Take a fresh look at your lifestyle.

కేంద్ర ఎన్నికల వ్యయ పరిశీలకుల నియామకం

రంగారెడ్డి జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 3:  రంగారెడ్డి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల వ్యయ పరిశీలకులుగా ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ 2010  వారణాసి  బ్యాచ్ కు చెందిన ప్రియరంజన్ శ్రీవాస్తవ, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ 2012  బ్యాచ్ చెందిన వినోద్ కుమార్ అహిర్వార్ లను  భారత ఎన్నికల కమిషన్, రంగారెడ్డి జిల్లా జిల్లా ఎన్నికల వ్యవ పరిశీలకులుగా నియమించిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోలీకేరీ తెలిపారు. శుక్రవారం జిల్లాకు చేరుకున్న వ్యయ పరిశీలకులు ప్రియరంజన్ శ్రీవాస్తవ, వినోద్ కుమార్ అహిర్వార్ లకు  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోలీకేరీ అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ తో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ ను, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసిఎంసి) సెంటర్ ను ఎన్నికల వ్యయ పరిశీలకులు ప్రియరంజన్ శ్రీవాస్తవ, వినోద్ కుమార్ అహిర్వార్ (ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్ అధికారులు) పరిశీలించారు. ఎన్నికల సందర్భంగా ఎంసిఎంసి ద్వారా చేపడుతున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంసిఎంసి కేంద్రంలోని రికార్డులను తనిఖీ చేశారు. కంట్రోల్ రూమును పరిశీలించారు. అబ్జర్వర్ల వెంట అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్, లైజన్ అధికారి తదితరులు ఉన్నారు.

Leave a Reply