Take a fresh look at your lifestyle.

నిరసనలు వ్యక్తం చేస్తున్న హోంగార్డులను అరెస్టు చేయడం దారుణం : ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈసి.శేఖర్ గౌడ్, త్యాలపల్లి కృష్ణ

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,జూలై 26 : తమ న్యాయమైన కోర్కెలు నెరవేరేందుకు హోంగార్డులు నిరసన వ్యక్తం చేస్తుంటే వారిని పోలీసులు మహిళా హోంగార్డులు అని చూడకుండా అరెస్టులు చేయడం దారుణమని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈసి.శేఖర్ గౌడ్(మామ) త్యాలపల్లి కృష్ణలు మండిపడ్డారు. బుధవారం వారు ‘ప్రజాతంత్ర’ తో మాట్లాడుతూ,కొన్ని సంవత్సరాలుగా హోంగార్డులు సంబంధిత పోలీస్ స్టేషన్లో పోలీసులకి వెట్టి చాకిరి చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.నేడు వారు చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం ద్వారా అనుమతులు తీసుకొని ఇందిరాపార్కు వద్ద నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు కల్పించుకొని వారిని దారుణంగా అరెస్టులు చేయడం హేయమైనా చర్య అని వారు అభిప్రాయపడ్డారు.రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నట్టు లేదని ఇతర దేశాల నుండి వచ్చి ప్రజలను పాలిస్తున్నట్లు ఉందని వారు ఆరోపించారు.చాలి చాలని వేతనాలతో జీవనం గడుపుతున్న హోంగార్డులు తమ తమ న్యాయమైన కోరికల కోసం తమను కానిస్టేబుల్ గా నియమించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారని వారు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కనీసం హోంగార్డులకు విలువలు ఇవ్వకుండా వారిని పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు మండిపడ్డారు.ఎప్పటికీ ఒకే కాలం ఉండదని సంవత్సరంలో మూడు కాలాలు నమోదు అవుతాయని అలాగే హోంగార్డులకు సైతం రానున్న కాలంలో వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత వారిని పోలీసు శాఖలో పర్మినెంట్ చేసి వారికి తగు గౌరవం దక్కేలా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయ్యాక తమకు అనుకూల పవనాలు వస్తాయని అనుకున్న హోంగార్డుల పరిస్థితి దయనీయంగా మారిందని వారు ఆవేదనను వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్లో సిఐ,ఎస్ఐలు వారి చేత వెట్టిచాకిరి చేయించుకొని వారిని ఒక పని మనుషుల్లాగా తయారు చేసుకున్నారని,ఇది ఒకింతకు బాధాకరమైన విషయమని అన్నారు.పోలీస్ శాఖలో చేస్తున్న ఉద్యోగులు ఎన్ని గంటలు డ్యూటీ చేస్తున్నారో వారు సైతం అన్ని గంటల డ్యూటీ చేస్తున్నారని వారికి తగిన వేతనం ప్రభుత్వం ఇవ్వకుండా వారిని అవహేళన చేసినట్టుగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు.ఇప్పటికైనా హోంగార్డుల వ్యవస్థను పర్మినెంట్ చేసి వారిని వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లేనియేడల వారి తరఫున కాంగ్రెస్ పార్టీ పోరాటాలకు సిద్ధం అవుతుందని వారు హెచ్చరించారు.

Leave a Reply