- ఈనెల 27 నుంచి ఉపాధ్యాయులు పాఠశాలలకు రావాల్సిందే ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. కొరోనా కారణంగా ఇప్పటి వరకు విద్యా సంవత్సరం ప్రారంభానికి నోచుకోలేదు. అయితే, ఇప్పటికే విద్యా సంవత్సరం సగం వరకు గడచిపోవడంతో పాటు కొరోనా కూడా క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి 2020 21 విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్నట్లు ప్రకటించింది. ఈమేరకు సోమవారం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 27 నుంచి ఉపాధ్యాయులంతా పాఠశాలలకు హాజరు కావాలని ఆదేశించింది.
టీవీ, టీశాట్, వివిధ డిజి•ల్ పద్దతులను అనుసరించి విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఈ ఉత్తర్వులలో ప్రభుత్వం స్పష్టం చేసింది. మూడో తరగతి ఆపై స్థాయి విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే ఈ తరగతులు ఉంటాయని పేర్కొంది. కాగా,ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంపై ఈనెల 5న జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. ఇందుకు అనుగుణంగా పాఠశాల విద్యా శాఖ ఉన్నతాధికారులు పలు దఫాలు సమావేశాలు నిర్వహించి సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు నిర్వహించాలని తాజాగా నిర్ణయించారు. అలాగే, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఇందుకు అనుగుణంగా మార్గదర్శకాలను సిద్ధం చేయాలని ఉత్తర్వులలో ఆదేశించారు.