Take a fresh look at your lifestyle.

పేపర్‌ ‌లీకేజ్‌ ‌కేసులో ఇంటిదొంగలు

ముగ్గురి అరెస్ట్‌తో తెరపైకి పలువురి పేర్లు
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 23 : టీఎస్పీఎస్సీ ఇంటి దొంగల బాగోతం బయటపడుతుంది. ప్రశ్నాపత్రం లీకేజ్‌ ‌కేసు లో సిట్‌  ‌విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వొచ్చాయి. గ్రూప్‌ 1 ‌పరీక్షలో 103 మందికి వందకుపైగా మార్కులు వొచ్చినట్లు సిట్‌ ‌గుర్తించింది. దీంతో విచారణలో భాగంగా పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌పేపర్‌ ‌లీకేజ్‌ ‌కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ ‌చేశారు. కమిషన్‌లో ఇందులో పని చేస్తున్న ఇంటిదొంగలను గుర్తించారు. వీరిలో రమేష్‌ ‌కుమార్‌, ‌శవి•మ్‌, ‌సురేష్‌ ‌లను సిట్‌ అధికారులు అరెస్ట్ ‌చేశారు. ఈ ముగ్గురు నిందితులు సైతం గ్రూప్‌ 1 ఎగ్జామ్‌ ‌రాసి 100కి పైగా మార్కులు పొందినట్లు విచారణలో సిట్‌ అధికారులు గుర్తించారు. పేపర్‌ ‌లీకేజ్‌ ‌ద్వారానే ఈ ముగ్గురు ఎగ్జామ్‌ ‌రాశారని పోలీసులు చెబుతున్నారు.  26 మంది గ్రూప్‌ 1 ‌ప్రిలిమ్స్ ‌రాయగా.. వారిలో 8 మంది క్వాలిఫై అయ్యారని గుర్తించారు. పని చేస్తున్న 30 మందికి ఇప్పటికే సిట్‌ అధికారులు నోటీసులు ఇచ్చారు. అనుమానితులందరినీ విచారించి.. వారి పాత్రపైనా ఆరా తీయనున్నారు.
మార్చి 23వ తేదీన మరోసారి సిట్‌ ‌విచారణకు కాన్ఫిడెన్షియల్‌ ‌సెక్షన్‌ ఆఫీసర్‌ ‌శంకరలక్ష్మి హాజరు కానున్నారు. మరోవైపు.. 9 మంది నిందితులకు మార్చి 23వ తేదీతో కస్టడీ విచారణ ముగియనుంది. మరోసారి కస్టడీకి తీసుకోవడానికి కోర్టులో సిట్‌ అధికారులు పిటిషన్‌ ‌వేయనున్నారు. గ్రూప్‌ 1 ‌రాసిన వారిలో 20 మంది టీఎస్పీఎస్సీలో వివిధ భాగాల్లో పనిచేస్తున్నారు. దీంతో సిట్‌ అధికారులు టీఎస్పీఎస్సీలో పని చేస్తున్న రాజశేఖర్‌ ‌రెడ్డితో సహ 42 మందికి నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను ఎఫ్‌ఐఆర్‌ ‌జాబితాలో చేర్చారు. దీంతో నిందితుల సంఖ్య మొత్తం 12కు చేరుకుంది. కాగా టీఎస్పీఎస్సీలో సిస్టం ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తికి 120 మార్కులు వచ్చాయి.
ఇప్పటికే మరో ముగ్గురిని సిట్‌ ‌పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రూప్‌ 1 ‌రాసి టాప్‌ ‌మార్కులు సాధించిన రమేష్‌, ‌షవి•మ్‌, ‌సురేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. రమేష్‌ ‌టీఎస్పీఎస్సీ ఔట్‌ ‌సోర్సింగ్‌ ఉద్యోగి, షవి•మ్‌ ‌శాశ్వత ఉద్యోగి, సురేష్‌ ‌గతంలో టీఎస్పీఎస్సీ టెక్నికల్‌ ‌సెక్షన్‌లో ఔట్‌ ‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేసి బయటకు వెళ్ళాడు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ప్రవీణ్‌, ‌రాజ్‌ ‌శేఖర్‌ ‌పెన్‌ ‌డ్రైవ్‌లను అధికారులు సీజ్‌ ‌చేశారు. పెన్‌ ‌డ్రైవ్‌లకు కూడా ప్రవీణ్‌, ‌రాజ్‌ ‌శేఖర్‌ ‌పాస్‌వార్డ్ ‌పెట్టారు. రూ. 14 లక్షల నగదు ఆర్ధిక లావాదేవీలపై సిట్‌ ఆధారాలను సేకరించింది. ప్రశ్నపత్రాలు ఇచ్చిన రేణుకకు నిలేశ్‌, ‌గోపాల్‌ ‌ద్వారా రూ.14 లక్షల నగదు అందినట్లు ఆధారాలను సిట్‌ ‌సేకరించింది. రాజశేఖర్‌ ‌కాంటాక్టస్, ‌వాట్స్ అప్‌ ‌చాటింగ్‌ ‌వివరాలను సిట్‌ అధికారులు సేకరించారు.

Leave a Reply