మనిషి
మున్నాళ్ళు ముచ్చట ముడి తెగి
ఆరాటం గుండె ఆగి
పోరాటం సెగలు ఆరి
ఆఖరి ముస్తాబుతో
బంధాన్ని వీడి
మౌనధారాలతో
సూన్యధారిలా
చావు జంటతో
ఒంటరిగా
మిగిలిన అన్ని ప్రశ్నలకు
చితి ని జవాబు చేసి
కన్నీటి కొలనులో
జ్ఞాపకాల పాపలా
కాసేపు మాట్లాడుతున్నాడు
మరికాసేపట్లో ‘‘మాయ’’కు
ఓ ‘సజీవసాక్ష్యం’ గా
ఓ నీర్జీవ ‘సాక్షి’ లా
తరలిపోతున్నాడు…
తగలపడిపోతున్నాడు..
-చందలూరి నారాయణరావు
9704437247