Take a fresh look at your lifestyle.

నాడు మూసివేతలు నేడు ప్రారంభోత్సవాలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 7: ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగా పారిశ్రామిక రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొందని, నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా వేలాది పరిశ్రమలు ప్రారంభమవుతున్నాయని శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.మంగళవారం పటాన్ చెరు మండలం పాటి గ్రామ చౌరస్తాలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన పటాన్ చెరు ఫౌండ్రీస్ అసోసియేషన్ సమావేశానికి శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మినీ ఇండియా గా పేరు మీద పటాన్ చెరు నియోజకవర్గంలో 6 వేలకు పైగా పరిశ్రమలు తమ ఉత్పత్తిని కొనసాగిస్తున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ సులభతర వాణిజ్య విధానం తీసుకుని వచ్చి నూతన పరిశ్రమలకు రాష్ట్రాన్ని స్వర్గధామంగా తీర్చిదిద్దారని తెలిపారు. కార్మికుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయానికి ప్రతి ఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు అంజయ్య, శంకర్ యాదవ్, అసోసియేషన్ ప్రతినిధులు ఆనంద రెడ్డి, వెంకటేశ్వర్లు, ఐలా అధ్యక్షులు రమేష్, భారీ సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.ఫోటోగ్రాఫర్ల
 సంక్షేమానికి కృషి.పటాన్ చెరు నియోజకవర్గంలోని ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. పటాన్ చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా జరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఫోటోగ్రాఫర్లకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఎన్నికల అనంతరం ఫోటోగ్రాఫర్ల భవన నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు అనిల్, మాజీ అధ్యక్షుడు కృష్ణ యాదవ్, పవన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply