Take a fresh look at your lifestyle.

జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్.. జిల్లాలో 69.79 శాతం పోలింగ్ నమోదు

వికారాబాద్‌ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 30: జిల్లాలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగినట్లు పోలింగ్ లో భాగంగా జిల్లాలో 69. 79% పోలింగ్ నమోదైనట్లు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. గురువారం శాసనసభ ఎన్నికల పోలింగ్లో భాగంగా వికారాబాద్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా పోలైన ఓటర్ శాతం వివరాలు. వికారాబాద్ 68.1% పరిగి 69.34% తాండూర్ 71.2% కొడంగల్ 70.5 పోలింగ్ శాతం నమోదు అయినట్లు తెలిపారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా సాగినట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు తప్ప భారీ మొత్తంలో ఘర్షణలు కానీ ఎలాంటి సంఘటనలు కానీ చోటు చేసుకోలేదని కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో భాగంగా వికారాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే ఆనంద్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, జిల్లా ఎస్పీ కోటిరెడ్డిలు వికారాబాద్ పట్టణంలోని సంఘం లక్ష్మీబాయి పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూతులో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Leave a Reply