Take a fresh look at your lifestyle.

మల్బరీ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం

  • తెలంగాణ పట్టుకు మంచి డిమాండ్‌
  • ‌మల్బరీపై యువత దృష్టిసారించాలి
  • సెరికల్చర్‌ ‌సాగుపై మంత్రి హరీష్‌రావు టెలీకాన్ఫరెన్స్
  • ‌తమ్మీ శ్రీను ఏం చేస్తున్నావ్‌….ఎట్లున్నావ్‌…ఎట్లుంది ?
  • సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కంటే మల్బరీ సాగు తృప్తిగా ఉంది సార్‌..’ ‌యువ రైతు గొడుగు శ్రీనివాస్‌

మల్బరీ పంట(సెరీకల్చర్‌)‌ను సాగు చేసే రైతులకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహాన్ని అందజేస్తుందనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. మల్బరీకి అవసరమైన డ్రిప్‌, ‌స్ప్రింకర్లను కుడా సబ్సిడీ ద్వారా అందజేస్తామని రైతులకు మంత్రి భరోసా ఇచ్చారు. సెరికల్చర్‌ ‌సాగుపై ఆయన గురువారం జిల్లా పరిషత్‌ ‌ఛైర్ప్‌ర్సన్‌ ‌వేలేటి రోజారాధాకృష్ణ శర్మ, రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్‌ ‌వెంకట్రామరెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రామలక్ష్మీ, వ్యవసాయ అధికారి శ్రవణ్‌, ‌చిన్నకోడూరు ఎంపిపి కూర మాణిక్యరెడ్డి, చంద్లాపూర్‌, ‌గంగాపూర్‌, ‌మాచాపూర్‌, ‌గుర్రాలగొంది, మాల్యాల సర్పంచులు, మల్బరీ సాగు చేసే 50 మంది రైతులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. పట్టు పరిశ్రమ చేపట్టిన రైతులకు విరివిగా ప్రోత్సాహకాలు అందించనున్నట్లు, మల్బరీ తోటల సాగుకై 2 ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తే పట్టు పురుగుల పెంపకం కోసం ప్లాస్టిక్‌ ‌ట్రేలు, 300 ప్లాస్టిక్‌ ‌చంద్రికలు రాయితీపై అందిస్తామని చెప్పారు. సిఎస్బీ సబ్సిడీలు, ఎస్సీ సబ్‌ ‌ప్లాన్‌, ‌జనరల్‌ ‌కింద పథకం, యూనిట్‌ ‌కాస్ట్ ‌కాకుండా 65 శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. మల్బరీ సాగు చేస్తే మంత్రి ప్రోత్సాహాన్ని ఇస్తున్నందున ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలన్నారు.

మల్బరీ సాగు ఎంతో లాభదాయకమనీ, దేశంలో 130 కోట్ల జనాభాకు ప్రస్తుతం 30 వేల మిల్లి టన్నుల పట్టు ఉత్పత్తి అవసరముందనీ, ఇందుకుగానూ 4 లక్షల ఎకరాలలో పట్టు తోటల పెంపకం సాగు చేయాల్సిన అవసముందన్నారు. ఇప్పటి వరకు దేశంలోని కర్ణాటకలో 2 లక్షల 50 వేల ఎకరాలలో సాగు చేస్తూ మొదటి స్థానంలో ఉందన్నారు. తెలంగాణలో 7 వేల ఎకరాల్లో పట్టు తోటల పెంపకం సాగు చేస్తున్నారనీ, ఒకే సంవత్సరంలో 8 నుంచి 10 పంటలు సాగు చేయొచ్చన్నారు. తెలంగాణ రాష్ట్రం పట్టు ఉత్పత్తిలో గ్రేడ్‌-ఎం ‌నాణ్యత కలిగి ఉన్నందున మంచి డిమాండ్‌ ఏర్పడిందన్నారు. వరి విస్తీర్ణం పెరిగినందున ఎక్కువ మోతాదులో ఉత్పత్తి వస్తున్నందున ఇతర పంటలపై శ్రద్ధ చూపాలని కోరారు. పట్టు తోటల పెంపకం ద్వారా 1 ఎకరంలో నెలకు 50 వేల రూపాయలు సంపాదించొచ్చన్నారు. ఈ పట్టు తోటల పెంపకం కోసం అవసరమైన భూసార పరీక్షలు చేయించాలని డిఏవో శ్రవణ్‌ను, మల్బరీ నర్సరీ ఏర్పాటు చేసి, దానికి అనువైన బయో ఎరువులను పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. సిద్ధిపేట నియోజక వర్గంలోని చంద్లాపూర్‌, ‌గంగాపూర్‌, ‌మాచాపూర్‌ ‌గ్రామాల్లో 200 ఎకరాల సాగుకై రైతులు ముందుకు రావాలని, రైతులు ముందుకొస్తే ఆ ప్రాంతంలో పట్టు రీలింగ్‌ ‌యూనిట్‌ ఏర్పాటుకై కృషి చేస్తానని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. ఉద్యాన వన శాఖ అధికారులు ఈ సాగుపై పలు సూచనలు, సలహాలు కూడా చేశారు.

