Take a fresh look at your lifestyle.

కొరోనా’ పేషెంట్లకు ఇంట్లోనే చికిత్స: మంత్రి ఈటల రాజేందర్

కొరోనా పాజిటివ్‌ పేషెంట్లకు ఇంట్లోనే చికిత్స అందిస్తామని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.ఇంట్లోనే కొరోనా చికిత్సకు ప్రజలంతా సహకరించాలని మంత్రి కోరారు. దవాఖాన ల్లో పేషెంట్ల సంఖ్య పెరిగితే వైద్యుల పై ఒత్తిడి పెరుగుతుంది.. జీవనోపాధి కోల్పోకూడదని మాత్రమే లాక్‌డౌన్‌ ఎత్తివేశామని, అవసరం లేకుండా బయటికి వచ్చి ప్రాణాలమీదకి తెచ్చుకోవద్దన్నారు.
ప్రజలు ఎక్కువగా బయటకు రావడంతో కొరోనా వ్యాప్తి పెరిగిందని. వృద్ధులకు, ఆరోగ్య సమస్యలున్నవారికి కొరోనా సోకితే మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కొరోనా సోకకుండా ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటించాలని. కొరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరికీ హైదరాబాద్‌లో చికిత్స అందించడం అసాధ్యం..  జిల్లా కేంద్రాల్లోనే ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం.. ప్రాథమిక ఆరోగ్యకేంద్రం స్థాయిలోనే కొరోనా చికిత్స అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.

Leave a Reply