Take a fresh look at your lifestyle.

తెలంగాణ ఆర్థర్‌ ‌కాటన్‌ అలీ నవాజ్‌ ‌జంగ్‌ ‌బహదూర్‌

  • ‌తెలంగాణ నీటిపారుదల పితామహుడు
  • అలీ నవాజ్‌ ‌జంగ్‌ ‌బహదూర్‌
  • ‌నేడు… తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవం

తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 11న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించ బడుతుంది. హైదరాబాదుకు చెందిన ఇంజనీరు అలీ నవాజ్‌ ‌జంగ్‌ ‌బహదూర్‌ ‌జన్మదినమైన జూలై 11ను తెలంగాణ ప్రభుత్వం 2014లో తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవంగా ప్రకటించి, ఆయన జయంతి ఉత్సవాలను ఎర్రమంజి ల్‌లోని జలసౌధలో ఘనంగా జరిపింది. తెలంగాణ ఆర్థర్‌ ‌కాటన్‌గా, తెలంగాణ నీటిపారుదల పితామహుడిగానూ, అభివర్ణించ బడిన నవాబ్‌ అలీ నవాజ్‌ ‌జంగ్‌ ‌బహదూర్‌ ‌తెలంగాణ గర్వించదగిన హైదరాబాదుకు చెందిన గొప్ప ఇంజనీరు. ఆయన 1877, జూలై 11న హైదరాబాదు లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. సెయింట్‌ ‌జాన్‌ ‌గ్రామర్‌ ‌స్కూల్‌, ‌నైజాం కళాశాలల్లో చదువు కున్నారు. మంచి మార్కులతో చదువులో ప్రతిభ కనబరిచారు. పలు ఉపకార వేతనాలను పొందారు. ఆయన ప్రతిభను గుర్తించిన ఆరో నిజాం ఆయనను చదువుకోవడం లండన్‌ ‌పంపారు. ఆయన ఇంజనీరింగ్‌ ‌పూర్తి చేసుకుని తిరిగి వచ్చారు. నిజాం సంస్థానంలో పబ్లిక్‌ ‌వర్కస్ ‌శాఖలో ఉద్యోగంలో చేరారు.

చీఫ్‌ ఇం‌జినరింగ్‌ ‌సెక్రెటరీ స్థాయికి చేరుకున్నారు. నిజాం ప్రభువు ప్రోత్సాహంతో తన హయంలో ఎన్నో ఇంజనీరింగ్‌ ‌నిర్మాణాలు చేపట్టారు. ప్రతి పనినీ గమనిస్తూ దగ్గరుండి నిర్మాణాలను త్వరితగతిన పూర్తయ్యేలా చేశారు. ఉస్మానియా ఆర్టస్ ‌కళాశాల, ఉస్మానియా ఆసుపత్రి, యునానీ దవాఖాతా నిర్మాణంలో ఆయన ఇంజనీరింగ్‌ ‌ప్రతిభ బహిర్గతం అవుతుంది. నాటి హైదరాబాద్‌ ‌రాజ్యంలో అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, నిర్మింప చేశారు. తెలంగాణ ప్రాంతంలో గోదావరి, మంజీరా నదులపై పలు సాగునీటి ప్రాజెక్టులు, డ్యామ్లు, హైదరాబాద్‌, ‌చారిత్రక కట్టణం నిర్మాణాలను ఆయనే డిజైన్‌ ‌చేశారని చరిత్రకారులు చెపుతారు.

ప్రభుత్వాలపై భారం పడకుండా దీర్ఘకాలం రైతులకు ప్రజలకు ఉపయోగకరంగా తక్కువ ఖర్చు, నాణ్యతతో కూడిన సాగునీటి ప్రాజెక్టులు నవాబ్‌ అలీ నవాజ్‌ ‌జంగ్‌ ‌బహదూర్‌ ‌నిర్మించారు. తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే నవాబ్‌ అలీ నవాజ్‌ ‌జంగ్‌ ‌బహదూర్‌ ‌గౌరవార్థం తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా 2014, జూలై 10న జి.ఓ. నంబరు 18 జారీచేసి, అలీ నవాజ్‌ ‌జంగ్‌ ‌బహదూర్‌ ‌జన్మదినాన్ని తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవంగా ప్రకటించి ప్రతి సంవత్సరం అధికారికంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

ఏడాదికి లక్షల మంది ఇంజనీర్లు తయారవు తున్నారు. ఆయా విభాగాల్లో శిక్షణ ఇవ్వడానికి పలు యూనివర్సిటీలు సేవలు అందిస్తున్నాయి. తల్లి దండ్రులు తమ పిల్లలు… వైద్యుడు, ఇంజనీరు కావాలని ఆకాంక్షిస్తున్నారు. ఇంతటి ప్రాచుర్యం కలిగిన ఈ విద్య కోసం పోటీ పడి చదువు తున్నారు. ఇంజనీరింగ్‌ ‌సీట్ల కోసం విద్యార్థులు అహో రాత్రులు కష్టపడు తున్నారు. ఇంజనీరింగ్‌ ‌విద్య పూర్తికాక ముందే నేడు స్వ, విదేశీ కంపెనీల క్యాంపస్‌ ఎం‌పికల పేరుతో ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారు. వేల నుంచి లక్షల వరకు వేతనాల చెల్లిస్తున్నారు. గతంలో ఎంతో ఆదరణ చూరగొన్న సివిల్‌ ఇం‌జనీరింగ్‌ ‌ప్రభుత్వ రంగంలో అవినీతిలో కూరుకు పోయిందనే ఆరోపణలున్నాయి. ఇదే ప్రయివేటు సెక్టార్‌లో ప్రతిభతో కూడిన కాసుల గల గలల కొలమానంగా మారింది.

ప్రభుత్వ ఆధీనంలో అభివృద్ధిలో భాగంగా వేసిన రోడ్లు, కట్టిన భవనాలు, నిర్మించిన చెరువులు, ప్రాజెక్టులు, వేసిన పైపులైన్లు కూలి పోవడం, తెగి పోవడం, పగిలి పోవడం గమనిస్తూనే ఉన్నాం. కారణాలు ఏమైనప్పటికీ నాణ్యతకు ప్రతిభ తోడు కాక పోవడమే అని నిపుణులు అంటున్నారు. నాణ్యతకు రాజకీయం, అవినీతి అడ్డుగా నిలుస్తున్నాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇంజనీరింగ్‌ ‌రంగంలో రాణించి, తెలంగాణ ఆర్థర్‌ ‌కాటన్‌గా, తెలంగాణ నీటిపారుదల పితామహుడిగా పేరెన్నిక గన్న నవాబ్‌ అలీ నవాజ్‌ ‌జంగ్‌ ‌బహదూర్‌ ‌పుట్టిన రోజున జరుపుకునే తెలంగాణ ఇంజనీర్స్ ‌డే సందర్భంగా సృజనాత్మకమైన వృత్తి నైపుణ్యాలతో పరిమితమైన వనరుల తోనే నాణ్యమైన పనులు నిర్వహించి మోక్ష గుండం విశ్వేశ్వరయ్య, సర్‌ ఆర్థర్‌ ‌కాటన్‌, ‌నవాజ్‌ ‌జంగ్‌ ‌బహదూర్‌ ‌వలే ప్రజల మదిలో చిరకాలం నిలిచి పోయేందుకు ప్రతీ ఇంజనీర్‌ ‌కృషి చేయాల్సిన అవసరం అనివార్యంగా ఉంది.
– సంగనబట్ల రామకిష్టయ్య

Leave a Reply