తమ్మీ శ్రీను ఏం చేస్తున్నావ్‌….ఎట్లున్నావ్‌…ఎట్లుంది ?
సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కంటే మల్బరీ సాగు తృప్తిగా ఉంది సార్‌..
‌యువ రైతు గొడుగు శ్రీనివాస్‌
‌మల్బరీ సాగుపై టెలికాన్ఫరెన్స్ ‌నిర్వహించిన మంత్రి హరీష్‌ ‌రావు కొంతమంది రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలని తెలుసుకున్నారు. చంద్లాపూర్‌కు చెందిన గొడుగు శ్రీనివాస్‌తో కూడా మంత్రి మాట్లాడారు. ఏం శ్రీను ఏం చేస్తున్నావ్‌..‌తమ్మి ఎట్లున్నావ్‌ అని ఆప్యాయంగా అడుగుతూ.. మల్బరీ సాగు ఎలా అనిపిస్తుందని అడిగారు. దీనికి శ్రీనివాస్‌ ‌స్పందిస్తూ…‘సార్‌ ‌సాఫ్ట్ ‌వేర్‌ ఉద్యోగం కంటే ఇది సంపాదన, తృప్తినిస్తుంది సార్‌’ అని సమాధానం ఇచ్చాడు. శ్రీనివాస్‌… ఏం ‌చదువుకున్నావ్‌ అని అడిగితే నేను డిగ్రీ పూర్తి చేసిన. రెండు సంవత్సరాల నుండి ఖాళీగా ఉండ లేక ప్రతి సంవత్సరం రెండు మూడు ఎకరాలు వేస్తూ సాగు చేస్తున్న. మంచి లాభదయకం. ఈ సారీ కూడా సాగు చేస్తా. మీరు చెప్పినట్లు ఆర్థికంగా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు.

