Take a fresh look at your lifestyle.

‌ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నారు

రాష్ట్రంలో నిరంకుశ పాలన
జర్నలిస్ట్ ‌రఘును కిడ్నాప్‌ ‌చేయడం దారుణం
ఈటల చేరికపె స్పష్టత వొచ్చింది
పార్టీ సమావేశంలో రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌

రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతున్నదని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌మండిపడ్డారు. అరాచకాలను ప్రశ్నించే గొంతుకలను అణిచి వేస్తోందన్నారు. హైదరాబాద్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్‌ ‌చుగ్‌ ‌హాజరయ్యారు. ప్రస్తుత పరిణామాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఇందులో భాగంగా మాట్లాడిన బండి సంజయ్‌.. ‌మృగశిర ప్రారంభమైనా ధాన్యం కొనరా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్‌ ‌నిరంకుశ పాలనను వ్యతికించిన ప్రతి ఒక్కరినీ టార్గెట్‌ ‌చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ కారులను అణిచివేయడమే లక్ష్యంగా పాలన సాగుతోందన్నారు. వాళ్ళ కేబినెట్‌ ‌లో కీలక మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్‌ ‌కే భద్రత లేని పరిస్థితులు సృష్టించారని విమర్శించారు. వాళ్ల కు డబ్బా కొడితే మంచోళ్ళు.. లేకుంటే అవినీతిపరులన్న ముద్ర వేస్తున్నారని అన్నారు. జర్నలిస్టు రఘును పట్ట పగలు దొంగల్లాగా పోలీసులే కిడ్నాప్‌ ‌చేశారని బండి సంజయ్‌ ‌విమర్శించారు. టిఆర్‌ఎస్‌ ‌నాయకుల కబ్జాలను వెలికితీస్తే కిడ్నాప్‌ ‌చేస్తారా అని ప్రశ్నించారు.రాష్ట్రంలో ఒక మంత్రి స్థాయి వ్యక్తికి, జర్నలిస్టులకు, సామాన్యులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కేంద్రం ఉచితంగా ప్రకటించిన వ్యాక్సినేషన్‌ ‌ను సమర్థవంతంగా నిర్వర్తించే ఏర్పాట్లు రాష్ట్రం దగ్గర లేవన్నారు. వెంటనే అవసరమైనంత సిబ్బందిని నియమించే కోవాలని సూచించారు.

ప్రధాని ప్రకటించిన ఫ్రీ వ్యాక్సిన్‌ ‌సకాలంలో ప్రజలకు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం కావాలన్నారు. ఇప్పుడు తెలంగాణ వాదులు, ప్రజా స్వామ్యవాదులకు ఏకైక వేదిక బీజేపీ మాత్రమేనని.. పలువురు కీలక నాయకులు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని బండి సంజయ్‌ అన్నారు. ఇదిలావుంటే ఈ 14న ఈటల రాజేందర్‌ ‌బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నారు. ఈటల రాజేందర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ ‌రెడ్డి, కరీంనగర్‌ ‌జెడ్పీ మాజీ ఛైర్‌ ‌పర్సన్‌ ‌తుల ఉమ కూడా కాషాయం తీర్థం పుచ్చుకోనున్నారు.

ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌తమ పార్టీ సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్‌ ‌చుగ్‌ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌ ‌బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో  పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈటల రాజేందర్‌, ‌పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ 14‌న బీజేపీలోకి వస్తారని బండిసంజయ్‌ ‌తెలిపారు. కాగా ఈ నెల 13న ఈటల ఢిల్లీ వెళ్లి నడ్డా సమక్షంలో బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఈటల రాజేందర్‌ ‌బీజేపీలో చేరికపై బండి సంజయ్‌ ‌క్లారిటీ ఇవ్వడంతో ఈ ప్రచారానికి తెరపడింది.

Leave a Reply