Take a fresh look at your lifestyle.

హంతకులెవరు ..?

“ఈ నివేదిక ఉపోద్ఘాతాన్ని క్లుప్తంగా ఆదిరాజు వెంకటేశ్వరరావు రాసిన హంతకు లెవరు? (వెలుగు పబ్లికేషన్స్ 1977) ‌నుంచి ఈ కింద ఇస్తున్నాను. ‘‘సాయుధ సంఘర్షణలు’’ గా అభివర్ణించిన, పదిమంది మృతికి కారణమైన మూడు సంఘటనల గురించి కమిటీ సాక్ష్యాన్ని సేకరించింది. వాటిలో రెండు సంఘర్షణలు అసలు జరగనే జరగలేదని కమిటీకి నమ్మకం కలిగింది. మూడవ సంఘర్షణ కూడ నిజం కాదని చెప్పేందుకు కూడ చాలా ఆధారాలు కన్పిస్తున్నాయి.ప్రతి సందర్భంలోను తమకు చేజిక్కిన వ్యక్తులను పోలీసులు ఎంత క్రూరంగా హింసించినదీ సాక్షులు వివరించారు. ఈ హింసాకాండలో ఉద్దేశ్యం పోలీసులు ఇరికించిన కేసులలో తాము నిజంగానే దోషులని వారిని అంగీకరింప చేయటానికేనని అర్థమవుతుంది.1973 క్రిమినల్‌ ‌ప్రోసీజర్‌ ‌కోడ్‌ ‌సెక్షన్‌ 174‌లో నిర్దేశించిన ప్రకారం మృతదేహాలపై అధికారులు విచారణ ఏ ఒక్క సందర్భంలోను జరిపించలేదు.”

తర్వాత కూడ ఆందోళన •నసాగింది. ఏమంటే ఒక ఇంటిలిజెన్స్ ఉద్యోగి నేనున్న పెట్టెలోకి ఎక్కాడు. కాని తర్వాత ఏమీ జరగలేదు. మా రెండో మధ్యంతర నివేదికను కూడా జూన్‌లో విడుదల చేశాం. అది ఢిల్లీలో వర్గీస్‌ ‌విడుదల చేశాడనుకుంటాను. ఈ రెండు నివేదికల సారాంశం అరుణ్‌ ••రి తన పుస్తకంలో ఒక అధ్యాయంగా రాశాడు. మా నివేదికలు తెలుగులో విస్తృతంగా అచ్చయ్యాయి. అప్పుడు జనతా ప్రభుత్వ కాలంలో వెల్లువెత్తిన ప్రజాస్వామిక వాతావరణం వల్ల తార్కుండే కమిటీ నివేదికలకు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం వచ్చింది.మా నివేదికలన్నీ పద్ధతి ప్రకారం ఽం మంత్రిత్వ శాఖకు, ప్రధాని కార్యాలయానికి కూడ పంపించేవాళ్ళం. జయప్రకాశ్‌ ‌నారాయణ్‌కు అందజేయడం, ప్రజల ముందుంచడం, పత్రికలకు తెలియజేయడం సరేసరి.
ఈ నివేదిక ఉపోద్ఘాతాన్ని క్లుప్తంగా ఆదిరాజు వెంకటేశ్వరరావు రాసిన హంతకు లెవరు? (వెలుగు పబ్లికేషన్స్ 1977) ‌నుంచి ఈ కింద ఇస్తున్నాను.‘‘సాయుధ సంఘర్షణలు’’ గా అభివర్ణించిన, పదిమంది మృతికి కారణమైన మూడు సంఘటనల గురించి కమిటీ సాక్ష్యాన్ని సేకరించింది. వాటిలో రెండు సంఘర్షణలు అసలు జరగనే జరగలేదని కమిటీకి నమ్మకం కలిగింది. మూడవ సంఘర్షణ కూడ నిజం కాదని చెప్పేందుకు కూడ చాలా ఆధారాలు కన్పిస్తున్నాయి.ప్రతి సందర్భంలోను తమకు చేజిక్కిన వ్యక్తులను పోలీసులు ఎంత క్రూరంగా హింసించినదీ సాక్షులు వివరించారు. ఈ హింసాకాండలో ఉద్దేశ్యం పోలీసులు ఇరికించిన కేసులలో తాము నిజంగానే దోషులని వారిని అంగీకరింప చేయటానికేనని అర్థమవుతుంది.1973 క్రిమినల్‌ ‌ప్రోసీజర్‌ ‌కోడ్‌ ‌సెక్షన్‌ 174‌లో నిర్దేశించిన ప్రకారం మృతదేహాలపై అధికారులు విచారణ ఏ ఒక్క సందర్భంలోను జరిపించలేదు.

