Take a fresh look at your lifestyle.

భద్రాద్రి రాముడి ఆశీస్సులతో ‘ఇందిరమ్మ ఇళ్ళు’

22,500 కోట్లతో 4.50 లక్షల ఇళ్ళు మంజూరు

 పేదవారి సొంతింటి కల సాకారమే పథకం లక్ష్యం
ఇందిరమ్మ ఇళ్ల పథకంను లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి
 
image.png

image.png

image.png

image.png
భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 11 : భద్రా చలం శ్రీ సీతారామ చంద్రస్వామి ఆశీర్వాదంతో ఇందిరమ్మ పథకంను ప్రారంభించుకోవడం జరిగిందని ఈ పథకం ద్వారా 22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి చెప్పారు. ఆరు గ్యారెంటీలలో భాగంగా సోమవారం నాడు భద్రాచలం వ్యవసాయ మార్కెట్‌ కమిటి గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ళు పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభిం చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లా డుతూ… భద్రాద్రి రాముడు సాక్షిగా ఇందిరమ్మ ఇళ్ళు పథకం ప్రారంభించుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. పేదవాడి సొంతింటి కలను సాకారం చేయటమే ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇళ్ళ పథకం లక్ష్యమని అన్నారు. ఆనాడు ఎన్నికల మ్యానిఫెస్టోలో సోనీయా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. తాము ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే మహిళలకు ఉచిత బస్‌ సౌకర్యం, 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌,  ఇందిరమ్మ పథకం ద్వారా ఇళ్ళు, గృహ జ్యోతి, పేదవారి కోసం ఆరోగ్య శ్రీ పథకాన్ని తమ ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా పేదలు వేలాది రూపాయలు కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నందున ఉచితంగా 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌ అందించటం జరిగిందని చెప్పారు. పేదలకు ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయలు అందిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఎస్సీ, ఎస్టీ కులాలకు ఆరు లక్షల రూపాయలు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇచ్చిన పథకాలను గత ప్రభుత్వం లాగా ప్రజలను మభ్య పెట్టకుండా అమలు చేసే దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ పథకాన్ని ఆడబిడ్డల పేరుతో పట్టాలు ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇల్లాలు ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు సుఖసంతోషాలతో ఉంటుందని స్పష్టం చేసారు. గత కేసీఆర్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళ పేరుతో వోట్లు వ్యాపారం చేసారని విమర్శించారు. పదేళ్ళు చెప్పిన కథనే మళ్ళీ మళ్ళీ చెప్పి తెలంగాణ ప్రజలను కేసీఆర్‌ మోసం చేసారని విమర్శించారు. గడిచిన ఎన్నికల్లో కేసీఆర్‌ మాయమాటలను గుర్తు పెట్టుకుని కేసీఆర్‌ పాలనను బొంద పెట్టి ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని అన్నారు. 2014 నుండి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలు ఉండగా 2014లో టిఆర్‌ఎస్‌కు ఒకే సీటు, 2019లో టిఆర్‌ఎస్‌కు మళ్ళీ ఒకటే సీటు 2023లో టిఆర్‌ఎస్‌కు కేవలం ఒకటే సీటు దక్కిందని గుర్తుచేసారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు కాంగ్రెస్‌ను 9 సీట్లు గెలిపిస్తూనే ఉన్నారని సంతోషం వ్యక్తం చేసారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు కాంగ్రెస్‌పై ఎంతో మక్కువ ఉందని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి
కె.చంద్రశేఖర్‌ రావు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళు ప్రజలకు ఇచ్చామని జబ్బలు చరుసుకుంటున్నారని దుయ్యబట్టారు. దమ్ముంటే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ళు కట్టిన ప్రాంతంలో వోట్లు అడిగి గెలవాలని తాము నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ళు ప్రాంతంలో తాము వోట్లు అడిగి గెలుస్తామని కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. దేశ వ్యాప్తంగా బిజెపి ప్రభుత్వం పేదలకు ఇళ్ళు ఇస్తామని 2022లో ప్రకటించిందని ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని ఇళ్లు ఇచ్చిందో లెక్క చెప్పాలని ప్రశ్నించారు. దిల్లీలో రైతులు చేస్తున్న ధర్నాను బిజెపి ప్రభుత్వం రైతులను బలి తీసుకుందని విమర్శించారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మోసం చేసిన కేసీఆర్‌ : ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క
కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మాజీ ముఖ్యమంత్రి బిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌ రావు ప్రజలను మోసం చేసారని ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక శాఖా మాత్యులు మల్లు భట్టీ విక్రమార్క విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళు, నిధులు, నియమకాలను కేసీఆర్‌ ప్రభుత్వం ప్రక్కదారి పట్టించిందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వొచ్చిన 90 రోజుల్లోనే ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో మహిళలకు ఉచిత ఆర్టీసి ప్రయాణం ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచటం, 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌ , గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్‌ల వరకు ఉచిత విద్యుత్‌ అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికి దక్కిందని చెప్పారు. భద్రాద్రి రామయ్య సాక్షిగా ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని ప్రారంభించటం చాలా సంతోషంగా ఉందని స్పష్టం చేసారు. ప్రతీ నియోజవర్గానికి 3,500 ఇల్లు మంజూరు చేస్తూ భద్రాద్రి రామయ్య సన్నిధి సాక్షిగా ప్రారంభించినట్లు చెప్పారు. దశాబ్ద కాలంగా పేదలు ఎదురు చూస్తున్న సొంతింటి కలను సాకారం చేయటానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రకటించిన గ్యారెంటీల అమలులో భాగంగా సొంతింటి కలను సాకారం చేస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల గురించి కేసీఆర్‌ ప్రభుత్వం అపహాస్యంగా మాట్లాడారని విమర్శించారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని భద్రాచలం వచ్చి రాముల వారి ఆశీర్వాదం తీసుకుని పేదల అభ్యున్నతి కోసం చిత్తశుద్దితో పనిచేసిన ప్రభుత్వం కాంగ్రెస్‌ ప్రభుత్వం అని చెప్పారు.
వాగ్దానాలు చేయటమే తప్ప ఆచరణలో పెట్టని బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల కాలంలో వాగ్దానలు ఇవ్వడమే తప్ప ఆచరణలో ఏమాత్రం పెట్టకుండా కాలయాపన చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బిఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని రెవెన్యూ శాఖా, సమాచార పౌరసంబంధాల శాఖా మాత్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి విమర్శించారు. ఆనాడు ఉమ్మడి ఇందిరమ్మ రాజ్యంలో సుమారు 38 లక్షల ఇళ్ళు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వం అని గుర్తు చేసారు. ఎలంగాణ రాష్ట్రంలోని 15 లక్షల ఇళ్ళు కట్టి ఇవ్వడం జరిగిందని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే అధికారంలోకి ఎక్కిన కేసీఆర్‌ ప్రభుత్వం 10 సంవత్సరాలు ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. డబుల్‌ బెడ్‌రూం అంటూ బొమ్మలు చూపించి ప్రజలను మభ్య పెట్టారని విమర్శించారు. భద్రాద్రి రామయ్యకు కూడ పది కోట్లు ఇస్తానని చెప్పి మోసం చేసారని , రాములవారిని మోసం చేసినందుకే కేసీఆర్‌కు తగిన శాస్తి జరిగిందని అన్నారు. అంతేకాకుండా గోదావరి వరదలు భద్రాచలం పట్టణానికి రాకుండా తాను ఉకర్చీ వేసుకుని కుర్చోని కరకట్ట నిర్మాణం చేపడతానని చెప్పి వెయ్యి కోట్లు ప్రకటించారని అన్నారు. ప్రకటించి ఏళ్ళు గడిచిన కార్యరూపం దాల్చలేదని విమర్శించారు. తమ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన వెంటనే నిధులు సమకూర్చి కరకట్ట నిర్మాణాన్ని పొడిగించటం జరుగుతుందని చెప్పారు. గడిచిన మూడు నెలల్లోనే ఆరుగ్యారెంటీల అమలు చేయటంలో చిత్తశుద్దితో తమ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉందని చెప్పారు.