సమ్మర్‌ ‌స్పెషల్‌గా పర్యాటకులకు నెక్లెస్‌ ‌రోడ్డు అందుబాటులోకి తేవాలి…
సిద్ధిపేటలోని కోమటి చెరువుపై రాష్ట్రానికే తలమానికంగా నిర్మించిన నెక్లెస్‌ ‌రోడ్డును సమ్మర్‌లో పట్టణ ప్రజలకు సమ్మర్‌ ‌స్పెషల్‌గా అందుబాటులోకి తేవాలని సిద్ధిపేట మునిసిపల్‌ ‌ఛైర్మన్‌, ‌కమిషనర్‌, ‌సంబంధిత అధికారులను మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. కోమటి చెరువుపై ఒక కొత్త అందం సంతరించుకోనుందనీ, ఈ సమ్మర్‌లో కోమటిచెరువు ఒక ప్రత్యేకతను పట్టణ ప్రజలకు అందించనున్నదని చెప్పారు. ఆదిశగా రెండు మూడు రోజుల్లో పనులు పూర్తి చేసి ప్రారంభించేందుకు సిద్ధం చేయాలన్నారు. సిద్ధిపేట పట్టణ అభివృద్ధి, పెండింగ్‌ ‌పనులపై మంత్రి హరీష్‌రావు మున్సిపల్‌ ‌ఛైర్మన్‌ ‌రాజనర్సు, కమిషనర్‌ ‌రమణాచారి, పబ్లిక్‌ ‌హెల్త్ ఈఈ ‌ప్రతాప్‌, ఏఈ ‌లతో టెలికాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టణంలో బిటి, సిసి రోడ్లు పనులపై అరా తీశారు. బిటి రోడ్డు వేసిన విక్టరీ థియేటర్‌ ‌నుండి కోర్టు వరకు, ఇక్బాల్‌ ‌మినార్‌ ‌నుండి బారాహిమాం వరకు, సుభాష్‌ ‌రోడ్డులో పూర్తి అయిన బిటి రోడ్డుకు వెంటనే పెయింట్స్, ‌స్లడ్స్ ‌వేయాలనీ, అదేవిధంగా హౌసింగ్‌ ‌బోర్డ్ ‌కాలనీ, శ్రీనివాస్‌ ‌నగర్‌ ‌రోడ్డు పనులు వేగవంతం చేయాలని సూచించారు. పట్టణంలో సిసి రోడ్లు త్వరితగతిన పూర్తి కావాలనీ, అండర్‌ ‌గ్రౌండ్‌ ‌డ్రైనెజ్‌, ‌గ్యాస్‌ ‌పైప్‌ ‌లైన్‌ ‌పనులు వేగవంతం చేస్తూ తీసిన గుంతలను పూడ్చి సిసి రోడ్లు వేయాలన్నారు.

రెండు మూడు రోజుల్లో స్వచ్ఛ్ ‌బడిని ప్రారంభానికి సిద్ధం చేయాలి..
సిద్దిపేట పట్టణం చెత్త సేకరణలో దేశానికే ఆదర్శంగా నిలిచిందనీ, తద్వారా జాతీయ అవార్డులు సాధించి దేశానికి రోల్‌ ‌మోడల్‌గా నిలుస్తోందని చెప్పిన మంత్రి హరీష్‌రావు…అదే స్ఫూర్తితో స్వచ్ఛతపైనే పాఠాలు చెప్పే విధంగా దక్షిణ భారత దేశంలో మొట్టమొదటిదిగా స్వచ్ఛ్ ‌బడిని సిద్దిపేటలో నిర్మించుకున్నామనీ, ఇప్పటికే పనులు చివర దశలో ఉన్నాయన్నారు. వొచ్చే రెండు మూడు రోజుల్లో స్వచ్ఛ్ ‌బడిని ప్రారంభించేలా అధికారులు కృషి చేయాలన్నారు. అదేవిధంగా పట్టణంలో కుక్కలు, కోతుల బెడద ఎక్కువ ఉండటం వలన ఎనిమల్‌ ‌బర్త్ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ ‌కూడా ఏర్పాటు చేసుకున్నామనీ, దానిని కూడా ప్రారంభించుకుందామన్నారు. మున్సిపాలిటి ఏర్పాటు చేసిన స్వచ్ఛ్ ‌స్క్వాడ్‌ ‌వాహనం ప్రతి రోజు వీధుల్లో తిరుగుతూ చెత్త సేకరణపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలన్నారు. చెత్త రోడ్లపై వేయకుండా చెత్త బండిలోనే వేసే విధంగా తెలియజేయాలన్నారు. ఉదయం వెళ్లే చెత్త బండ్లు సమయ పాలన పాటిస్తూ ఉండేలా చూడాలనీ, పట్టణంలో దోమల నివారణకు ఫాగింగ్‌ ‌వాహనం ప్రతి నిత్యం వెళ్లేలా చూడాలనీ, కొరోనా నేపథ్యంలో హైడ్రోక్లోరిన్‌ ‌కూడా పిచికారి చేయాలని మంత్రి హరీష్‌రావు సూచించారు.

Leave a Reply