాత్ మత ఘర్షణలో
దోషుల శిక్షించాలని కోర్టుల్ని
ఆశ్రయించడం పాతుకమైంది
ఓయి రాజ్య పాలకుడా !
స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం
హక్కుల కుత్తుక తెగ్గోయడం
నిజం తలకు ఉరి బిగించడం
రాజ్యాంగ స్ఫూర్తికి చిహ్నమా?
మేం చెప్పిందే వేదం
చేసిందే శిలా శాసనం
వింటే సరి లేకుంటే ‘‘ఉరి’’
అన్నట్టు పాలన సాగించడం
ప్రజాస్వామ్యానికి ప్రతీకమా ?
ఇప్పటికైనా సోయికి వచ్చి
ఆధిపత్య పోకడ చాలించి
వేధింపుల పర్వం ముగించి
అక్రమ అరెస్టులు విరమిస్తే సరి !
లేదంటే ప్రజాపోరు తప్పదు మరి !!
( హక్కుల నేత్రి తీస్తా సీతల్వాడ్
అక్రమ అరెస్టుకు నిరసనగా…)
– కోడిగూటి తిరుపతి, 9573929493