kg kannabiran

    ఈ హత్యలు జరిగిన పద్ధతి మాకు అవగతం అయినట్టు వివరిస్తున్నాము. నిర్బంధించిన వారిని హింసించి చంపడంలో పాత్ర వున్నట్టుగా చెప్పబడే అధికారుల జాబితాను విడిగా కేంద్ర దేశీయాంగ శాఖామంత్రికి అప్పగిస్తున్నాము. వివిధ సాక్షుల పత్రాలను కూడ దేశీయాంగ శాఖ మంత్రికి అప్పచెపుతున్నాము. ఆంధ్ర ప్రదేశ్‌లో ‘‘సాయుధ సంఘర్షణ’’లని పేర్కొనబడిన వాటిలో పౌరులు చనిపోయిన ఉదంతాలన్నింటిపైనా విచారణ జరిపేందుకు న్యాయవిచారణ సంఘాన్ని నియమించాలని కూడ కోరుతున్నాము. ఈ సంఘటనలు న్యాయ విచారణకు తగినవనీ, అత్యవసర ప్రజాప్రాముఖ్యత కలవనీ చెప్పడంలో ఏ సందేహమూ లేదు. మేము ఇంతవరకు సేకరించిన సాక్ష్యం, ఇకముందు సేకరించనున్న సాక్ష్యం మా మటుకు మేము విచారణ సంఘం ఏర్పాటు కాగానే ఆ సంఘానికి అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నాము.
రెండు – మేము పేర్కొన్న పోలీసు అధికారులను విచారణ అయ్యేవరకు తాత్కాలికంగా ఉద్యోగం నుండి తొలగించినట్లయితే వారు సాక్ష్యాన్ని వమ్ముచేసే అవకాశం ఉండదు.
మూడు – విచారణ అనంతరం సంఘర్షణలు జరగడం అబద్ధమనీ, ఇవి కేవలం పచ్చి హత్యలని తేలితే మాత్రం అందుకు సంబంధించిన అధికారులందరినీ హత్యా నేరంపై విచారించి శిక్షించగలరని విశ్వసిస్తున్నాము.
నాలుగు – హత్యలు రుజువైతే మంత్రిత్వ స్థాయి బాధ్యత, మంత్రుల సమిష్టి బాధ్యత సూత్రాలను దృష్టిలో ఉంచు•ని అసలు ఖునీకోరులు తప్పించుకోకుండా చూడగలరనీ, ఎవరో కొందరు జూనియర్‌ ‌పోలీసు అధికారులను మాత్రమే దండించి సంతృప్తి పడరనీ విశ్వసిస్తున్నాము. ఒక్కసారికాదు పెక్కుసార్లు తను నక్సలైట్లను తుడిచి పారవేసినట్టు ముఖ్యమంత్రి శ్రీ వెంగళరావు చేసిన ప్రకటనలు గుర్తుంచుకోవాలి.
అయిదు – పోలీసులు వారిపై అఘాయిత్యం చేయకుండా సాక్షులకు రక్షణ కల్పించాలి. రక్షణ కొరకు మేము చేసిన విజ్ఞప్తిని పురస్కరించుకు ని కొందరు సాక్షులు హైదరాబాదు కస్తూరీబా గాంధీ సేవాసంఘ ఆశ్రమానికి మారుతున్నారు. వారు ఓం ప్రకాశ్‌ ‌గుప్త (సర్వోదయ నాయకుడు) కనుసన్నలలో ఉంటారు. వారు పోలీసుల నుండి సురక్షితంగా ఉండేట్టు చూడాలి.విచారణ జరిపించడానికి మేము సేకరించిన సాక్ష్యం తగినంత ఉన్నదనే భావిస్తున్నాము.ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తక్షణం న్యాయవిచారణకు చర్యలు గై•నకపోతే మేము మా విచారణను కొనసాగిస్తూ మేము సేకరించిన వివరాలను ఎప్పటికప్పుడు పత్రికలకు విడుదల చేస్తాము.ఎట్లాగయినా మా దృష్టికి వచ్చిన 77 హత్యా సంఘటనలపై మేము విచారణ కొనసాగిస్తాము. న్యాయవిచారణ జరిగితే సాక్ష్యం అంతటినీ అంద చేస్తాము.
ఈ హత్యల గురించి తెలిసిన వారు ఆ సమాచారమంతా భయాన్ని వదిలి, ముందుకు వచ్చి మాకు తెలుప వలసిందిగా ఆంధ్ర ప్రదేశ్‌ ‌ప్రజలకు కూడ మేము విజ్ఞప్తి చేస్తున్నాము.ఈ పని వారు బహిరంగంగా చేస్తేనే వారికి క్షేమకరమని కూడ మేము విజ్ఞప్తి చేస్తున్నాము.
ప్రతి సందర్భంలో ఒక సాక్షి తనకు తెలిసిన సమాచారంపై సాక్ష్యం ఇస్తే అతనికి తగిన రక్షణ కల్పించవలసినదిగా మేము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగలము.
మా నివేదికలు సమర్పించే క్రమంలో అప్పటి ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయినీ, ఽం మంత్రి చరణ్‌సింగ్‌నూ చాలాసార్లే కలవవలసి వచ్చింది. మొరార్జీ దేశాయితో నా పరిచయం బాగా పెరిగింది. ఆయనతో ఈ విషయాలు మాట్లాడేటప్పుడు దీని మీద ఏం చేస్తే బాగుంటుందని చర్చ జరిగింది. ఎటువంటి విచారణ కమిషన్‌ ‌వేస్తే ఉపయోగకరం అని మాట్లాడుకున్నాం. నివేదికలు చదవగానే ఒక అధికారిక విచారణ కమిషన్‌ ‌వేయవలసిందే అని మొరార్జీ దేశాయి నిర్ణయించారు. కాని అది సాధ్యమా కాదా చర్చించేందుకు ఽం మంత్రిత్వ శాఖతో మాట్లాడమని మాకాయన సూచించారు.
ఇక మేం ఽం మంత్రి చరణ్‌ ‌సింగ్‌ ‌దగ్గరికి వెళ్ళాం. ఆయన దగ్గర కూడ వివరంగానే సాధ్యాసాధ్యాలు మాట్లాడాం. ఆయనకు కూడ విచారణ కమిషన్‌ ‌నియమించాలనే అభిప్రాయం ఉన్నప్పటికీ, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి రాదు. అటువంటి కమిషన్‌ను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. రాజ్యాంగంలోని అధికరణం 21 ఉల్లంఘన జరిగితే, నిష్కారణంగా, చట్టబద్ధ పక్రియ లేకుండా ప్రభుత్వ బలగాలు ప్రజల ప్రాణాలు తీస్తుంటే అది కేంద్ర పరిధిలోకి వస్తుందా, రాష్ట్ర పరిధిలోకి వస్తుందా అని చర్చ చేస్తారా అని మేం వాదించాం. ఇది కేవలం శాంతిభద్రతల సమస్య కాదు. అట్లా పరిగణించి అందువల్ల రాష్ట్ర జాబితాలోని అంశం అనడానికి వీలులేదు. ఇది హత్య.

ఉద్దేశపూర్వకమయిన   హత్య. ప్రజల ప్రాణాలు తీయడం కనుక కేంద్రం జోక్యం చేసుకోవచ్చు అని మేం వాదించాం. ఈ చర్చల తర్వాత వాళ్ళు ఒక రాజీ సూత్రం ప్రతిపాదించారు. కేంద్రం న్యాయ మూర్తి పేరు ప్రతిపాదిస్తుంది. ఆ న్యాయమూర్తిని రాష్ట్ర ప్రభుత్వం నియమించి విచారణ కొనసాగిస్తుంది. బహుశా అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన రాజీ కావచ్చు.
-కె.జి. కన్నబిరాన్‌
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం
అక్షరీకరణ :ఎన్ .వేణుగోపాల్

Leave a Reply