పెండిరగ్‌లో ఉన్న పథకాలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం : వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల
భద్రాద్రి రాములవారితో తనకు ఎంతో అనుబంధం ఉందని ఏదో రీతిలో ఈ ప్రాంతంలో అభివృద్ది కార్యక్రమాలు తన ద్వారా రాములవారు చేయిస్తునే ఉన్నారని అన్నారు. ఈ జిల్లాలో పెండిరగ్‌లో ఉన్న వాజేడు మండలంలో మోడుగుంట ప్రాజెక్టు పూర్తి స్థాయిలో సామర్ధ్యాన్ని తీసుకురావాలని కోరారు. అలాగే వెంకటాపురంలోని పాలెంవాగు ప్రాజెక్టు ను సామర్ధ్యంలోకి తీసుకురావాల్సి ఉందని చెప్పారు. అందుకోసం ఇరిగేషన్‌ శాఖా మాత్యులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఆర్ధికశాఖా మాత్యులు భట్టీ విక్రమార్కలకు విన్నవించటం జరిగిందని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. దుమ్ముగూడెం మండలంలోని ప్రగళ్ళపల్లి ఎత్తిపోతల పథకాన్ని సాకారం చేసుకోవల్సిన అవసరం ఉందని అన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఈ జిల్లాలో రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అదికూడ పూర్తిస్థాయిలో పనులు చేసేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. గతంలో నిర్మించిన కరకట్ట ప్రస్తుతం సుభాష్‌ నగర్‌ కాలనీ వరకు పొడిగించి ఎత్తు చేయటం వలన గోదావరి వరద భద్రాచలం పట్ణణానికి రాకుండా ఉంటుందని చెప్పారు. అందుకోసం పనులు ముమ్మరంగా జరుగుతున్నట్లు చెప్పారు.ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చేసిన కేసీఆర్‌ అని విమర్శించారు. అయినప్పటికి  భయపడకుండా ఎన్నికోట్లు ఖర్చయిన రాష్ట్రాన్ని అభివృద్ది చేయటంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముందుకు సాగుతున్నారని చెప్పారు. ప్రస్తుతం ఉన్న మంత్రులంతా ఒక్కటిగా కలిసి పనిచేయటం వలనే రాష్ట్ర అభివృద్ది జరుగుతుందని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో గిరిజన శాఖా మాత్యులు ధనసరి అనసూయ, దేవదాయ , ధర్మాదయ శాఖా మంత్రి కొండా సురేఖ, ఇరిగేషన్‌ శాఖా మాత్యులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, మంత్రులు శ్రీధర్‌ బాబు, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, శాసన సభ్యులు జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, రాఘమయి, డా. తెల్లం వెంకట్రావు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌, భద్రాచలం మాజీ శాసన సభ్యులు పొదెం వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
స్వామివారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి, మంత్రులు
స్వామివారి బ్రహ్మోత్సవాల పోస్టర్‌ ఆవిష్కరణ
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి  భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఆయనకు మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభం, వేదమంత్రోచరణలతో ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి శేష వస్త్రత్రం, స్వామివారి తీర్థప్రసాదాలు, స్వామి వారి చిత్ర పటం, మేమొంటో అందజేసి ఆశీర్వాదం ఇచ్చారు. అనంతరం ఏప్రిల్‌ 17వ తేదీన జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం మరియు పట్టాభిషేకం కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సహచర మంత్రులతో ఆవిష్కరించారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు , ఉత్తంకుమార్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి దనసరి సీతక్క ఉన్నారు. వీరి వెంట జిల్లా కలెక్టర్‌, ప్రియాంక అలా, ఎస్పీ రోహిత్‌ రాజ్‌,  దేవదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌, ఆలయ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రమాదేవి, తదితరులు ఉన్నారు.

Leave a Reply