Take a fresh look at your lifestyle.

చనిపోతూ ఇంకొకరికి బ్రతుకునివ్వండి

Let someone else die by dying

తెలంగాణ నేత్ర శరీర అవయవదాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ‌పరికిపండ్ల అశోక్‌

మట్టెవాడ: బ్రతికుండగా చేసే దానం కన్నా చనిపోతూ చేసే అవ యవదానం కలకాలం చిరంజీవిలా నిలిచిపోతుందని, ఇంకొకరికి అవయవదానం చేసి బ్రతుకునివ్వాలని తెలంగాణ నేత్ర శరీర అవయవదాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ‌పరికిపండ్ల అశోక్‌ ‌పిలుపు నిచ్చారు. బుధవారం ఖిలావరంగల్‌ ‌ప్రభుత్వ జూనియర్‌ ‌కళాశాలలో ఇంచార్జ్ ‌ప్రిన్సిపాల్‌ ‌జి.ప్రసాదరావు అధ్యక్షతన బుధవారం అవయవదాన అవగాహన కార్య క్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన అశోక్‌ ‌మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అవయవదానంలో మొదటి స్థానంలో ఉందని, చనిపోయిన తరువాత దేహాన్ని మట్టిలో పూడ్చడం ద్వారా మట్టిపాలు చెయ్యకుండా, కాల్చడం ద్వారా బూడిద పాలు చెయ్యకుండా శరీరాన్ని దానం చేసి భవిష్యత్తు పరిశోధనలకు ఉపయోగపడవచ్చునన్నారు.
సీనియర్‌ ‌వైద్యులు ఆడెపు రాజేంద్రప్రసాద్‌ ‌మాట్లాడుతూ నేత్ర దానంతో నలుగురు అంధుల్లో వెలుగులు, బ్రెయిన్‌ ‌డెడ్‌ ‌జరిగినప్పుడు అవయవాల దానంతో 18 మంది జీవితాల ఆయుష్హును పెంచవచ్చునని తెలిపారు. రక్తదా నంతో మరొకరి జీవితాన్ని నిలబెట్టవచ్చునని, అదే అవయవాన్ని దానం చేసినట్లయితే పైనుండి కూడా అవయవాలు స్వీకరించిన వారిని చూడవచ్చునని అన్నారు. ప్రతి ఒక్కరు చనిపోయిన తర్వాత తమ అవయవాన్ని దానం చేయాలన్నారు. కార్యక్రమంలో నేత్ర శరీర అవయవదాతల సంఘం ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా అధ్యక్షులు కొండారెడ్డి మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు ఉపేందర్‌రెడ్డి, ఆధ్యాత్మికవేత్త కొండలరావులతోపాటు ఉపాధ్యాయ బృందం చంద్రమౌళి, రజిత, విజయ చందర్‌ ‌రాజు, శుక్లాంబరం, విద్యార్థులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply