Take a fresh look at your lifestyle.

18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలి

పరిగి,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని సహాయ ట్రైనీ కలెక్టర్ నారాయణ అమిత్ అన్నారు. స్వీప్ కార్యక్రమాలలో భాగంగా సోమవారం పరిగి పట్టణంలోని  పల్లవి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఓటరు అవగాహనపై కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ఇప్పటి వరకు ఓటరుగా నమోదు కాని ప్రతి ఒక్కరూ ఫామ్ – 6 ద్వారా ఈనెల 19 వరకు ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవాలని అన్నారు.  ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని, ఎన్నికలలో యువతీ యువకులు ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా  స్వచ్ఛందంగా, నిర్భయంగా మనకు పాలించే మంచి నాయకున్ని ఓటు వేసి ఎన్నుకునాలని ఆయన సూచించారు.  రాబోవు శాసనసభ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ ఓటింగులో  పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్వీప్ ఆక్టివిటీ కోఆర్డినేటర్ కోటాజి, ఆర్డిఓ విజయ కుమారి,జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శంకర్ నాయక్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మల్లయ్య, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సురేశ్వర్ స్వామి, కళాశాల ప్రిన్సిపల్ సిబ్బందితో పాటు డిగ్రీ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply