Take a fresh look at your lifestyle.

ఔర్ ఏక్ దక్కా దేడ్ లాక్ పక్కా

సిద్దిపేట ప్రజల గౌరవాన్ని పెంచిన మీకు మెజారిటీలో పోటీ పడతాం.
 మాకు 5ఏళ్లుగా అభివృద్ధి చేసారు… అండగా ఉన్నారు.
ఈ నెల రోజులు మీ గురించి కష్టపడతాం.
మేము పోటా పోటీగా ప్రచారం చేస్తాము.
ముక్తకంఠంతో నినదించిన బి ఆర్ ఎస్ కార్యకర్తలు.
సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 1: రాష్ట్రంలో చీడ పురుగులు పట్టి తిరుగుతున్నాయి… అలాంటి చీడ పురుగులను తరిమి వేయాలి అంటే.. బిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాదించాలి. కెసిఆర్ కు అండగా మీరు రాష్ట్రం తిరిగి రండి సార్…మేము సిద్దిపేటలో మీ గురించి పని చేస్తాము అంటూ  ముక్తకంఠంతో బిఆర్ఎస్ కార్యకర్తలు నినదించారు. సిద్దిపేట పద్మనాయక, బాలాజీ గార్డెన్ లో పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీష్ రావు  పాల్గొన్నారు.ఈ సందర్బంగా నాయకులు, కార్యకర్తలు మంత్రి హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడారు.. సిద్దిపేట ఖ్యాతి ని ఎల్లలు దాటించారు.. సిద్దిపేట ప్రజల మా కార్యకర్తల గౌరవాన్ని పెంచారు.. మీరు మాకు ఐదు ఏళ్ళు ఆపదలో కష్టంలో ఉన్నారు. మేము మీ ఎన్నికల్లో కష్టడి మరో సారి లక్ష మెజారిటీ దాటిస్తామని చెప్పారు.ప్రభాకర్ అన్నకు అండగా ఉందాం.మంత్రి హరీష్ రావు. ఎంపీ ప్రభాకర్ రెడ్డికి అలా జరగడం తీవ్రంగా కలచివేసింది. మంచి మనిషిని ఎవరో దుర్మార్గుడు అలాగే చేశారని మంత్రి హరీష్ రావు అన్నారు… చిన్న పేగు నాలుగు చోట్ల రంద్రం పడింది.కడుపు ఓపెన్ చేసి 17
 సేంటి మీటర్లు సర్జరీ చేసి చిన్న పేగు తొలగించారు.ప్రభాకర్ అన్నకు మనందరం అండగా నిలవాలసిన బాధ్యత ఉంది.సిద్దిపేటలో ఉండే ప్రతి కార్యకర్త అన్న గెలుపు కోసం కృషి చేయాలి.మన గెలుపు ఎంత ముఖ్యమో ప్రభాకర్ రెడ్డి గెలుపు మనకు అంతే ముఖ్యమన్నారు. స్నేహితులు బంధువులు ఎవరు ఉన్న అందరికి చెప్పి గెలుపుకు కృషి చేయాలని కోరారు. గెలిచిన ఎమ్మెల్యే దుబ్బాకలో ఎంతో పొడుగు చెప్పి రూపాయి కూడా ఎమ్మల్యే చేయలేదు. అందరూ సీరియస్ గా పని చేయాలి. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలి. విద్యార్థులు, యువతను భాగస్వామ్యం చేయాలి.  అందరినీ కలుపుకొని పోవాలి అన్నారు.100 ఓట్ల ఇంచార్జీల పాత్ర ఎంతో కీలకం. గత ఎన్నికల్లో పెద్ద మెజార్టీ సాధించడంలో సఫలం అయ్యాము. ఇళ్ల స్థలాల విషయంలో రాని వారికీ తప్పక న్యాయం చేద్దాం. ఒక బూత్, గ్రామం, మండలం మధ్య పోటీ పడాలి.మనకు కాంగ్రెస్, బిజెపితో పోటీ కాదు, మనకు మనతోనే పోటీ.ప్రతి ఇంటికి సిద్దిపేట అభివృద్ధి పుస్తకం చేరాలి.ఒక పుస్తకం ఎన్నో సమాధానాలు.మన పదేళ్ల సిద్దిపేట ప్రగతి పుస్తకాన్ని ప్రతి ఇంటికి చేరాలి.నవ సిద్దిపేటగా మన సిద్దిపేట ను చేసుకున్నామని ఆ ప్రగతి పుస్తకాన్ని మంత్రి హరీష్ రావు  ఆవిష్కరణ చేసారు. సిద్దిపేట నియోజకవర్గం అభివృద్ధి ని కళ్ళకు కట్టినట్టు పుస్తక రూపంలో చేసుకున్నామని ఈ పుస్తకాన్ని ప్రతి ఇంటికి చేరే విధంగా చూడలన్నారు..ఒక పుస్తకం… ఒక ఫోటో ఎన్నో సమాధానాలకు అర్థమని చెప్పారు.

Leave a Reply