- అత్యవసర వైద్య సేవల కోసం మెడికల్ పోర్టల్
- ఫోన్ చేస్తే అత్యసవర సేవలు అందుతాయి : కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొరోనాను ఎదుర్కొనేందుకు అంకిత భావంతో పని చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కొన్ని నగరాలు, పట్టణాల్లో పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయన్నారు. ఇందుకు కారణం మర్కజ్ ప్రార్థనలు చేసిన సభ్యులేనన్నారు. వారంతా తెలంగాణతో పాటు.. దేశంలోని అన్ని రాష్టాల్రకు వెళ్లారన్నారు. దేశంలో 60శాతం కరోనా కేసులు మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారివేనన్నారు. కేంధ్ర అధికారుల బృందాన్ని ప్రభుత్వం పంపించిందని.. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం.. సలహాలిచ్చేందుకు ఈ బృందం పని చేస్తుందని కిషన్‌రెడ్డి తెలిపారు. అయితే ఎమర్జెన్సీ కేసులు పూర్తిగా తగ్గి పోయాయని.. ఇది విచిత్రమైన పరిస్థితి అన్నారు. ఏదైనా జబ్బు వస్తే ఎక్కడికి వెళ్లాలో కూడా అర్థం కాని పరిస్థితి అన్నారు. ఇలాంటి వారిని ఆదుకోవాల్సిన పని ఉందన్నారు. ఆరోగ్య సేతు యాప్‌లో ఆరోగ్య వివరాలు పొందుపరిస్తే… తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుందన్నారు. అందరూ ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుంటే చుట్టూ ఉన్న వారికి కరోనా ఉంటే అలర్ట్ చేస్తుందని కిషన్‌రెడ్డి వెల్లడించారు. చాలా మంది డాక్టర్లు ప్రజలకు సేవలందిస్తామని ముందుకు వచ్చారన్నారు. ఒత్తిడిలో ఉన్న ప్రజాసేవకు ముందుకు వచ్చిన వారికి అభినందనలు తెలిపారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సేవకులు ఉంటారని.. ఏదైనా అనారోగ్యంతో బాధ పడుతుంటే సంబంధిత డాక్టర్లకు ఫోన్ చేసి మెడికల్ అసిస్టెన్స్ తీసుకోవచ్చన్నారు. అన్ని విభాగాల డాక్టర్లు ఇందులో ఉన్నారని కిషన్‌రెడ్డి వెల్లడించారు. వృద్దులు.. మహిళలు.. దివ్యాంగుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. లాక్డౌన్ సమయంలో ఈ డాక్టర్ల సేవలను వినియోగించుకోవాలన్నారు. దివ్యాంగులు.. వృద్దులకు ఇంటికే మెడిసిన్ తెచ్చిస్తారని వెల్లడించారు. ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించడం లేదన్నారు. దీంతో కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ప్రజలు ఏ సేవ చేసేందుకు ముందుకు వచ్చినా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలన్నారు. అందరికీ మనం అండగా ఉన్నామన్న భరోసా ఇవ్వాలని కిషన్‌రెడ్డి సూచించారు. ఇదిలావుంటే తన నియోజకవర్గ ప్రజలకు అత్యవసర సేవలకు గాను నగరంలోని బీజేపీ కార్యాలయంలో మెడికల్ పోర్టల్ ను కిషన్‌రెడ్డి ఢిల్లీ నుంచి ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు ఈ పోర్టల్ ద్వారా అత్యవసర వైద్య సేవలను అందించనున్నారు.
అనారోగ్యానికి గురైతే ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి వారిని ఆదుకోవాల్సిన అవసరముందన్నారు. పేదలను వైద్య పరంగా ఆదుకునేందుకు డాక్టర్ల బృందంతో మాట్లాడి ప్రతి నియోజకవర్గంలో వారికి సేవలందించేందుకం సిద్ధంగా ఉన్నాం. ప్రతి అసెంబ్లీలో నియోజకవర్గంలో సేవకులు ఉంటారు. ఏదైనా అనారోగ్యంతో బాధ పడుతుంటే సంబంధిత డాక్టర్లకు ఫోన్ చేస్తే వైద్య సహాయం అందిస్తారు. అన్ని విభాగాల డాక్టర్లు ఇందులో ఉన్నారు. హైదరాబాద్ పరిధిలో ఒక్కో డాక్టర్ కు ఇద్దరు బీజేపీ కార్యకర్తలు అసిస్టెంట్లు గా ఉంటారు. ఈ కార్యక్రమం వృద్దులు, మహిళలు, దివ్యాంగులకోసం ఏర్పాటు చేశాం కాబట్టి వారికే మొదటి ప్రాధాన్యం ఉంటుంది. లాక్డౌన్ సమయంలో ఈ డాక్టర్ల సేవలను వినియోగించుకోవాలి. దివ్యాంగులు, వృద్దులకు ఇంటికే తమ సహాయకులు మెడిసిన్ తెచ్చిస్తారని కిషన్ రెడ్డి అన్నారు అందరికీ మనం అండగా ఉన్నామన్న భరోసానివ్వాలని చెప్పారు. హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నవారు తమ హెల్ప్ లైన్ నంబర్ 9959261273 కి కాల్ చేయొచ్చని లేదా వెబ్ సైట్ లో లాగిన్ అయి జబ్బు వివరాలు డాక్టర్స్ కు వివరించవచ్చన్నారు. ఈ మెడికల్ పోర్టల్ ప్రారంభానికి బీజేపీ నేతలు ప్రకాష్ రెడ్డి, గౌతమ్ రావు, అజయ్, డాక్టర్లు సురేష్ గౌడ్, జిగ్నేశ్ గోకాని హాజరయ్యారు.