Take a fresh look at your lifestyle.

మహిళల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు

జూలై 31: రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు.
సోమవారం బైపాస్ రోడ్ లోని పాత డిఆర్డిఏ కార్యాలయంలో గల జిల్లా సమాఖ్య సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సమాఖ్య సమావేశానికి ఆయన జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ తో కలిసి హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాల తోడ్పాటును అందిస్తుందన్నారు.రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని, మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ఒక్క రూపాయి కూడా గ్యారెంటీ లేకుండా మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందిస్తున్నామన్నారు.
మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, మహిళలు మరింత ఉన్నతంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ మాట్లాడుతూ జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళల ఒకప్పటి అభివృద్ధికి నేటి అభివృద్ధికి ఎంతో తేడా ఉందని, అప్పుడు స్వయం సహాయక సంఘాలకు 50 కోట్ల రూపాయల రుణాలు ఇస్తే, ఇప్పుడు ప్రభుత్వం  వెయ్యి కోట్ల రూపాయల రుణాలు అందిస్తున్నదన్నారు. వడ్డీ లేని రుణాలు ఇస్తూ మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా పెద్ద మొత్తంలో రుణాలు అందిస్తుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆగస్టు మాసాంతం లోపు స్వయం సహాయక సంఘాలకు 500 కోట్ల రూపాయలు అందించడానికి ప్రణాళిక చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కెసిఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య మహిళ, అమ్మ ఒడి తదితర కార్యక్రమాలపై   ప్రతి మాసం జరిగే స్వయం సహాయక సంఘాల సమావేశాలలో ఆయా అంశాలపై మహిళలందరికీ అవగాహన కల్పించాలన్నారు. మహిళలందరూ ఆరోగ్యంగా ఆర్థికంగా ఎదగాలన్నారు.జిల్లాలో  87శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలో జరుగుతున్నాయని, వందకు వందశాతం ప్రభుత్వ ఆసుపత్రులలో జరిగేలా చూడాలని కోరారు. ఆసరా పింఛన్ల కింద జిల్లాలో ప్రతినెల  36 కోట్ల రూపాయల పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం వికలాంగుల పింఛన్ 4016 కు పెంచిందని మంజూరు ప్రొసీడింగ్స్ ఈ వారంలోగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డి ఆర్ డి ఏ పి డి శ్రీనివాసరావుకు సూచించారు.మహిళలు ఆర్థికంగా బలపడాలని, స్వయం సహాయక సంఘాల వాణిజ్య సముదాయాన్ని తొందరగా పూర్తయ్యేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. జిల్లాలో సబ్ సెంటర్ భవన నిర్మాణ కాంట్రాక్టు పనులు మహిళా సంఘాలకు ఇచ్చామని,వాటిని త్వరితగతిన పూర్తి చేసి రాష్ట్రానికి జిల్లా సమాఖ్య మహిళలు ఆదర్శంగా నిలవాలన్నారు. అంతకు ముందు చింతా ప్రభాకర్,జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్  జిల్లా సమాఖ్య భవనం ఆవరణలో మొక్కలు నాటారు. షాపింగ్ కాంప్లెక్స్ పనులను  పరిశీలించారు.మహిళా సమాఖ్య మహిళలు  ఏర్పాటు చేసిన వివిధ  ఉత్పత్తుల ప్రదర్శనను తిలకించారు. రెన్నో వేశన్ చేసిన భవనంలో పూజా కార్యక్రమాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ శ్రీనివాసరావు, ఏ పిడి సూర్యారావు,కంది జెడ్పీ టిసి, సేర్ఫ్ సిబ్బంది,డి పి ఎం లు, ఏ పి ఎం లు,జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు జ్యోతి,ఉపాధ్యక్షురాలు,కార్యదర్శి,మండల సమాఖ్య అధ్యక్ష,కార్యదర్షులు,సభ్యులు,డి ఆర్ డి ఏ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply