Take a fresh look at your lifestyle.

అర్హులైన బ్రాహ్మణులుకు సంక్షేమ పరిషత్ పథకాలు అందరూ ఉపయోగించుకోవాలి..!

  • బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఛైర్మన్ డా. కె వి రమణాచారి చే పాసింజర్ టాక్సీ ప్రారంభం

హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాల్లో పేద బ్రాహ్మణుల కొరకు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటుచేసి ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణుల గురించి, వారి అభ్యున్నతి కొరకు, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ స్కీమ్ లో భాగంగా ఉపాధి అవకాశాలు కల్పించాలనే భావనతో ప్రత్యేకంగా నిదులను కేటాయించారని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఛైర్మన్ డా. కె వి రమణాచారి అన్నారు.మంగళవారం బొగ్గులకుంట, తిలక్ రోడ్, ఎండోమెంట్ (బ్రాహ్మణ పరిషత్) ఆఫీస్ లో వివిద రంగాల్లో నైపుణ్యం ఉండి ఆర్థికంగా స్థోమత లేని వారిని ప్రోత్సహించే కార్యక్రమాంలో బాగంగా బ్రాహ్మణ పరిషత్ బెస్ట్ స్కీమ్ కింద లబ్ధిరారులు కొదురుపాక గ్రామం, సుల్తానాబాద్ మండలం, పెద్దపల్లి జిల్లా కి చెందిన “కొండపాక రంగాచార్య” కి స్వయం ఉపాదిలో భాగంగా ‘హోండా అమేజ్’ కారును బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఛైర్మన్ డా. కె వి రమణాచారి అందించారు..

ఈ కారు ఖరీధు (టోటల్ యూనిట్ కాస్ట్) 8.17 లక్షలు (ప్రభుత్వ పరిషత్ తరుపున 4.82 లక్షలు సబ్సీడీ).ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ..రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ప్రత్యేక నిధులతో వివిధ రకాల కుటీర పరిశ్రమలు, పేద బ్రాహ్మణుల పిల్లలు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోవడానికి ఆర్థికంగా ఎదగడానికి దోహదపడే విధంగా ఒక విద్యార్థికి 20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని, అదేవిధంగా పేద విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందిస్తున్నామని, వేద పాఠశాలల కొసం ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడానికి మూడు లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని పాత జిల్లా కేంద్రాలలో బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ ల కొరకు వెయ్యి గజాల స్థలం సంఘాలవారు లేదా వ్యక్తులు సమకూరిస్తే 80 లక్షలు వరకు ఆర్థిక సహాయం అందిస్తామని అదేవిధంగా వృద్ద వేద/స్మార్త పండితులకు ప్రతి నెల మూడు వేల పెన్షన్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

లబ్ధిదారులు కొండపాక రంగాచార్య మాట్లాడుతూ వివిధ రంగాలలో నైపుణ్యం ఉండి ఆర్థికంగా స్థోమత లేని వారికి మరియు నిరుద్యోగులకు ఇదొక సువర్ణావకాశమని, తనకు లభించిన చక్కటి అవకాశమని దీనికి కృషి చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర కన్వీనర్ వల్లూరి పవన్ కుమార్, బ్రాహ్మణ నాయకులు విన్నకోట రాజ్ కుమార్, మోత్కూరి సాయి శ్రవన్, ఆరుట్ల కరుణాకరాచార్యులు, సంక్షేమ పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply