Take a fresh look at your lifestyle.

దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

న్యూ దిల్లీ, జూన్‌ 27 : ‌దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. మంగళ, బుధవారాల్లో 24 గంటల వ్యవధిలో 115.5 మిల్లీమీటర్లకు మించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో దేశ ఆర్థిక రాజధాని ముంబయికి ఆరెంజ్‌ ‌హెచ్చరిక జారీ చేసింది. ముంబయి, శాటిలైట్‌ ‌నగరాలతో సహా కొంకణ్‌ ‌ప్రాంతంలో రుతుపవనాలు ఉత్తర దిశగా కదులుతున్నందున మరింత బలపడే అవకాశం ఉందని పూణేలోని ఐఎండీ సీనియర్‌ ‌శాస్త్రవేత్త కేఎస్‌ ‌హోసలికర్‌ ‌తెలిపారు. ఫలితంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనీ, కొంకణ్‌, ‌విదర్భ, మధ్య మహారాష్ట్రలకు కూడా హెచ్చరికలు జారీ చేయనున్నట్టు తెలిపారు. రాబోయే 4, 5 రోజుల్లో తూర్పు మధ్య, వాయవ్య, పశ్చిమ భారతదేశంలో చురుకైన రుతుపవనాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది.

నైరుతి రుతుపవనాలు గుజరాత్‌, ‌రాజస్థాన్‌, ‌హర్యానా, పంజాబ్‌, ‌పశ్చిమ హిమాలయ ప్రాంతంలోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, గుజరాత్‌, ‌రాజస్థాన్‌, ‌హర్యానా, పంజాబ్‌ ‌లోని మరికొన్ని ప్రాంతాలకు, జమ్మూ, కాశ్మీర్‌, ‌లడఖ్‌ ‌లోని మిగిలిన ప్రాంతాలకు రుతుపవనాలు సోమవారం విస్తరించాయని తెలిపింది. వచ్చే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు గుజరాత్‌, ‌రాజస్థాన్‌ ‌లోని మరికొన్ని ప్రాంతాలు, హర్యానా, పంజాబ్‌ ‌లోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది. తూర్పు.. దానిని ఆనుకుని ఉన్న ఈశాన్య భారతంలో వచ్చే 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో తేలికపాటి, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. జూన్‌ 29, 30 ‌తేదీల్లో అస్సాం, మేఘాలయ, అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ ‌లలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రానున్న 2 రోజుల్లో తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతదేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటనలో తెలిపింది. వాయవ్య భారతదేశంలో, పశ్చిమ హిమాలయ ప్రాంతం, వాయువ్య భారతదేశంలోని మైదానాలలో రాబోయే 5 రోజుల్లో తేలికపాటి, మోస్తరు నుండి విస్తృతమైన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

జూన్‌ 29‌న తూర్పు రాజస్థాన్‌ ‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. జూన్‌ 27, 28 ‌తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 27న ఉత్తరాఖండ్‌, ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రాబోయే 3, 4 రోజుల్లో మధ్యప్రదేశ్‌, ‌ఛత్తీస్‌ ‌గఢ్‌, ‌విదర్భలలో తేలికపాటి నుంచి విస్తృతమైన వర్షాలు, ఉరుములు మెరుపులతో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ భారతదేశంలో, రాబోయే 5 రోజులలో తేలికపాటి నుండి చాలా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2 రోజులలో ఈ ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్‌ 27 ‌న కేరళ, మాహేలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 26 నుంచి 30 వరకు కోస్తా కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్‌ 29, 30 ‌తేదీల్లో దక్షిణ ఇంటీరియర్‌ ‌కర్ణాటకలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అలాగే, రానున్న 5 రోజుల్లో పశ్చిమ భారతంలో తేలికపాటి నుంచి మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జూన్‌ 26 ‌నుంచి 30 వరకు కొంకణ్‌, ‌గోవా, గుజరాత్‌ ‌రాష్ట్రం, మధ్య మహారాష్ట్రలోని ఘాట్‌ ‌ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Leave a Reply