Take a fresh look at your lifestyle.

రక్తమోడిన రహదార్లు

  • వేర్వేర్లు రోడ్డు ప్రమాదాల్లో 8మంది మృతి
  • శుభకార్యానికి వెళుతూ అనంతలోకాలకు

రాష్ట్రంలో రహదారులు రక్తమోడాయి. సోమవారం ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి చెందగా, 20 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. సంగారెడ్డి జిల్లాలోని కొల్చారం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెదక్‌ ‌రూరల్‌ ‌సిఐ రాజశేఖర్‌ ‌కథనం ప్రకారం… సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మెదక్‌ ‌నుండి సంగారెడ్డి వెళ్తున్న క్రమంలో కొల్చారం మండలం సంగాయపేట గ్రామ శివారులో ఫసల్వాది నుండి ఏడుపాయల వెళ్తున్న డిసిఎం ను 12.10 గంటలకు ఢీకుంది .ఏడుపాయల దుర్గామాత వద్దకు శుభకార్యానికి వెళుతుండగా, ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద స్థలంలో మాధవి, దుర్గమ్మ ,రజిత, మాణెమ్మ . మంజుల మృతి చెందారు. మెదక్‌ ఏరియా హాస్పిటల్‌ ‌లో చికిత్స పొందుతూ 10 ఏళ్ల మధురిమ బాలిక మృతి చెందింది. మిగిలిన 24 మంది క్షతగాత్రులకు వైద్య చికిత్సలు అందించారు. శుభ కార్యానికని వెళుతూ తిరిగిరాని లోకానికి చేరడంతో ఆయా కుటుంబాలు, బంధువుల కుటుంబాలలో తీవ్ర విషాధం నెలకొంది.

Blood-stained roads in medakబంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. సంగాయిపేట దగ్గర ఆర్‌టిసి బస్సు-డిసిఎం ఢీకొనడంతో ఐదుగురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారంతా మహిళలే కావడం విశేషం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ట్రాఫిక్‌ అం‌తరాయం కలగకుండా రోడ్డుపై ఉన్న వాహనాలను పక్కకు తొలగించారు. మృతులు సంగారెడ్డి మండలం ఫసల్‌వాడీ వాసులుగా గుర్తించారు. ఏడుపాయల దుర్గామాతని దర్శించుకొని వెళ్తుండగా ఈఘటన చోటుచేసుకుంది. కాగా, నార్సింగి మండల కేంద్రం సపంలో 44 వ జాతీయ రహదారిపై అగి ఉన్న లారీని ్నఓ వ్యాన్‌ ‌ఢీకొట్టింది.

Blood-stained roads in medakఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన అంజి, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట్‌ ‌మండలం దమ్మన్నపేట్‌ ‌గ్రామానికి చెందిన ఈరవేని కృష్ణ, డ్రైవర్‌ ‌కిష్టయ్యలున్నారు. ఈ ఘటనలో గాయపడ్డ కావ్య, అజయ్‌ ‌ను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మాచారెడ్డికి చెందిన రవి అనే వ్యక్తిని దుబాయ్‌ ‌కు పంపించడానికి హైదరాబాద్‌ ‌లోని శంషాబాద్‌ ‌విమాన శ్రయానికి వెళ్లి తిరిగి వస్తుండగా తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది.

Leave a Reply

error: Content is protected !!