Take a fresh look at your lifestyle.

సిఎం కెసిఆర్‌తో యుపి మాజీ సిఎం అఖిలేశ్‌ ‌యాదవ్‌ ‌భేటీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 3 : ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఉత్తరప్రదేశ్‌ ‌మాజీ సీఎం అఖిలేష్‌ ‌యాదవ్‌ ‌సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఇద్దరు చర్చించారు. ప్రగతి భవన్‌కు చేరుకున్న అఖిలేష్‌ ‌యాదవ్‌కు సీఎం కేసీఆర్‌ ‌సాదరంగా స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకున్న అఖిలేష్‌ ‌యాదవ్‌కు మంత్రులు తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ‌ప్రశాంత్‌ ‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ ‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. అటు నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు చేరుకున్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని గద్దె దింపాలంటే విపక్షాలన్నీ ఏకం కావాలని సమాజ్‌వాడీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ ‌యాదవ్‌ ఈ ‌సందర్భంగా పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం నిమిత్తం హైదరాబాద్‌ ‌చేరుకున్న అఖిలేష్‌ ‌యాదవ్‌.. ‌బేగంపేట ఎయిర్‌పోర్టులో వి•డియాతో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీని గద్దె దించడమే విపక్షాల లక్ష్యం అని అఖిలేష్‌ ఉద్ఘాటించారు. బీజేపీ వ్యతిరేకులను కలుపుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విపక్షాల పోరాటంపై కేసీఆర్‌తో చర్చించేందుకు వొచ్చానని తెలిపారు. అందరి లక్ష్యం కూడా బీజేపీని అధికారం నుంచి దించడమే అని స్పష్టం చేశారు. కేసీఆర్‌తో భేటీ తర్వాత అన్ని విషయాలు మాట్లాడుతానని అఖిలేష్‌ ‌వెల్లడించారు.

Leave a Reply