Take a fresh look at your lifestyle.

సిద్దిపేటలో విభజన గాయాల స్మృతి దినం సందర్భంగా బిజెపి మౌన ర్యాలీ

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: విభజన గాయాల స్మృతి దినం సందర్భంగా సోమవారం బిజెపి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర దేవాలయం నుండి అంబేడ్కర్ సర్కిల్ వరకు మూతికి నల్ల గుడ్డలు ధరించి చేపట్టిన మౌన ప్రదర్శనలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ ..1947 ఆగస్ట్ 14 దేశ విభజనకు నిర్ణయం తీసుకున్న రోజు అని ఆంగ్లేయులు ఈ దేశం బాగుంటే ఎప్పటికైనా పోటీ అవుతుందనే దురుద్దేశ్యంతో డివైడ్ అండ్ రూల్ అనే పాలసీ తోటి మతం పేరిట హిందూస్తాన్, పాకిస్తాన్ అని విభజించారని అన్నారు.నేటికీ స్వాతంత్ర్య సిద్ధించి 7న్నర దశాబ్దాల తర్వాత కూడా ఇంకా వాటిని కొనసాగిస్తున్నారని ఇది సరైనది కాదన్నారు.ప్రధాని మోడీ అజాడి కి అమృత్ పేరిట ఆరోజు జరిగిన దేశ విభజన గాయాలు అందరికీ తెలిపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.జరిగిన సంఘటనలు. భావితరాలకు గుర్తు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.నాటి ఉన్మాద చర్యలు పుస్తకాలలో చెప్పకుండా చరిత్ర భావితరాలకు అందకుండా చేశారని ఆరోపించారు.ఆనాటి గాయాలు నేటి తరానికి చూపట్టాలని నేడు, పోటో ల రూపేణ వస్తు రూపేణ, ఎగ్జిబిషన్ రూపేణ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు.దేశంలోని 736 జిల్లా కేంద్రాల్లో ర్యాలీ లు నిర్వహించి దేశాన్ని విచ్ఛిన్నం చేసిన కారకులు ఎవరు..? మతం పేరిట చేసిన అనర్ధాలు ఏమిటి ..? అని భావితరాలను జాగృతం చేస్తున్నామని చెప్పారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గంగాడి మోహన్ రెడ్డి,విద్యాసాగర్,రామచంద్ర రావు,ఉపేందర్ రావ్,బూరుగు సురేష్ గౌడ్,కోడూరి నరేష్, ఉడుత మల్లేశం,పత్రి శ్రీనివాస్ యాదవ్,శ్రీనివాస్ రెడ్డి, పరుశరాములు,కొత్తపల్లి వేణుగోపాల్,బైరి శంకర్,గోనె మార్కండేయులు,అరుణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేటలో తిరంగా ర్యాలీ. ఆజాదికా అమృత్ మహోత్సవం  పురస్కరించుకొని బిజెపి జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సిద్దిపేట పట్టణంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు.పార్టీ కార్యాలయం నుండి పాత బస్టాండ్ మీదుగా రూరల్ పోలీస్ స్టేషన్ వరకు తిరంగా ర్యాలీ కొనసాగింది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆజాదిక అమృత్ మహోత్సవం సందర్భంగా ఈ నెల 15వ తేదీ లోపు ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద జాతీయ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు.వ్యక్తిగత అభిప్రాయాలు కుల ,మత, ప్రాంతాల అభిప్రాయ భేదాలకన్నా జాతీయ భావనే అత్యుత్తమమన్నారు.ప్రతి ఒక్కరూ నా దేశం అని భావించినప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందన్నారు.కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తుందన్నారు.ప్రభుత్వం అన్ని వర్గాలకు సముచిత న్యాయం అందిస్తూ సంక్షేమ ఫలాలను చివరి వ్యక్తి వరకు అందిస్తుందని శ్రీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.కార్యక్రమంలో బిజెపి నాయకులు గంగాడి మోహన్ రెడ్డి , విద్యాసాగర్, రాంచంద్రరావు, పత్రి శ్రీనివాస్ యాదవ్, ఉపేందర్ రావు, ఉడుత మల్లేశం ,తొడుపునూరి వెంకటేశం వేణుగోపాల్,రాములు, కుమారస్వామి, నర్సింహ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పర్ష రాములు, బైరి శంకర్, రమేష్ గౌడ్, అరుణ రెడ్డి పద్మ,లత,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply